100 కోట్ల రెమ్యునరేషన్ ఒకేసారి పెంచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
తన చివరి సినిమాకి కేవలం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న ఓ హీరో, తన రెమ్యునరేషన్‌ను ఒకే సారి ఏకంగా 100 కోట్లకు పెంచేశాడు. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఇలా చేశాడు?

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తరువాత హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతుంది. ముందు ఒక కోటి, రెండు కోట్లు అని పెంచుకుంటూ వచ్చిన నటులు ఇప్పుడు 50 కోట్లు, 100 కోట్లు 300 కోట్ల వరకూ పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమాకు 300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే విజయ్ లాంటి నటులు సినిమాకు 200 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక హీరో ఒకే సినిమాతో 98 కోట్లు పారితోషికం పెంచేసుకున్నాడు.అతను ఎవరో కాదు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి.
రిషబ్ శెట్టి. 2022 వరకు ఒక సినిమాకి 2 కోట్లు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు. అయితే అతను నటించి దర్శకత్వం వహించినటువంటి కాంతారా సినిమా పాన్ ఇండియా హిట్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్‌ను 100 కోట్లకు పెంచేశాడు. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి చేస్తున్న కాంతారా 2 సినిమాకి ఆయన 100 కోట్లు డిమాండ్ చేశారట. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
కాంతారా 2 సినిమాకి రిషబ్ శెట్టి 100 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా అడిగారట. దీంతో కన్నడలో యష్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా రిషబ్ నిలిచాడు. యష్ ప్రస్తుతం సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో రామాయణం సినిమా చేస్తున్న యష్, రావణుడి పాత్రకు అంత రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇక రిషబ్ శెట్టి కాంతారా 2 ఏడు భాషల్లో విడుదల కానుంది. కన్నడ, హిందీతో పాటు ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. కాంతారా సినిమా 16 కోట్ల బడ్జెట్‌తో 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి రిషబ్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఇక కాంతారా 2 ఎన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది. ఎంత కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.