MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే

SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. జీటీతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు కష్టాలు మొదలయ్యాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ ఎందుకు ఓడిపోయింది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2026, 06:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కావ్య పాప కు షాక్.. గెలిచే మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ! అసలేం జరిగింది?
Image Credit : ANI

కావ్య పాప కు షాక్.. గెలిచే మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ! అసలేం జరిగింది?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026, 56వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోరంగా ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ ఉంచిన 169 పరుగుల టార్గెట్ ను అందుకోలేక, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా 82 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయం హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. సన్‌రైజర్స్ ఓడిపోవడానికి గల ఆ 5 ప్రధాన కారణాలు గమనిస్తే..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
1. పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ కుప్పకూలింది
Image Credit : Getty

1. పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ కుప్పకూలింది

ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు అత్యంత దారుణమైన ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ వేసిన బంతికి ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రబడ తన ప్రతాపం చూపిస్తూ అభిషేక్ శర్మను, ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేవలం 23 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Related Articles

Related image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Related image2
IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే
36
2. రబడ, సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్
Image Credit : ANI

2. రబడ, సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్

గుజరాత్ పేసర్లు రబడ, మహమ్మద్ సిరాజ్ తమ స్పెల్స్‌తో హైదరాబాద్ బ్యాటర్లను ఊపిరి తీసుకోనివ్వలేదు. ముఖ్యంగా రబడ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ వెన్నెముక విరిచాడు. సిరాజ్ తన మొదటి ఓవర్‌ను వికెట్-మెయిడెన్‌గా వేసి ఒత్తిడి పెంచాడు. వీరిద్దరూ పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పేశారు.

46
3. మిడిల్ ఆర్డర్ కూడా విఫలం
Image Credit : Getty

3. మిడిల్ ఆర్డర్ కూడా విఫలం

టాప్ ఆర్డర్ విఫలమైనా, మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రమాదకరమైన హెన్రిచ్ క్లాసెన్ (14 పరుగులు) కొద్దిసేపు క్రీజులో ఉన్నాడు. కానీ, జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సలీల్ అరోరా (16), నితీష్ రెడ్డి (2) వంటి ఆటగాళ్లు కూడా క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. గుజరాత్ బౌలర్ల ప్లాన్లను తిప్పికొట్టడంలో హైదరాబాద్ టీమ్ మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.

56
4. జేసన్ హోల్డర్ డెడ్లీ స్పెల్
Image Credit : ANI

4. జేసన్ హోల్డర్ డెడ్లీ స్పెల్

గుజరాత్ సీనియర్ బౌలర్ జేసన్ హోల్డర్ మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్‌ను కోలుకోకుండా చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు (క్లాసెన్, నితీష్ రెడ్డి, శివంగ్ కుమార్) తీశాడు. పిచ్ కండిషన్స్‌ను వాడుకుంటూ హోల్డర్ వేసిన లెంగ్త్ డెలివరీలకు హైదరాబాద్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది.

66
5. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం
Image Credit : X@IPL

5. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం

టాస్ గెలిచిన ప్యాట్ కమ్మిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ నాటికి పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా మారింది. బంతి స్టిక్కీగా మారి బ్యాటర్లకు ఇబ్బంది కలిగించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పినట్లుగా, ఈ పిచ్‌పై 160-170 పరుగులు డిఫెండ్ చేయడం సులభమని వారు భావించారు, అది నిజమైంది. హైదరాబాద్ బ్యాటర్లు పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు.

చివరికి ప్యాట్ కమ్మిన్స్ (19 పరుగులు) కొద్దిగా పోరాడినా, రషీద్ ఖాన్ చివరి వికెట్ తీయడంతో హైదరాబాద్ 86 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఓటమితో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరుకోగా, హైదరాబాద్ మూడో స్థానంలోకి వచ్చింది. హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలోకి చేరింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
GT vs SRH: పూర్తిగా చేతులెత్తేసిన స‌న్‌రైజ‌ర్స్‌.. గుజ‌రాత్ దెబ్బకు చిత్తు
Recommended image2
Virat Kohli: కోహ్లీపై భారీ కుట్ర‌.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన జ‌ర్మ‌న్ మోడ‌ల్
Recommended image3
IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే
Related Stories
Recommended image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Recommended image2
IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved