MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?

Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?

శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. ఇందులో 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఎవరీ సరాన్ష్ జైన్? అతడిని ఎందుకు ఎంపిక చేశారు?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 28 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
Image Credit : X/CricInformer

శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం BCCI సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరగనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్‌నెస్‌ను BCCIకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నిర్ధారించాల్సి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
33 ఏళ్ల వయసులో భారత జట్టులోకి సరాన్ష్ జైన్
Image Credit : X

33 ఏళ్ల వయసులో భారత జట్టులోకి సరాన్ష్ జైన్

స్పిన్ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో 33 ఏళ్ల స్పిన్నర్ సరాన్ష్ జైన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతనికి ఇదే తొలి టెస్ట్ పిలుపు.

ఇక సీనియర్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2026 సందర్భంగా అయిన మోచేతి గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఉపఖండం పిచ్‌లపై అతని రాక భారత స్పిన్ బౌలింగ్‌కు బలం చేకూరుస్తుంది.

Related Articles

Related image1
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Related image2
Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్
35
ఎవరీ సరాన్ష్ జైన్?
Image Credit : x

ఎవరీ సరాన్ష్ జైన్?

ఈ జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. ఇంతమంది యువకులు ఉండగా 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు అవకాశం రావడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సరాన్ష్ జైన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 2014-15 సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అతడి అవసరం ఇప్పుడు టీమిండియాకు వచ్చింది. మిడిల్  ఆర్డర్ బ్యాటింగ్ ను మరింత బలంగా మార్చేందకే సరాన్ష్ కు అవకాశం ఇచ్చివుంటారని క్రికెట్ పండితుల అభిప్రాయం.

45
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆల్-రౌండర్‌గా అదరగొట్టాడు
Image Credit : x.com

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆల్-రౌండర్‌గా అదరగొట్టాడు

మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో, నాకౌట్ దశలకు చేరడంలో సరాన్ష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ఇండియా A, సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఎంపికై దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లలోనూ రాణించాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 2223 పరుగులు చేయడంతో పాటు, 188 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆఫ్-స్పిన్నర్‌గా రాణించగలడు. వాషింగ్టన్ సుందర్ లాగే బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా ఉండటంతో BCCI అతడిని శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేసింది.
55
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు
Image Credit : x.com

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్ నిరూపించుకుంటే), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్‌నెస్ నిరూపించుకుంటే), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Recommended image2
Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved