Year Ender: 2023లో టీ20ల్లో అదరగొట్టిన భారత బ్యాటర్స్ వీరే
Yearender2023-sports: ఈ ఏడాది భారత్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ప్రియులను అలరించింది. టీ20ల్లో మన యంగ్ ప్లేయర్స్ అదరగొట్టారు. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ లు 2023లో భారత్ నుంచి స్టార్ పెర్ఫార్మర్లుగా ఉన్నారు.
India , Cricket,
Yearender2023-cricket: 2023లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన టీమిండియా.. దురదృష్టవశాత్తూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఓడిపోయినా ఏడాది పొడవునా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారనే వాస్తవాన్ని మాత్రం విస్మరించలేము. ఈ ఏడాది టీ20ల్లో భారత ప్లేయర్లు తమదైన స్టైల్లో అదరగొట్టారు. భారత్ నుంచి ఈ ఏడాదిలో టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ గమనిస్తే..
Rinku Singh
6. రింకు సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కు 2023కు తన జీవితాన్ని మార్చే సంవత్సరంగా నిలిచింది. ఎందుకంటే రింకూ టీ20లతో పాటు వన్డేలలో కూడా అరంగేట్రం చేశాడు. ఎప్పుడూ నమ్మదగిన, స్థిరమైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మాన్ గా, ఎలక్ట్రిక్ ఫీల్డర్, క్లిష్ట పరిస్థితుల్లో కూల్ ధనాధన్ బ్యాటింగ్ అదరగొట్టగల ప్లేయర్. ఇప్పటికే భారత టీంకు వాంటెడ్ ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు. ఈ సంవత్సరం అతనికి అభించిన 12 క్యాప్‌లలో 65.5 సగటు, 180.68 స్ట్రైక్ రేట్ తో 262 పరుగులు చేశాడు.
Tilak Varma
5. తిలక్ వర్మ
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ గత రెండు సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనల నేపథ్యంలో ఈ సంవత్సరం అరంగేట్రం చేసిన మరో స్టార్ బ్యాటర్. హైదరాబాద్‌కు చెందిన ప్రతిభావంతుడైన ప్లేయర్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మాన్ వేగంగా పరుగులు చేయగల ఆటగాడు. కుడిచేతి ఆఫ్ స్పిన్‌తో కూడా రాణించగలడు. ఈ సంవత్సరం తిలక్ 15 మ్యాచ్ లలో 34.44 సగటు, 141.55 స్ట్రైక్ రేట్‌తో 310 పరుగులు చేశాడు.
Shubman Gill
4. శుభ్‌మన్ గిల్
కొత్తగా నియమితులైన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్. 2023లో బ్యాట్‌తో అద్భుతమైన సంవత్సరాన్ని కొనసాగించాడు. భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్ గా గుర్తింపు సంపాదించాడు. ఈ సంవత్సరంలో ఆడిన 13 మ్యాచ్‌లలో 145.11స్ట్రైక్ రేట్, 26 సగటుతో 312 పరుగులు చేశాడు.
Ruturaj Gaikwad
3. రుతురాజ్ గైక్వాడ్
147.17 స్ట్రైక్ రేట్‌తో 60.83 సగటుతో 465 పరుగులు చేసి భారత్‌కు అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రుతురాజ్ గౌక్వాడ్ ఉన్నాడు. ఓపెనింగ్ స్థానం కోసం లిస్టులో ఉన్న ప్లేయర్. ఈ ఏడాది అద్భుతమైన సెంచరీని కూడా సాధించాడు.
Yashasvi Jaiswal
2. యశస్వి జైస్వాల్
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన యశస్వి జైస్వాల్ అరంభ మ్యాచ్ లోనే అదరగొట్టాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం తరువాతి తరం సూపర్ స్టార్లలో ఒకడిగా మారతాడని గుర్తింపు సాధించాడు. జైస్వాల్ 15 మ్యాచ్‌లలో 33.07 సగటు, 159.25 స్ట్రైక్ రేట్‌తో 430 పరుగులు చేశాడు.
Suryakumar Yadav
1. సూర్యకుమార్ యాదవ్
టీ20లో నంబర్ 1 బ్యాట్స్‌మన్ ఈ సంవత్సరం ఫార్మాట్‌లో భారతదేశ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ముంబై ఇండియన్స్ నుండి వచ్చిన స్టార్ బ్యాటర్ 48.86 సగటు, 155.05 స్ట్రైక్ రేట్‌తో 738 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.