- Home
- Sports
- Cricket
- Virat Kohli: బుడగ దాటనున్న విరాట్ కోహ్లి, పంత్.. ఆఖరు టీ20తో పాటు శ్రీలంక సిరీస్ కూ డుమ్మా.. కారణమిదే..
Virat Kohli: బుడగ దాటనున్న విరాట్ కోహ్లి, పంత్.. ఆఖరు టీ20తో పాటు శ్రీలంక సిరీస్ కూ డుమ్మా.. కారణమిదే..
Virat kohli and Rishabh Pant Leaves Bio Bubble: విండీస్ తో ఆఖరు టీ20కి ముందు భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఈ మ్యాచుతో పాటు శ్రీలంక సిరీస్ కు కూడా...

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. గురువారం విండీస్ తో జరిగిన రెండో టీ20లో మునపటి ఆటతీరుతో ఆకట్టుకున్న కోహ్లి.. ఆఖరి టీ20కి మాత్రం అందుబాటులో ఉండటం లేదు.
ఇప్పటికే విండీస్ తో టీ20 సిరీస్ నెగ్గిన భారత్.. ఇక చివరిదైన మూడో టీ20ని ఆదివారం ఆడనుంది. ఈ మ్యాచుకు కోహ్లి,రిషభ్ పంత్ లకు విశ్రాంతినిచ్చింది టీమిండియా.. ఈ మ్యాచుతో పాటు త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ లో కూడా కోహ్లి, పంత్ ఆడటం లేదు.
విండీస్ తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా జట్టు.. కోల్కతా లో బయో బబుల్ లో గడుపుతున్నది. అయితే మూడో మ్యాచుకు ముందే కోహ్లి.. బుడగ (బబుల్) ను వీడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారి కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు.
‘అవును.. భారత్ ఇప్పటికే సిరీస్ నెగ్గిన నేపథ్యంలో కోహ్లి శనివారం బయో బబుల్ ను వీడనున్నాడు. బీసీసీఐ ఇదివరకే నిర్ణయించినట్టు.. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు బబుల్ నుంచి విరామం ఇవ్వనున్నాం. తీరిక లేని క్రికెట్ వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలను ఎదుర్కుంటున్నారు.
దీంతో క్రికెటర్లకు వర్క్ లోడ్ తగ్గించడానికి పీరియాడిక్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించాం. పది రోజుల పాటు కోహ్లి.. బబుల్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నాడు..’ అని తెలిపాడు. విండీస్ తో ఆఖరు టీ20తో పాటు శ్రీలంకతో త్వరలో జరుగబోయే పొట్టి సిరీస్ కు కూడా కోహ్లి అందుబాటులో ఉండడు.
ఫిబ్రవరి 24న శ్రీలంకతో జరిగే టీ20తో మూడు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. లక్నోలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత 26, 27న ధర్మశాల లో రెండు, మూడు టీ20 లు జరుగనున్నాయి. పదిరోజుల విశ్రాంతి తీసుకునే కోహ్లి.. శ్రీలంకతో సిరీస్ కు అందుబాటులో ఉండడు.
అయితే మొహాలిలో జరుగబోయే తొలి టెస్టు (4-8) కు మాత్రం కోహ్లి ఆడే అవకాశముంది. అది కోహ్లికి వందో టెస్టు కానుంది.
శ్రీలంక తో సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఆడనున్నారు. అయితే విండీస్ తో రెండో వన్డే సందర్భంగా గాయపడిన కెఎల్ రాహుల్ మాత్రం శ్రీలంకతో టీ20లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతడు ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లోని రిహాబిటేషన్ సెంటర్ లో ఉన్నాడు.