- Home
- Sports
- Cricket
- Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ లపై ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

ఆసియా కప్ 2025 షెడ్యూల్: భారత్ - పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్
ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు గ్రూప్ బీ లో ఉన్నాయి. భారత్ - పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
KNOW
సెప్టెంబర్ 14న భారత్ vs పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్
భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్ స్టేజ్‌లో సెప్టెంబర్ 14న ఢీకొననున్నాయి. ఇది ఆసియా కప్‌లో అత్యంత ఆసక్తికరమైన.. ఉత్కంఠను పెంచుతున్న మ్యాచ్. ఈ రెండు జట్లు సూపర్ ఫోర్‌కి అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 22న మళ్లీ ఒకసారి తలపడే అవకాశం ఉంది. అలాగే, రెండు జట్లు ఫైనల్‌కు చేరితే, ఆసియా కప్ చరిత్రలో మరో ఉత్కంఠమైన భారత్-పాకిస్థాన్ ఫైనల్‌గా నిలవనుంది.
19 మ్యాచ్‌లతో ఆసియా కప్ 2025.. యూఏఈలోని రెండు వేదికల్లో టోర్నీ
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుధాబి, దుబాయ్ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి బీసీసీఐకి హోస్టింగ్ హక్కులు ఉన్నప్పటికీ, భారత-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో మళ్లీ న్యూట్రల్ వెన్యూలో టోర్నీ నిర్వహించనున్నారు.
2023లో జరిగిన ఆసియా కప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. భారతదేశం పాకిస్థాన్ వెళ్లడానికి నిరాకరించడంతో, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు, పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు నిర్వహించారు.
ఆసియా కప్ 2025 : గ్రూపులు, ఫార్మాట్, టోర్నమెంట్ ప్రణాళికలు ఇవే
ఆసియా కప్ 2025 లో రెండు గ్రూపులు ఉన్నాయి.
గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్
ఆసియా కప్ 2025 ఫార్మాట్ ఏమిటి?
ప్రతి గ్రూప్‌లో రెండు జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత పొందుతాయి. అక్కడ ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. టాప్ 2 జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి.
ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే (సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు)
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ షెడ్యూల్
సెప్టెంబర్ 9: అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ
సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 12: పాకిస్థాన్ vs ఒమన్
సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక
సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్
సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్
సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs అఫ్గానిస్తాన్
సెప్టెంబర్ 17: పాకిస్థాన్ vs యూఏఈ
సెప్టెంబర్ 18: శ్రీలంక vs అఫ్గానిస్తాన్
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్
ఆసియా కప్ 2025: సూపర్ ఫోర్ సెడ్యూల్
సెప్టెంబర్ 20: గ్రూప్ B క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 21: గ్రూప్ A క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 23: గ్రూప్ A క్వాలిఫయర్ 1 vs గ్రూప్ B క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 24: గ్రూప్ B క్వాలిఫయర్ 1 vs గ్రూప్ A క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 25: గ్రూప్ A క్వాలిఫయర్ 2 vs గ్రూప్ B క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 26: గ్రూప్ A క్వాలిఫయర్ 1 vs గ్రూప్ B క్వాలిఫయర్ 1
సెప్టెంబర్ 28: ఫైనల్ మ్యాచ్
జట్లు సెప్టెంబర్ 7న యూఏఈకి చేరుకుంటాయి. వార్మ్-అప్ మ్యాచ్‌లపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
భారత్ హోస్టింగ్ హక్కులను ఎందుకు వదులుకుంది?
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి తర్వాత బీసీసీఐ ఆసియా కప్‌లో పాల్గొనదని అంచనాలున్నాయి. అయితే, చివరికి టోర్నీ భద్రతాపరమైన కారణాల వల్ల యూఏఈకి తరలించారు. ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనకపోతే టోర్నమెంట్ పరిస్థితి దెబ్బతినేది. అయితే, భారత్ హోస్టింగ్ హక్కులు ఉన్నా న్యూట్రల్ వేదికకు ఒప్పుకుని టోర్నీలో పాల్గొంటోంది.
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్‌కు మీడియా హక్కులను 2024లో పొందింది. ఈ హక్కులు 8 ఏళ్లకు గాను సుమారు 170 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది.
మరోసారి భారత్ టైటిల్ గెలుస్తుందా?
భారత్ 2023 ఆసియా కప్‌ను గెలిచి ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి విజయాన్ని సాధించింది. అయితే ఆ టోర్నమెంట్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగగా, ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది.
భారత జట్టు ఈసారి కూడా టైటిల్ టార్గెట్ గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. మొత్తం 16 ఎడిషన్లలో 8 సార్లు ట్రోఫీని గెలుచుకుంది.