MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ

KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ

చిరంజీవి నటిస్తున్న డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోని చిత్ర టైటిల్ రివీల్ అయింది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నేడు ఆగష్టు 22న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు అంటే ఆయన కోట్లాదిమంది అభిమానులకు పండగే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవిదేశాల్లో ఉన్న చిరు అభిమానులంతా పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా మార్చేలా గిఫ్ట్ వచ్చేసింది. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వ్ వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'కాకా' టైటిల్ ఫిక్స్
Image Credit : Asianet News

'కాకా' టైటిల్ ఫిక్స్

తాజాగా ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ, సినిమా థీమ్ ని తెలియజేసేలా డీటెయిల్స్ ఇస్తూ గ్లింప్స్ వదిలారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న కాకా అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ అయింది. టైటిల్ చాలా కూల్ గా ఉంది. గ్లింప్స్ లో కంటెంట్ కూడా కూల్ గా చూపించారు కానీ.. సినిమా చాలా వయలెంట్ గా ఉండబోతున్నట్లు హింట్స్ ఉన్నాయి. గ్లింప్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళదాం.

35
అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ
Image Credit : Asianet News

అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ

అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ కంపెనీలో కె. సత్యం అనే పేరుతో చిరంజీవి సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవి లుక్ చాలా సింపుల్ గా ఉంది. కానీ ఆ కంపెనీలో అన్నీ మిస్టీరియస్ గా అనిపిస్తున్నాయి. పెద్ద స్థాయిలో డీలింగ్స్ జరుగుతున్నాయి. సినిమా థీమ్ ని తెలియజేయాలి అంటే ఇందులో ఒక్క డైలాగ్ ఉంది. వణక్కం సత్యన్న చెప్పిన టైంకి చెన్నై పోర్ట్ కి సరుకు వచ్చి పూడుస్తది కదా అని తమిళ వ్యక్తి ఫోన్ లో అడుగుతారు. దీనికి చిరంజీవి బదులిస్తూ.. ఎన్నాడా తంబీ.. ఇది సత్యం మాట.. ఇంకా డౌటా అంటూ తన స్టైల్ లో మెగాస్టార్ డైలాగ్ చెప్పారు. అంటే సత్యం మాట ఇస్తే అది జరిగి తీరాల్సిందే.

45
సత్యం అసలు కాకాగా ఎలా మారాడు
Image Credit : Asianet News

సత్యం అసలు కాకాగా ఎలా మారాడు

ఆ ఆక్వా కంపెనీలో అంతా సత్యంకి రెస్పెక్ట్ ఇచ్చేలానే ఉంటారు. సత్యం అసలు కాకాగా ఎలా మారాడు. పైకి సూపర్ వైజర్ గా ఉంటూ అండర్ వరల్డ్ డాన్ గా పనిచేస్తున్నాడా అనే అనుమానాలు గ్లింప్స్ చూస్తే కలుగుతాయి. గెటప్ శ్రీను ఇచ్చిన తాళాలు పొరపాటున రొయ్యలు ఉన్న వాటర్ లో పడుతాయి. దానిని బయటకి తీయడానికి సత్యం మేగ్నెటిక్ మిషన్ ని వాడతారు. ఆ మెషీన్ తాళాలు బయటకు తీసే క్రమంలో పదుల సంఖ్యలో పవర్ ఫుల్ వెపన్స్ కూడా బయట పడతాయి. సో ఇక ఫిక్స్ అయిపోవచ్చు.. మెగాస్టార్ ఈ చిత్రంలో అండర్ వరల్డ్ డాన్ గా కనిపిస్తున్నారు అని.

55
బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా
Image Credit : Asianet News

బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా

చివర్లో కొన్ని యాక్షన్ షాట్స్ చూపించారు. అందులో కాకాగా చిరంజీవి రూపం పూర్తిగా బయటపెట్టలేదు. సత్యం పాత్రలో బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడుగా ఉన్న లుక్ మాత్రం బాగా రివీల్ చేశారు. మొత్తంగా కాకా టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. గ్లింప్స్ లోనే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Song: జీవితం అంటే కేవలం బతకడం కాదు.. జీవిత స‌త్యాన్ని చాటే సిరివెన్నెల పాట
Recommended image2
The Paradise 10 Days Collection: శనివారం ప్యారడైజ్‌ ఊహించని జంప్‌.. పదో రోజు నాని మూవీకి అదిరిపోయే కలెక్షన్లు
Recommended image3
Megastar: చిరంజీవిపై వశీకరణ ప్రయోగం, మెగాస్టాను సొంతం చేసుకోవాలని విషప్రయోగం చేసింది ఎవరు?
Related Stories
Recommended image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Recommended image2
Bigg Boss Agnipariksha: సంచాలక్ గా అపూర్వ పరువు పాయే, ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved