MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • ఈ న‌లుగురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు అన్యాయం జ‌రిగిందా? రోహిత్, గంభీర్ ఏం ప్లాన్ చేస్తున్నారు?

ఈ న‌లుగురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు అన్యాయం జ‌రిగిందా? రోహిత్, గంభీర్ ఏం ప్లాన్ చేస్తున్నారు?

Indian national cricket team: దులీప్ ట్రోఫీకి మొత్తం 4 జ‌ట్ల‌కు 61 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. అయితే, న‌లుగురు స్టార్ ప్లేయ‌ర్లు మాత్రం ఈ జాబితాలో క‌నిపించ‌డం లేదు. దీంతో రోహిత్, గంభీర్ లు టెస్ట్ క్రికెట్ విష‌యంలో స‌రైనా ప్లాన్‌లో లేరా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.   

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 15 2024, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rohit Sharma, Gautam Gambhir

Rohit Sharma, Gautam Gambhir

Indian national cricket team: శ్రీలంక ప‌ర్య‌ట‌న త‌ర్వాత భార‌త జ‌ట్టు వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కు ముందు బీసీసీఐ దులీప్ ట్రోఫీ కోసం జట్లను ప్రకటించింది. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ లు ఈ 4 జట్లకు కెప్టెన్‌లుగా ఉన్నారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేయలేదు. ఈ నలుగురితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఎంపిక కాలేదు. స్టార్ బౌల‌ర్ మహ్మద్ షమీ ఇంకా శిక్ష‌ణ‌లో ఉన్నాడు. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన శుఢ్ మ‌న్ గిల్ సారథ్యంలోని 'ఏ' టీమ్‌లో ర్యాన్ పరాగ్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్ 'బీ' టీమ్ లో యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి కూడా జట్టులో భాగమే అయితే, జ‌ట్టులో ఉండ‌టం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని 'సీ' టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఉన్న 'డీ' టీమ్ లో  వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తో పాటు దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లు ఉన్నారు. నాలుగు జట్లకు క‌లిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే 4 స్టార్ ప్లేయర్ల పేర్లు ఈ జాబితాలో క‌నిపించ‌లేదు. దీంతో ఈ ప్లేయ‌ర్ల‌ను టెస్టు క్రికెట్ ను నుంచి దూరం చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అలాగే, ఈ నలుగురు ఆటగాళ్ల విష‌యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స‌రైన ప్లాన్‌లో లేరా? అనే టాక్ కూడా న‌డుస్తోంది. వారిలో..

36

రింకూ సింగ్

భారత్ తరఫున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ టెస్టు క్రికెట్ లో కూడా ఆడాల‌ని ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌ తరఫున ఆడుతున్నాడు. రింకూ 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 54.70 సగటుతో 3173 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో అతను అద్భుతమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అని నిరూపించుకోగలడు. దులీప్ ట్రోఫీకి రింకూ ఎంపిక కాలేదు. దీన్ని బట్టి అతను సమీప భవిష్యత్తులో రోహిత్, గంభీర్ ప్లాన్‌లో లేడని తెలుస్తోంది.

46

సంజూ శాంసన్

భారత క్రికెట్‌లో అత్యంత దురదృష్టవంతుడుగా పిలవబడే ఆటగాడు సంజూ శాంసన్. శాంసన్ ఇటీవలి కాలంలో టీమ్ ఇండియాలో క‌నిపిస్తున్నాడు. కొన్నిసార్లు వన్డేల్లో, మరికొన్నిసార్లు టీ20 మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా వరుసగా మ్యాచ్‌ల్లో తుదిజ‌ట్టులో ఆడలేదు. కొన్నిసార్లు 2, మ‌రికొన్నిసార్లు 3 మ్యాచ్‌ల తర్వాత జ‌ట్టు నుంచి ఔట్ అయ్యాడు. ఎప్పుడు కూడా వరుసగా 15-20 మ్యాచ్‌లు ఆడ‌లేదు. తన 9 ఏళ్ల కెరీర్‌లో కేవలం 16 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో కేరళ తరఫున శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 62 మ్యాచ్‌ల్లో 38.54 సగటుతో 3623 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీకి కూడా శాంస‌న్ ను ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు శాంసన్‌ను టెస్టు క్రికెట్ ఫార్మాట్ కోసం చూడ‌టం లేద‌ని స్పష్టం చేశారు.

56
Prithvi Shaw, IPL 2024,

Prithvi Shaw, IPL 2024,

పృథ్వీ షా

తన క్లాసిక్ స్టైల్ క్రికెట్ తో ప్రసిద్ధి చెందిన పృథ్వీ షా ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద స్టార్ కొన‌సాగాడు. వెస్టిండీస్‌పై తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అప్ప‌ట్లో ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌ని మ‌రో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాగ‌ల‌డ‌ని పోల్చారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, పృథ్వీ పేలవమైన ఫిట్‌నెస్, వివాదాల కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌వుతున్నాడు. దీంతో జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం పృథ్వీ ఇంగ్లండ్‌లోని కౌంటీ జట్లకు ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయకపోవడంతో అత‌ను కూడా టెస్టు క్రికెట్ ఫార్మాట్ కోసం అత‌న్ని చూడ‌టం లేద‌ని తెలుస్తోంది.

66

యుజ్వేంద్ర చాహల్

భారత అనుభవజ్ఞుడైన స్పిన్ బౌలర్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్‌కు ఇంకా టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఏళ్ల స్పిన్నర్ క్రికెట్‌లోని అతిపెద్ద ఫార్మాట్‌లో భారత్‌కు ఆడాలని కోరుకుంటున్నాడు. చాహల్ 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. దీంతో సెలక్టర్లు అతడిని టెస్టు క్రికెట్ కోసం చూడటం లేదన్న విషయం స్పష్టమైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved