MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తలక్రిందులైన బిగ్‌ బాస్‌ ఓటింగ్‌, పదో వారం ఎలిమినేషన్‌, హౌజ్‌ని వీడేది ఆ కంటెస్టెంటే?

తలక్రిందులైన బిగ్‌ బాస్‌ ఓటింగ్‌, పదో వారం ఎలిమినేషన్‌, హౌజ్‌ని వీడేది ఆ కంటెస్టెంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. ఈవారం హౌజ్‌ని వీడబోయేది ఎవరో తేలిపోయింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 09 2024, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదో వారం పూర్తి కావస్తుంది. శుక్రవారంతో ఓటింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఇక రిజల్ట్ మిగిలి ఉంది. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన గౌతమ్‌, నిఖిల్‌, యష్మి, పృథ్వీరాజ్‌, ప్రేరణ, విష్ణు ప్రియా, హరితేజ నామినేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు పోల్‌ అయిన ఓట్ల పర్సెంట్‌ చూస్తే వీరిలో టాప్‌లో ఉన్నది ఎవరు? ఎలిమినేట్‌ కాబోతున్నది ఎవరో తేలిపోతుంది. పదో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతుండటం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg boss telugu 8

Bigg boss telugu 8

లేటెస్ట్ గా వచ్చిన ఓట్ల పర్సెంటేజ్‌ని బట్టి చూస్తే పదో వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కాబోతుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు హరితేజ అని తెలుస్తుంది. మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చితే తక్కువ ఓట్లు నమోదు కావడం వల్ల ఆమె ఎలిమినేషన్‌ పక్కా అనే ప్రచారం జరుగుతుంది.

ఆమెకి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయని సమాచారం. మొదటి వారంలో ఆమెకి 9శాతం ఓట్లు నమోదు కాగా, శుక్రవారంకి వచ్చేసరికి కేవలం ఒక్క శాతమే పెరిగింది. అయితే మిగిలిన వారితో పోల్చితే ఆమె చాలా వెనకబడిపోవడం గమనార్హం. 
 

35

దాదాపు 26 శాతం ఓట్లతో గౌతమ్‌ ఈ సారి టాప్‌లో ఉన్నాడు. అంతకు ముందు వారం లీస్ట్ లో ఉన్న గౌతమ్‌ సడెన్‌గా పుంజుకున్నాడు. `అశ్వథ్థామ 2.0` అన్ని ప్రకటించినట్టుగానే ఆయన ఆట తీరు, ఆడియెన్స్ నుంచి ఆయనకు వస్తున్న ఆదరణ పరంగానూ బాగా మెరుగుపడ్డాడు.

ఇంకా చెప్పాలంటే యష్మితో గొడవనే గౌతమ్‌ పుంజుకునేలా చేసింది. ఆమె కుట్రలు గౌతమ్‌కి సింపతిగా మారాయి, అవి ఓట్లుగా నమోదు అయ్యాయి. దీంతో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లుగా ఉన్న నిఖిల్‌, యష్మిలను దాటి ఈ వారం టాప్‌లో గౌతమ్‌ నిలవడం విశేషం. 
 

45

ఇక రెండో స్థానంలో నిఖిల్‌ ఉన్నాడు. ఆయనకు 19-20శాతం ఓట్లు నమోదు అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్థానంలో ప్రేరణ, యష్మి ఉన్నారు. ప్రేరణ గట్టిగా పుంజుకోవడం విశేషం. అదే సమయంలో యష్మి కొంత డౌన్‌ అయ్యింది. నామినేషన్‌ మొదటి రోజు లీస్ట్ లో ఉన్న విష్ణు ప్రియా పుంజుకుంది. ఆమె ఓటింగ్‌ శాతం ఓ రకంగా తలకిందులైందని చెప్పొచ్చు. ఐదో స్థానంలో ఉన్నట్టు సమాచారం.

అలాగే టాప్‌ 4లో ఉన్న పృథ్వీ ఇప్పుడు చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయాడట. హరితేజకి, పృథ్వీరాజ్‌కి మధ్య ఒక్క శాతమే తేడా ఉంది. ఫైనల్‌ రిజల్ట్ లో ఏదైనా మార్పు జరిగే ఛాన్స్ ఉంది. అలానే జరిగితే, హరితేజ పుంజుకుంటే పృథ్వీ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

55

ఇదిలా ఉంటే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉండబోతుందా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏదో టైమ్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుంది. అయితే ఇప్పటికే ఓ డబుల్ ఎలిమినేషన్‌ అయిపోయింది. మళ్లీ మరోసారి ఇది ఉంటుందా? అనేది సస్పెన్స్. ఉంటే మాత్రం ఈ వారం హరితేజతోపాటు, పృథ్వీరాజ్‌ కూడా ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి.

కానీ ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం ఒక్కరే ఎలిమినేట్‌ అయ్యేది ఒక్కరే అని టాక్‌. అది కూడా హరితేజ కాబోతుందని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్‌, గౌతమ్‌, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్‌, విష్ణు ప్రియా, హరితేజ, తేస్టీ తేజ, అవినాష్‌, రోహిణి, గంగవ్వ, నబీల్‌ ఉన్నారు. వీరిలో ఒకరు హౌజ్‌ని వీడబోతున్నారు.  

Read more: ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో అనుష్క శెట్టి రహస్య పెళ్లి?.. స్వీటి అంత బాగా చెప్పిన తర్వాత కూడా డౌటా?

also read: సూర్య-జ్యోతిక ఎంత ధనవంతులో తెలుసా?.. సూర్య కంటే జ్యోతికకే ఎక్కువ ఆస్తులున్నాయా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Recommended image2
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Recommended image3
Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved