MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • Lionel Messi : లైవ్ మ్యాచ్‌లో ఏడ్చేసిన మెస్సీ.. ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదే

Lionel Messi : లైవ్ మ్యాచ్‌లో ఏడ్చేసిన మెస్సీ.. ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదే

Lionel Messi : ఫుట్‌బాల్ కింగ్ లియోనెల్ మెస్సీ లైవ్ మ్యచ్ లోనే ఏడ్చేసిన వీడియో వైరల్ గా మారింది. అల్జీరియాతో మ్యాచ్‌లో గోల్ కొట్టాక లియోనెల్ మెస్సీ ఏడ్చాడ. ఆ కన్నీళ్ల వెనుక అసలు కారణాన్ని ఆయన కుటుంబం వెల్లడించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 21 2026, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెస్సీ ఎందుకు ఏడ్చాడో తెలిస్తే గుండె ముక్కలవుతుంది.. అసలు మ్యాటర్ ఇదే
Image Credit : Getty

మెస్సీ ఎందుకు ఏడ్చాడో తెలిస్తే గుండె ముక్కలవుతుంది.. అసలు మ్యాటర్ ఇదే

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మైదానంలో కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులకు కొత్తేమీ కాదు. రీసెంట్‌గా అల్జీరియాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో మెస్సీ తన మొదటి గోల్ చేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అసలు మెస్సీ ఎందుకు అంతలా ఏడ్చాడా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కూడా దీనిపై మాట్లాడాడు. గత కొన్ని రోజులుగా తన జీవితంలో చాలా కష్టమైన ఫేజ్ నడుస్తోందని, అయితే దీనికి ఫుట్‌బాల్‌తో ఎలాంటి సంబంధం లేదని హింట్ ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సీక్రెట్ బ్రేక్ చేసిన ఫ్యామిలీ
Image Credit : X/Argentina

సీక్రెట్ బ్రేక్ చేసిన ఫ్యామిలీ

మెస్సీ ఎందుకు ఏడ్చాడనే సస్పెన్స్‌కు ఫైనల్‌గా అతని ఫ్యామిలీ ఎండ్ కార్డ్ వేసింది. మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణాన్ని అతని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. మెస్సీ తండ్రి హోర్హె మెస్సీ హెల్త్ కండిషన్ బాగోలేకపోవడం వల్లే మెస్సీ అంత ఎమోషనల్ అయ్యాడని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం హోర్హె మెస్సీకి నిపుణులైన వైద్యులతో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోందని, రికవరీ చాలా పాజిటివ్‌గా ఉందంటూ ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు.

Related Articles

Related image1
Vaibhav Sooryavanshi: రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్ !
Related image2
FIFA Knockout Rules : ఒక్క కార్డుతో వరల్డ్ కప్ నుంచే అవుట్.. ఫిఫా రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే !
34
ఆ నిమిషాలు ఎప్పటికీ గుర్తుంటాయి
Image Credit : Getty

ఆ నిమిషాలు ఎప్పటికీ గుర్తుంటాయి

మెస్సీ కెరీర్‌లో గతంలో కూడా ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. 2024 కొలంబియాతో జరిగిన కోపా అమెరికా ఫైనల్‌లో మెస్సీ గాయపడి గ్రౌండ్ వీడాడు. ఆ తర్వాత డగౌట్‌లో కూర్చుని మెస్సీ వెక్కివెక్కి ఏడ్చిన వీడియో అభిమానుల గుండెల్ని పిండేసింది. అంతకుముందు 2016లో చిలీతో కోపా అమెరికా ఫైనల్ ఓటమి తర్వాత, 2018లో బొలీవియాను ఓడించి కోపా అమెరికా గెలిచిన ఆనందంలో, అలాగే బార్సిలోనా క్లబ్‌ను వీడేటప్పుడు ఇచ్చిన ఫేర్‌వెల్ స్పీచ్‌లో.. ఇలా మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్న ఎన్నో క్షణాలకు ఫుట్‌బాల్ ప్రపంచం సాక్షిగా నిలిచింది. కానీ, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడుతున్న ఈ మ్యాచ్‌లో మెస్సీ ఏడవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

44
ఫేక్ న్యూస్ నమ్మొద్దు
Image Credit : Getty

ఫేక్ న్యూస్ నమ్మొద్దు

ఇదే సమయంలో మెస్సీ తండ్రి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ అయ్యారు. మీడియా కొంచెం మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. హోర్హె మెస్సీ ఆరోగ్యం గురించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కేవలం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. అందుకే అఫీషియల్‌గా రాని ఎలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని, కరెక్ట్ అప్‌డేట్స్‌ను తామే కరెక్ట్ టైమ్‌లో షేర్ చేస్తామని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
FIFA Knockout Rules : ఒక్క కార్డుతో వరల్డ్ కప్ నుంచే అవుట్.. ఫిఫా రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !
Recommended image3
FIFA World Cup 2026: లియోనెల్ మెస్సీ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్ !
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi: రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్ !
Recommended image2
FIFA Knockout Rules : ఒక్క కార్డుతో వరల్డ్ కప్ నుంచే అవుట్.. ఫిఫా రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved