- Home
- Sports
- Cricket
- Yashasvi Jaiswal: 2027 వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
Yashasvi Jaiswal: 2027 వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
Yashasvi Jaiswal : ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, తన రెండవ వన్డే సెంచరీతో దుమ్మురేపాడు. 14 ఫోర్లు, మూడు సిక్సర్లు తో అదరగొట్టాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో యశస్వి జైస్వాల్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 చోటు దక్కేనా? టీమిండియా ప్లానేంటి?

రోహిత్, గిల్‌కు చెక్ పెడతాడా? 2027 వన్డే ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఎలా?
టీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నెక్స్ట్ టార్గెట్ ఒక్కటే. అదే.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టైటిల్ కొట్టడం. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి.
భారత్ ఇప్పటివరకు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచింది. 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా వన్డే ప్రపంచకప్ సాధించింది. గత 2023 ఎడిషన్‌లో లీగ్ స్టేజ్ అంతా డామినేట్ చేసినా, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. అందుకే ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిగా ఉంది.
టీమిండియా వరల్డ్ కప్ వేట షురూ
2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టింది. గత ఏడాది కాలంగా వన్డేల్లో పలువురు యంగ్ స్టార్లకు బోర్డు వరుసగా అవకాశాలు ఇస్తోంది. వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌లను నియమించడంతోనే టీమిండియాలో పెద్ద మార్పులు స్టార్ట్ అయ్యాయి. మెగా టోర్నీకి పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
టీమిండియాకు ఓపెనింగ్ తలనొప్పి
వరల్డ్ కప్‌కు ముందు మేనేజ్‌మెంట్‌ను వేధించే అతిపెద్ద సమస్య ఓపెనింగ్ కాంబినేషన్. వన్డేల్లో ఓపెనింగ్ స్లాట్ కోసం టీమిండియాలో భారీ కాంపిటీషన్ నడుస్తోంది. ప్రస్తుతం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా ఉన్నారు. అయితే యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ కూడా తన సూపర్ పర్ఫామెన్స్‌తో గట్టి పోటీ ఇస్తున్నాడు.
జైస్వాల్ అదిరిపోయే రికార్డు
జైస్వాల్ ఇప్పటివరకు ఆడింది కొన్ని వన్డే మ్యాచ్‌లే కావచ్చు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌తో పాటు టెస్టుల్లోనూ అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కేవలం 6 వన్డేల్లోనే 71.25 సగటుతో 285 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని 3వ మ్యాచ్‌లో సెంచరీ బాది జైస్వాల్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
జైస్వాల్ కు ఇండియా ప్లేయింగ్ 11 లో చోటు దక్కేది ఎలా?
ప్రస్తుతం జైస్వాల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనింగ్ స్లాట్ కోసం అతను బలమైన పోటీదారుగా మారాడు. అయితే గత కొన్నేళ్లుగా రోహిత్, గిల్ ఓపెనర్లుగా సెటిల్ అయిపోయారు. కాబట్టి జైస్వాల్ నేరుగా తుది జట్టులోకి రావడం కొంచెం కష్టమే.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే 2027 వరల్డ్ కప్ భారత జట్టులో జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ టోర్నమెంట్ సమయంలో టాప్ ఆర్డర్ ప్లేయర్లు ఎవరైనా గాయపడితే, వారి స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా మాత్రమే జైస్వాల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే రూట్ కనిపిస్తోంది.
రోహిత్ ఫిట్‌నెస్, ఫామ్ కీలకం
ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 39 ఏళ్లు. గత కొన్ని నెలలుగా అతను ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. ఈ వయసులో ప్లేయర్లకు గాయాలు కావడం చాలా కామన్. మరోవైపు రోహిత్ బ్యాటింగ్ ఫామ్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ టోర్నీ సమయానికి రోహిత్ ఫామ్ కోల్పోతే, అది జైస్వాల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడానికి ప్లస్ అవుతుంది.
అంతేకాదు, శుభ్‌మన్ గిల్ లేదా విరాట్ కోహ్లీలలో ఎవరికైనా గాయాలైనా జైస్వాల్ లక్కీగా టీమ్‌లోకి వస్తాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇలాగే జరిగింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా కోహ్లీ సిరీస్‌కు దూరం కావడంతో, రెండో మ్యాచ్‌లో గిల్ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చి భారీ సెంచరీ చేశాడు. ఆ సమయంలో జైస్వాల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం దక్కింది. రాబోయే రోజుల్లో మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

