అమ్మాయితో జడ్జి బూతులు.. ఆ టైంలో ఎన్టీఆర్ సీఎం.. నటి కిన్నెరపై సంచలన వ్యాఖ్యలు

First Published 11, Mar 2020, 8:59 PM IST

సీనియర్ నటి కిన్నెర 80, 90 దశకాల్లో తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చెట్టుకింద ప్లీడర్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.

సీనియర్ నటి కిన్నెర 80, 90 దశకాల్లో తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చెట్టుకింద ప్లీడర్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. బుల్లి తెరపై కూడా కిన్నెర తనదైన ముద్ర వేసింది. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి, నటీనటులతో తన అనుభవాల గురించి వివరిస్తుంటారు.

తాజాగా పరుచూరి కిన్నెర గురించి మాట్లాడారు. ఆమెతో తన అనుభవాలని వివరించారు. కిన్నెర స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన నటి.. ఆ సత్తా ఆమెకు అప్పట్లో ఉండేది. కానీ కొన్ని చిత్రాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించింది అని పరుచూరి అన్నారు.

డాక్టర్ భవాని చిత్ర షూటింగ్ లో భాగంగా తిరుపతిలో మొట్టమొదటిసారి కిన్నెరతో పరిచయం ఏర్పడిందని పరుచూరి అన్నారు. కిన్నెర ఎక్కువగా కామెడీ జోనర్ లోకి వెళ్లిపోవడం వల్ల హీరోయిన్ గా ఎక్కువ చిత్రాలు చేయలేకపోయింది అని పరుచూరి అభిప్రాయపడ్డారు.ఆమెని తాము హీరోయిన్ పరిచయం చేసే అవకాశం దక్కలేదు అని పరుచూరి అన్నారు.

ఇక డాక్టర్ భవాని చిత్ర షూటింగ్ లో జరిగిన ఓ సంఘటనని పరుచూరి గుర్తు చేసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ఓ అమ్మాయిని ఒక జడ్జి బూతు మాటలు మాట్లాడారు. ఆ సంగతిని కిన్నెర గమనించింది. వెంటనే నా వద్దకు ఆవేశంగా వచ్చింది. సర్ ఆ జడ్జి ఇలా ప్రవర్తించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అని అడిగింది.

అసలు అతడు జడ్జో కాదో తెలియదు.. కొంచెం ఆరా తీద్దాం అని అన్నా.. దీనితో కిన్నెర ఆవేశంగా సర్ మీరు ఫోన్ చేస్తారా నన్నే చేయమంటారా అని అడిగింది. ఓసి నీ దుంపతెగ ఆగు నేనే చేస్తా అని అన్నాను. వెంటనే డీఎస్పీకి ఫోన్ చేశా. సర్ మీరు జడ్జి గురించి చెబుతున్నారు.. ఆయన మీద మేమెలా యాక్షన్ తీసుకుంటాం అని డిఎస్పీ ప్రశ్నించాడు.

అసలు ఆయన జడ్జో కాదో తెలియదు.. మీరు వచ్చి ఎక్వైరీ చేయండి అని అడిగాను. అందుకు కూడా డిఎస్పీ ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. మీరు వస్తారా.. నన్ను ఎన్టీఆర్ గారికి ఫోన్ చేయమంటారా అని అడిగాను. సర్ మీరు భలేవారు.. ఈ మాత్రం దానికి సీఎం గారికి ఫోన్ ఎందుకు నేనే వస్తున్నా అని భయపడుతూ చెప్పారు.

పోలీసులు వచ్చే సమయానికి జడ్జిగా చెప్పపడిన అతను, అతడి అనుచరులు పరారయ్యారు. ఈ సంఘటన తర్వాత కిన్నెర నావద్దకు వచ్చి థాంక్స్ అని కాస్త కోపంగానే చెప్పింది. ఎందుకమ్మా కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా అని అడిగాను.. మీరు చాలా సేపు అంగీకరించలేదు.. ఒక ఆడపిల్లని అల్లరి చేస్తుంటే మీరు ఆలస్యం చేయొచ్చా.. అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్పింది. ఆ సంఘటన నాకో మంచి జ్ఞాపకం అని పరుచూరి అన్నారు. ఆ సమయంలో కిన్నరతో తప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చా.

ఇచ్చిన మాట ప్రకారం మరో క్విట్ ఇండియా అనే సినిమా చేశాం. కొన్ని పొరపాట్ల వల్ల ఆ చిత్రం సరిగా ఆడలేదు. ఆ చిత్రంలో మార్చురీ సన్నివేశంలో కిన్నెర చీర కట్టుకుని ఉంది. అమ్మా మార్చురీలో ఎవరూ చీర కట్టుకోరు. కాస్త వీపు వరకు కనిపించాలి అని అడిగాం. అంతకు మించి తీయకూడదు అని గట్టిగా చెప్పింది. అలా తాన్ విషయంలో, ఎవరో అమ్మాయి విషయంలో అంతగా పోరాడిన కిన్నెర.. సెక్స్ రాకెట్ లో చిక్కుకుందని తెలిసి చాలా భాదపడ్డట్లు పరుచూరితెలిపారు.

కొన్నేళ్ల క్రితం కిన్నెరపై సెక్స్ రాకెట్ ఆరోపణలు వచ్చాయి. ఓ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో కిన్నెర కొందరు యువతులతో మాట్లాడుతున్న వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

loader