MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్

Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్

Justin Greaves Creates History: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ వరుసగా 5 వికెట్ మెయిడెన్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వరుసగా  5 ఓవర్ల మెయిడెన్లు, ఐదు వికెట్లతో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రేర్ ఫీట్
Image Credit : Instagram/ICC

క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రేర్ ఫీట్

క్రికెట్ లవర్స్ ముక్కున వేలేసుకునేలా వెస్టిండీస్ పేస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఒక ఇంపాజిబుల్ రికార్డును పాజిబుల్ చేసి చూపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే దాదాపు ఎవరూ ఊహించని విధంగా, వరుసగా 5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఐదు వికెట్లు తీసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజున ఈ అద్భుత ఘనత నమోదైంది. క్రీజులో ఉన్న పాక్ బ్యాటర్లకు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పెవిలియన్ దారి పట్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
244/3 నుంచి పాక్ కుప్పకూలడానికి గ్రీవ్సే కారణం
Image Credit : Instagram/ICC

244/3 నుంచి పాక్ కుప్పకూలడానికి గ్రీవ్సే కారణం

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఒక దశలో చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. సెంచరీ చేసిన షాన్ మసూద్ క్రీజులో ఉండటంతో పాక్ 244/3 స్కోరుతో భారీ లీడ్ సాధించేలా కనిపించింది. అయితే, వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ నమ్మకంతో గ్రీవ్స్‌కు బంతిని అందించాడు. 'క్రమశిక్షణతో బౌలింగ్ చెయ్, వికెట్లు అవే వస్తాయి' అని ఛేజ్ ఇచ్చిన సలహాను గ్రీవ్స్ పక్కాగా ఫాలో అయ్యాడు. తన సెకండ్ స్పెల్‌తో మొత్తం మ్యాచ్ సీన్‌నే రివర్స్ చేసేశాడు.

35
వరుసగా 5 వికెట్ మెయిడెన్లు.. దెబ్బకు స్టువర్ట్ బ్రాడ్ రికార్డ్ అవుట్
Image Credit : Instagram/ICC

వరుసగా 5 వికెట్ మెయిడెన్లు.. దెబ్బకు స్టువర్ట్ బ్రాడ్ రికార్డ్ అవుట్

గ్రీవ్స్ తన తొలి స్పెల్‌లో 6 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ సెకండ్ స్పెల్‌లోకి రాగానే పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. మొదటగా డేంజరస్ బ్యాటర్ షాన్ మసూద్‌ను అవుట్ చేసి వికెట్ల పతనాన్ని షురూ చేశాడు. ఆ తర్వాత ఆమిర్ జమాల్, అలీ ఉస్మాన్, మహ్మద్ రిజ్వాన్‌లను వరుస ఓవర్లలో డకౌట్ గా సాగనంపాడు. లంచ్ తర్వాత వచ్చి మహ్మద్ అబ్బాస్‌ను కూడా అవుట్ చేసి, వరుసగా 5 ఓవర్లలో 5 వికెట్ మెయిడెన్లు నమోదు చేశాడు. దీనికంటే ముందు 2016లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వరసగా 4 వికెట్ మెయిడెన్లు వేశాడు. ఆ రికార్డును గ్రీవ్స్ ఇప్పుడు బ్రేక్ చేశాడు.

45
తొలి 5 వికెట్ల హాల్.. గ్రీవ్స్ ఏం చెప్పాడంటే?
Image Credit : Instagram/ICC

తొలి 5 వికెట్ల హాల్.. గ్రీవ్స్ ఏం చెప్పాడంటే?

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్రీవ్స్, 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. గ్రీవ్స్ విధ్వంసకర బౌలింగ్ దెబ్బకు పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్‌కు 29 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మ్యాచ్ తర్వాత గ్రీవ్స్ మాట్లాడుతూ.. "టెస్టుల్లో ఫస్ట్ టైమ్ 5 వికెట్లు సాధించడం చాలా హ్యాపీగా ఉంది. కెప్టెన్ చెప్పినట్లు ఒకే ఏరియాలో లైన్ అండ్ లెంగ్త్ మెయింటెన్ చేశాను. బంతి కొద్దిగా మూవ్ అవ్వడం నా బౌలింగ్‌కు హెల్ప్ అయింది" అని చెప్పాడు.

55
వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ పతనం.. మ్యాచ్‌లో ఫుల్ థ్రిల్
Image Credit : Instagram/ICC

వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ పతనం.. మ్యాచ్‌లో ఫుల్ థ్రిల్

గ్రీవ్స్ మ్యాజిక్ స్పెల్ వల్ల లభించిన లీడ్‌ను విండీస్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో షమార్ జోసెఫ్, కెమార్ రోచ్ ఉన్నారు. విండీస్ మొత్తం మీద 155 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆగస్టు 2 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Recommended image2
CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్‌వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved