MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Feel Good Movies: చిన్న సమస్యే కొండలా కనిపిస్తుందా? ఈ 5 సినిమాలు చూస్తే మనసులో భారమంతా మాయం

Feel Good Movies: చిన్న సమస్యే కొండలా కనిపిస్తుందా? ఈ 5 సినిమాలు చూస్తే మనసులో భారమంతా మాయం

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే మనసును భారంగా మారుస్తాయి. అలాంటి టైంలో ఒంటరితనం, ఆశ, కష్టం, ప్రేమ, స్నేహం లాంటి ఎన్నో ఫీలింగ్స్‌ను చూపించే ఈ 5 ఫీల్ గుడ్ సినిమాలు చూస్తే చాలు... మనసు తేలికపడుతుంది!

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. A Man Called Otto
Image Credit : Asianet News

1. A Man Called Otto

భార్యను కోల్పోయాక ఓట్టో జీవితంపై ఆసక్తి కోల్పోయి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. అతని జీవితంలోకి ఒక కొత్త కుటుంబం వచ్చినప్పుడు, మొదట చిరాకుపడ్డా, తర్వాత ఆ కుటుంబంతో ఏర్పడిన స్నేహం అతని జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా, ఓట్టోకు, అతని కొత్త పొరుగువారికి మధ్య చిగురించే బంధం ఈ సినిమాకు బలం. ఒంటరిగా ఉన్న వ్యక్తి జీవితంలోకి మనుషుల ప్రేమ, స్నేహం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ సినిమా అందంగా చూపిస్తుంది. కథలో విషాదం ఉన్నా, కామెడీ, మానవత్వం, ప్రేమ కలగలిపి ఉండటంతో, చివరకు మనసును తేలికపరిచే అనుభూతినిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. Free Guy
Image Credit : freeguymovie Instagram Page

2. Free Guy

ప్రతిరోజూ ఒకేలాంటి జీవితం గడిపే బ్యాంక్ ఉద్యోగి 'గై', తాను ఒక వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ అని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతని జీవితం కొత్తగా కనిపిస్తుంది. తన నిర్ణయాలు తనే తీసుకోవడం మొదలుపెట్టాక, అతనికి ప్రేమ, స్నేహం దొరకడమే కాకుండా, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలనే స్పృహ కలుగుతుంది. కామెడీ, యాక్షన్, ప్రేమ అన్నీ ఉన్న ఈ సినిమా, మన రోజువారీ జీవితాన్ని మరో కోణంలో చూసేలా ప్రేరేపిస్తుంది. 'నేను ఇలాగే బతకాలని ఎవరు చెప్పారు?' అనే ఆలోచనను ఈ సినిమా రేకెత్తిస్తుంది.

35
3. The Pursuit of Happyness
Image Credit : fubiz Instagram Page

3. The Pursuit of Happyness

క్రిస్ గార్డనర్‌ జీవితంలోకి ఒకేసారి ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, ఉండటానికి ఇల్లు లేకపోవడం, కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత... ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. కానీ, తన కొడుకు కోసం, భవిష్యత్తు కోసం అతను పోరాటం ఆపడు. ఒక కంపెనీలో దొరికిన ట్రైనింగ్ అవకాశాన్ని వాడుకుని, కఠోర శ్రమతో తన జీవితాన్ని మార్చుకుంటాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జీవితంలో ఎంత కింద పడినా, ప్రయత్నం ఆపకపోతే పరిస్థితిని మార్చవచ్చనే భరోసా ఇస్తుంది. మనసు కుంగిపోయినప్పుడు చూడాల్సిన పర్‌ఫెక్ట్ సినిమా ఇది.

45
4. The Map of Tiny Perfect Things
Image Credit : tinyperfectmovie Instagram Page

4. The Map of Tiny Perfect Things

మార్క్ అనే యువకుడు ఒకే రోజును పదే పదే జీవించే విచిత్రమైన టైమ్-లూప్‌లో చిక్కుకుపోతాడు. అదే పరిస్థితిలో ఉన్న మార్గరెట్‌ను కలిశాక, ఇద్దరూ కలిసి ఆ ఒక్క రోజులో జరిగే చిన్న చిన్న అందమైన క్షణాలను గమనించడం మొదలుపెడతారు. పెద్ద విజయాలు లేదా అద్భుతమైన సంఘటనలలోనే ఆనందం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, ఒక చిన్న నవ్వు, అనుకోని పరిచయం, అందమైన క్షణం... ఇలా మనం గమనించకుండా వదిలేసే విషయాల్లో కూడా ఆనందం ఉందని ఈ సినిమా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ప్రేమ, టైమ్-లూప్, కామెడీ లాంటి ఆసక్తికరమైన అంశాలతో సాగే ఈ సినిమా, జీవితాన్ని కాస్త నెమ్మదిగా ఆస్వాదించాలని చెబుతుంది.

55
5. The Secret Life of Walter Mitty
Image Credit : waltermittymovie Instragram Page

5. The Secret Life of Walter Mitty

వాల్టర్ మిట్టీ ఒక సాధారణ ఆఫీస్ ఉద్యోగి. అతని జీవితంలో ఎలాంటి థ్రిల్ ఉండదు. కానీ, తన ఊహాలోకంలో మాత్రం అతను పెద్ద పెద్ద సాహసాలు చేస్తుంటాడు. ఒకరోజు, తన ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫోటోను వెతకడానికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణం అతన్ని, కేవలం ఊహల్లో మాత్రమే చూసిన ప్రపంచంలోని నిజమైన సాహసాలకు దారి తీస్తుంది. జీవితం గురించి కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు వేయాలన్నదే ఈ సినిమా ఇచ్చే అందమైన సందేశం. అద్భుతమైన విజువల్స్, ప్రయాణం, కామెడీ, స్ఫూర్తిదాయకమైన కథ ఉన్న ఈ సినిమా మనసుకు హాయినిస్తుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
(114.1 ov) 368 & 231/5
INDIND
(166.0 ov)720/9
Day 5 - Session 3
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Neethu Master Remuneration: 6 వారాలకు నీతూ మాస్టర్‌ అందుకు పారితోషికం ఎంతో తెలుసా? ఇంత తక్కువా?
Recommended image2
Jr NTR: తన ఫస్ట్ సినిమాలో ఎన్టీఆర్ కు నచ్చని విషయం ఏంటి? ఆ ఒక్క విషయంలో ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు?
Recommended image3
OM Movie 3 Days Collections: నెగటివ్‌ టాక్‌తోనూ దుమ్ములేపే వసూళ్లు.. ఓం కి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా
Recommended image2
KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved