MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !

T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !

India Women vs South Africa Women: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. టీమిండియా ఓటమికి దారితీసిన 5 ముఖ్య కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 07:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చేతులారా మ్యాచ్‌ను పారేసుకున్న భారత్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం!
Image Credit : X/ICC

చేతులారా మ్యాచ్‌ను పారేసుకున్న భారత్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం!

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఏ ఉత్కంఠ పోరులో భారత మహిళల జట్టుకు గట్టి షాక్ తగిలింది. సౌతాఫ్రికా ఉమెన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజానే కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ నోటి నుంచి విజయాన్ని లాగేసుకుంది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్ ఓటమికి దారితీసిన ఆ 5 ముఖ్యమైన కారణాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పవర్‌ప్లే తర్వాత బ్యాటింగ్ తడబాటు
Image Credit : X/BCCIWomen

పవర్‌ప్లే తర్వాత బ్యాటింగ్ తడబాటు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (17), షఫాలీ వర్మ (31) అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. దీంతో భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి 59/2 స్కోరుతో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మారింది. పిచ్ స్లోగా మారడంతో భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. మిడిల్ ఓవర్లలో (7 నుంచి 15 ఓవర్లు) భారత్ కేవలం 57 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. భారీ హిట్లు కొట్టే క్రమంలో వికెట్లు పారేసుకోవడంతో స్కోరు వేగం పూర్తిగా తగ్గిపోయింది.

36
మారిజానే కాప్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం
Image Credit : X/BCCIWomen

మారిజానే కాప్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం

భారత్ చేసిన అతిపెద్ద తప్పు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు డ్రాప్ చేయడం. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్ మారిజానే కాప్ ఇచ్చిన రెండు కీలకమైన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకరైన రాధా యాదవ్.. లాంగ్ ఆన్ బౌండరీ వద్ద కాప్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసింది. ఆ తర్వాత షఫాలీ వర్మ బౌలింగ్‌లోనూ మరో క్యాచ్ మిస్ అయింది. లభించిన లైఫ్‌లతో కాప్ చెలరేగిపోయి మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేసింది.

46
మిడిల్ ఓవర్లలో చేతులెత్తేసిన బౌలర్లు
Image Credit : X/BCCIWomen

మిడిల్ ఓవర్లలో చేతులెత్తేసిన బౌలర్లు

ఛేజింగ్‌లో సౌతాఫ్రికా జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ శ్రీ చరణి డబుల్ వికెట్ మెయిడెన్ ఓవర్ వేసి సౌతాఫ్రికాను గట్టి దెబ్బ కొట్టింది. కానీ ఆ తర్వాత బౌలర్లు ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య సౌతాఫ్రికా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఏకంగా 86 పరుగులు రాబట్టింది. టాజ్మిన్ బ్రిట్స్ (40), మారిజానే కాప్ కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.

56
ఇతర బౌలర్ల నుంచి లభించని సపోర్టు
Image Credit : X/ICC

ఇతర బౌలర్ల నుంచి లభించని సపోర్టు

భారత బౌలింగ్‌లో శ్రీ చరణి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించింది. ఓపెనర్ షఫాలీ వర్మ కూడా 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ తీసి గట్టి పోటీ ఇచ్చింది. కానీ వీరికి మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. సీనియర్ బౌలర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 44 పరుగులు సమర్పించుకుంది. అలాగే నందిని శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి కూడా భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో సౌతాఫ్రికాపై ఒత్తిడి తగ్గింది.

66
హర్మన్‌ప్రీత్ కౌర్ అవుట్ ప్రభావం
Image Credit : X/BCCIWomen

హర్మన్‌ప్రీత్ కౌర్ అవుట్ ప్రభావం

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఇది 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆమె 24 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించింది. డీప్తీ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అయితే 15వ ఓవర్లో షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన బంతిని కట్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయింది. భారత్‌కు మంచి ప్లాట్‌ఫారమ్ దొరికిన సమయంలో కెప్టెన్ అవుట్ కావడం పెద్ద మైనస్ అయింది. ఒకవేళ హర్మన్ క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోరు 170 దాటేది, ఫలితం మరోలా ఉండేది.

South Africa win by 6 wickets. #TeamIndia will now shift their focus to the next game against Bangladesh! 

Scorecard ▶️ https://t.co/cIrb7Ekn0x#T20WorldCup | #WomenInBlue | #SAvIND pic.twitter.com/AfxIJJgxXh

— BCCI Women (@BCCIWomen) June 21, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Recommended image3
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Related Stories
Recommended image1
Lionel Messi : లైవ్ మ్యాచ్‌లో ఏడ్చేసిన మెస్సీ.. ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదే
Recommended image2
Vaibhav Sooryavanshi: రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved