Asia Cup: ఆసియా కప్ లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ఏది?
Asia Cup: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, ఇప్పటిరకు ఆసియా కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు ఏదో తెలుసా?

ఆసియా కప్ 2025 షెడ్యూల్
ఆసియా కప్ అనేది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే ప్రఖ్యాత క్రికెట్ టోర్నమెంట్. ఇది ఖండస్థాయిలో జరిగే ఏకైక క్రికెట్ ఛాంపియన్‌షిప్. ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తదితర ఆసియా జట్లు వన్డే (ODI), టీ20 (T20) ఫార్మాట్లలో పోటీ పడతాయి.
తాజాగా ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు గ్రూప్ బీ లో ఉన్నాయి.
KNOW
ఆసియా కప్ చరిత్ర ఇదే
1984లో UAE లో మొదటిసారి ఆసియా కప్ టోర్నమెంట్ జరిగింది. అప్పుడు మూడే జట్లు పాల్గొన్నాయి. అవి భారత్, పాకిస్థాన్, శ్రీలంక. తొలిసారి షార్జాలో జరిగిన ఫైనల్ లో గెలిచి విజేతగా భారత్ నిలిచింది. ఆ తర్వాతి కాలంలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు కూడా చేరడంతో ఆసియా కప్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
విభిన్న ఫార్మాట్లలో ఈ టోర్నమెంట్ జరగడం ప్రత్యేకత. 2016, 2022 ఆసియా కప్ లు టీ20 ఫార్మాట్‌లో జరిగాయి. మిగతా ఎడిషన్లు వన్డే ఫార్మాట్ లో జరిగాయి.
ఆసియా కప్ హిస్టరీలో చిరస్మరణీయ క్షణాలు
చివరి ఓవర్ల ఉత్కంఠ, రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అప్‌సెట్స్ ఆసియా కప్‌లో ఎన్నో రసవత్తర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ టోర్నమెంట్‌లో జట్ల మధ్య ప్రతిష్టాత్మక పోటీలు క్రికెట్ ప్రేమికులకు రక్తం మరిగేలా చేసిన ఘటనలను సైతం నమోదుచేసింది.
ఆసియా కప్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన టీమ్స్ ఏవి?
ఆసియా కప్ ఇప్పటివరకు 16 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. టీమిండియా అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఆసియా కప్ లో అత్యధిక టైటిల్స్ సాధించిన జట్టు భారత్.
- భారత్ – 8 టైటిల్స్
- శ్రీలంక – 6 టైటిల్స్
- పాకిస్థాన్ – 2 టైటిల్స్
ఆసియా కప్ లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ప్లేయర్లు ఎవరు?
ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్య ఉన్నారు.
- సనత్ జయసూర్య (శ్రీలంక) - 1,220 పరుగులు
- కుమార సంగక్కర (శ్రీలంక) - 1,075 పరుగులు
- షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) - 907 పరుగులు
ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు?
- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 30 వికెట్లు
- లసిత్ మలింగా (శ్రీలంక) - 29 వికెట్లు
- సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) - 25 వికెట్లు
ఆసియా కప్ లో అత్యధిక, అత్యల్ప స్కోర్
ఆసియా కప్ లో అత్యధిక స్కోర్ ను భారత జట్టు నమోదు చేసింది. 2008లో హాంగ్ కాంగ్ పై 374/4 పరుగులు చేసింది.
- భారత్ - 374/4 vs హాంగ్ కాంగ్ (2008)
- బంగ్లాదేశ్ - 87 vs పాకిస్థాన్ (2000) (ఆసియా కప్ లో అత్యల్ప స్కోరు)
ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ నుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందుతూ, అభిమానులకు ప్రతిసారి థ్రిల్ ను అందిస్తోంది. టాప్ జట్ల పోటీలు, కొత్త ఆటగాళ్ల ప్రతిభ, ఆఖరి ఓవర్ల ఉత్కంఠలు.. ఇవన్నీ ఆసియా కప్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.