MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !

Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !

Team India squad: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వగా, 33 ఏళ్ల ఆల్‌రౌండర్ సారాంశ్‌ జైన్‌కు కూడా పిలుపొచ్చింది. టీమిండియా స్క్వాడ్ ఇదే..

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2026, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జడేజా ఈజ్ బ్యాక్.. లంక టూర్ కోసం భారత జట్టు ఇదే
Image Credit : bcci

జడేజా ఈజ్ బ్యాక్.. లంక టూర్ కోసం భారత జట్టు ఇదే

శ్రీలంక పర్యటన కోసం భారత పురుషుల టెస్టు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రెండు మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగమైన ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.

టీమిండియా జట్టు శ్రీలంక గడ్డపై కాలుపెట్టే ముందు కొలంబో లో ఆగస్టు 7 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది. రీసెంట్ టైమ్‌లో టెస్టుల్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన భారత్.. ఈ సిరీస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి రావలని చూస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జడేజా గ్రాండ్ రీఎంట్రీ, వాషింగ్టన్ సుందర్ అవుట్
Image Credit : AFP

జడేజా గ్రాండ్ రీఎంట్రీ, వాషింగ్టన్ సుందర్ అవుట్

ఈ స్క్వాడ్‌లో మెయిన్ హైలైట్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ. మోచేతి గాయం కారణంగా గత మే నెల నుంచి రెస్ట్ తీసుకున్న జడేజా, మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లోకి తిరిగొచ్చాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత జడేజా భారత జట్టు తరఫున ఆడడం ఇదే తొలిసారి.

అదే సమయంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు నిరాశ ఎదురైంది. తొడ కండరాల గాయం కారణంగా అతడు తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే ఇటీవల ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయం వల్లే జట్టుకు ఎంపిక కాలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో వీరు రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నారు.

Related Articles

Related image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Related image2
CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్‌వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?
36
33 ఏళ్ల వయసులో ఊహించని ఛాన్స్ కొట్టేసిన సారాంశ్‌ జైన్
Image Credit : X/CricInformer

33 ఏళ్ల వయసులో ఊహించని ఛాన్స్ కొట్టేసిన సారాంశ్‌ జైన్

వాషింగ్టన్ సుందర్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్‌ జైన్‌ను తొలిసారి భారత సీనియర్ టెస్టు జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. 33 ఏళ్ల వయసులో ఈ అన్‌క్యాప్డ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్‌కు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. డొమెస్టిక్ క్రికెట్‌లో వరుసగా రాణిస్తున్న సారాంశ్‌కు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది. ఇప్పటివరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 27.3 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 14 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలతో 2223 రన్స్ చేశాడు.

2025-26 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున 30 వికెట్లు తీసి, 518 పరుగులు సాధించి దుమ్మురేపాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఏ' పర్యటనలోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్లను మెప్పించాడు. శ్రీలంక ఏ తో జరిగిన రెండో అన్‌అఫీషియల్ టెస్టులో 7 వికెట్లు తీసి, నాటౌట్‌గా 70 రన్స్ స్కోర్ చేసి జట్టు విజయాన్ని అందించాడు. లంక పిచ్‌లపై ఉన్న అనుభవం అతడికి టీమ్‌లో చోటు ఖాయం చేసింది.

46
బుమ్రా, సుదర్శన్ ఫిట్‌నెస్ తో ఉంటేనే..
Image Credit : AFP

బుమ్రా, సుదర్శన్ ఫిట్‌నెస్ తో ఉంటేనే..

ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ పేర్లు స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ, వాళ్లు ఆడడం ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఎడమ మోకాలికి దెబ్బతగిలిన బుమ్రా రెస్ట్‌లో ఉన్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తేనే ఈ ఇద్దరూ మ్యాచ్ బరిలోకి దిగుతారు.

ఒకవేళ బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తే.. మహమ్మద్ సిరాజ్‌తో కలిసి పేస్ దళాన్ని నడిపిస్తాడు. ఈ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, పంజాబ్ యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. లంక గడ్డపై జరిగిన ఇండియా 'ఏ' రెండో టెస్టులో గుర్నూర్ 10 వికెట్లతో చెలరేగడం గమనార్హం.

56
బ్యాటింగ్ లైనప్, మ్యాచ్ షెడ్యూల్ విశేషాలు ఇవే
Image Credit : X/BCCI

బ్యాటింగ్ లైనప్, మ్యాచ్ షెడ్యూల్ విశేషాలు ఇవే

జట్టు బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించనున్నారు. రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికవ్వగా, అదనపు బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్‌ను బెంచ్ పై ఉంచారు. స్పిన్ అటాక్‌ను అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాతో పాటు కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్ నడిపించనున్నారు.

దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత టీమిండియా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతోంది. గతంలో 2015 (2-1), 2017 (3-0)లలో ఇక్కడ సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 శాతంతో 5వ స్థానంలో, శ్రీలంక 41.67 శాతంతో 6వ స్థానంలో ఉన్నాయి.

66
టీమిండియా టెస్ట్ స్క్వాడ్
Image Credit : Getty

టీమిండియా టెస్ట్ స్క్వాడ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్‌ జైన్.

టూర్ షెడ్యూల్:

• తొలి టెస్టు: ఆగస్టు 15-19 (గాలో గాలే ఇంటర్నేషనల్ స్టేడియం)

• రెండో టెస్టు: ఆగస్టు 23-27 (కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్‌వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved