బిగ్ లీక్ :'ఆర్ ఆర్ ఆర్' లో రాజమౌళి కొడుకు పాత్ర...మామూలుగా లేదుగా

First Published 17, Apr 2020, 9:55 AM

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తన తండ్రి చేసే ప్రాజెక్టులన్నిటిలో ప్రధాన పాత్ర వహిస్తూంటారు. గతంలో బాహుబలి సమయంలోనూ కార్తికేయ కష్టపడ్డారు. అసెస్టెంట్ డైరక్టర్ గా , ప్రొడక్షన్ కంట్రోలర్ తన ప్రతిభ ఏమిటో చూపిస్తూంటారు. చాలా డెడికేషన్ ,క్రమ శిక్షణతో తన విధులను నిర్వహిస్తూండని కీలకమైన భాధ్యతలు 'ఆర్ ఆర్ ఆర్' కు రాజమౌళి అప్పచెప్పినట్లు సమాచారం. అంతేకాదు బాహుబలి లో కూడా సన్నివేశాలను షూట్ చేసారు. తన తండ్రి వార్ ఎపిసోడ్స్ తో బిజిగా ఉన్నప్పుడు మిగతా క్యారక్టర్ ఆర్టిస్ట్ సన్నివేశాలను షూట్ చేసారు. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' కూడా అదే తరహా భాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ కార్తికేయ చేస్తున్నదేమిటి..

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సోలో సీన్స్ .. ఎన్టీఆర్ సోలో సీన్స్ ను షూట్ చేసారట. అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాల  షూటింగ్ ని కూడా పూర్తి చేశారట.

ఇక ఈ సినిమాకు నార్త్ నుంచి సౌత్ నుంచి చాలా మంది నటులు నటిస్తూండటంతో వారి డేట్స్ మ్యానేజ్ చేయటం ఓ పెద్ద యజ్ఞంగా మారింది. అయితే దాన్ని ఏ ఇబ్బందులు లేకుండా కార్తికేయ నిర్ణయిస్తున్నాడట.

ఆర్టిస్ట్ లందరితో టచ్ లో ఉంటూ..వారి డేట్స్ ని కో ఆర్డనేట్ చేస్తూ షూటింగ్ కు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నారట కార్తికేయ. దాంతో టీమ్ కు సగం భారం తీరినట్లుంది అని చెప్తున్నారు.

అలాగే కార్తికేయ డైరక్షన్ డిపార్టమెంట్ సైడ్ ఉంటూ...ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసారట. అవి రాజమౌళి చూసి ఫైనల్ చేస్తారట. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పటమో లేక రీషూట్ పెట్టడమో చేస్తారంటున్నారు.

కార్తికేయకు కొద్ది కాలం క్రితమే వివాహం జరగటంతో   'ఆర్ ఆర్ ఆర్' పై పూర్తి దృష్టి పెడెతూ ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా గడపలేకపోతున్నాను అనే ఫీల్ ఉందట. కరోనా దెబ్బతో షూటింగ్ ఆపి, కార్తికేయ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.

'ఆర్ ఆర్ ఆర్' విషయానికి వస్తే..హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించవలసిన సన్నివేశాలు మాత్రమే మిగిలిపోయాయని సమాచారం.

చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ సరసన ఒలీవియాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు జంటల మధ్య వేరువేరుగా చిత్రీకరించవలన సన్నివేశాలు .. పాటలను సిద్ధం చేసి వుంచారట. లాక్ డౌన్ తరువాత వాటి షూటింగ్ జరపనున్నట్టు తెలుస్తోంది.

మరో ప్రక్క కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన షోయింగ్ బిజినెస్ అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి`. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

మరో ప్రక్క ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ పూణే లో మొదలుకావాల్సి వుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో వాయిదాపడింది.  అలాగే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. దీనితో సమీప కాలంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే రాజమౌళి పూణే షెడ్యూల్ కి సంబంధించిన ఓ భారీ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించే ప్లాన్ లో ఉన్నారట.

సాబు సిరిల్ నేతృత్వంలోని టీమ్ ఓ భారీ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకణ ఈ సెట్ లో చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సెట్స్ ప్లానింగ్ లో కార్తికేయది ప్రధాన పాత్ర కాబోతోందిట. దగ్గరుండి మొత్తం పర్యవేక్షించనున్నారట.

లాక్ డౌన్ పూర్తవగానే ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నెక్ట్స్ షెడ్యూల్ గండిపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. గండిపేట షెడ్యూల్ తర్వాత పూనేకు వెళ్తుంది టీమ్.

loader