MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • Cricket
  • virat Kohli: కెప్టెన్సీ పోయింది కదా.. ఇప్పుడతడు మరింత ప్రమాదకరం.. విరాట్ పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

virat Kohli: కెప్టెన్సీ పోయింది కదా.. ఇప్పుడతడు మరింత ప్రమాదకరం.. విరాట్ పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir on virat Kohli: సందర్భం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తో పాటు ఆటగాడిగా అతడి వైఫల్యాలను  ఎత్తి చూపే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈసారి దానికి  విరుద్ధంగా మాట్లాడాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 12 2021, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ (బీసీసీఐ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని భేష్ అంటున్నవారు కొందరైతే.. అదో పనికిమాలిన నిర్ణయమని మరికొందరు  కామెంట్స్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. విరాట్ పై తనదైన శైలిలో స్పందించాడు. ఎప్పుడూ ఎడమొహం పెడమొహంలా ఉండే వీళ్లిద్దరి సంబంధాల మధ్య గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

38

విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ గా తొలగించడంపై గంభీర్ మాట్లాడుతూ.. ‘రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు) లో రోహిత్ శర్మ రోల్ ఎలాంటిదో.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్ పాత్ర కూడా అంతే. ఈ నిర్ణయం (కెప్టెన్సీ నుంచి తప్పించడం) కోహ్లీకి లాభించేదే. దీని ద్వారా అతడు కొన్ని బాధ్యతల నుంచి  విముక్తుడయ్యాడు. 

48

దీంతో అతడు వైట్ బాల్ క్రికెట్ (వన్డే, టీ20 లు) లో మరింత ప్రమాదకారిగా మారే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు అతడి భుజాలపై కెప్టెన్సీ ఒత్తిడి లేదు. అతడు  ఇండియా గర్వించే విధంగా ఆడుతాడు. 

58

ఒక్క టెస్టులలోనే కాదు.. వన్డేలు, టీ20లలో కూడా విరాట్ మళ్లీ పరుగుల ప్రవాహాన్నా కొనసాగిస్తాడు.  ఇదే సమయంలో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు అనేది జట్టుకు ఉపకరించేదే. జట్టుకు వారి విజన్ ఉపయోగపడుతుంది. 

68

ఫార్మాట్ ఏదైనా.. ఇకనుంచి  భారత క్రికెట్ అభిమానులు  విరాట్ కోహ్లీ లోని ఉత్తమ ఆటను చూడబోతారు.  అదే సమయంలో  సుదీర్ఘకాలంగా అతడు ఆట మీద చూపిస్తున్న మక్కువ.. క్రికెట్ మీద అతడికున్న అభిరుచి కెప్టెన్ కాకపోయినా ఉత్తమంగానే ఉంటాయి...’ అని గంభీర్ చెప్పాడు. 

78

గతంలో ఐపీఎల్ సందర్భంగా వీళ్లిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అని  నోరు పారేసుకుని కొట్టుకున్నంత పని చేసిన  ఘటనను ఇద్దరి అభిమానులు ఇప్పటికీ మరువలేరు. తాజాగా గంభీర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. 

88

దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత టెస్టు జట్టుతో పాటు వన్డే నాయకత్వ మార్పులు కూడా చేసిన బీసీసీఐ.. విరాట్ ను తప్పించి  రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారథిగా నియమించిన విషయం తెలిసిందే.  వన్డే కెప్టెన్ గా అత్యంత  విజయవంతమైన రికార్డున్నా..  ఐసీసీ ట్రోఫీ లేదనే కారణంతో కోహ్లీని కెప్టెన్ గా తొలగించినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

About the Author

SM
Srinivas M
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved