MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: కోహ్లీపై భారీ కుట్ర‌.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన జ‌ర్మ‌న్ మోడ‌ల్

Virat Kohli: కోహ్లీపై భారీ కుట్ర‌.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన జ‌ర్మ‌న్ మోడ‌ల్

Virat Kohli: జర్మన్ మోడ‌ల్, ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ పోస్ట్‌కు కోహ్లీ లైక్ చేశాడన్న వార్త వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. తాజాగా లిజ్ లాజ్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2 Min read
Author : Narender Vaitla
Published : May 12 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోహ్లీపై ఆరోపణలు చేయమంటూ ఒత్తిడి?
Image Credit : lizlaz_tv, virat.kohli/Instagram

కోహ్లీపై ఆరోపణలు చేయమంటూ ఒత్తిడి?

లిజ్ లాంజ్ పోస్ట‌కు కోహ్లి అకౌంట్ నుంచి లైక్ చేసిన‌ట్లు క‌నిపించ‌డం, ఆ త‌ర్వాత లైక్ క‌నిపించ‌క‌పోవ‌డంతో కొందరు నెటిజన్లు దీనిని పెద్ద వివాదంగా మార్చి కోహ్లీపై ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ ఘటనతో లిజ్ లాజ్ పేరు కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే అప్పట్లోనే ఆమె స్పందిస్తూ, కోహ్లీపై వస్తున్న విమర్శలు అనవసరం అని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ అంశంపై మాట్లాడిన ఆమె మరింత సంచలన విషయాలను బయటపెట్టింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లిజ్ లాజ్, కొంతమంది జర్నలిస్టులు తనను సంప్రదించారని తెలిపింది. విరాట్ కోహ్లీ గురించి నెగిటివ్‌గా మాట్లాడాలని, ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పింది. అంతేకాదు, అలా చేస్తే డబ్బు కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు వెల్లడించింది. “కోహ్లీ గురించి చెడుగా మాట్లాడమని కొందరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అతని ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయాలని కోరారు. కానీ డబ్బు కోసం లేదా పాపులారిటీ కోసం నేను అలా చేయలేను” అని ఆమె స్పష్టం చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
“ఆ లైక్ వెనక దురుద్దేశం లేదు”
Image Credit : Instagram/lizlaz_tv + ANI

“ఆ లైక్ వెనక దురుద్దేశం లేదు”

లిజ్ లాజ్ మాట్లాడుతూ, కోహ్లీ చేసిన లైక్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. “మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది” అని పేర్కొంది. అలాగే, “ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు” అని ఆమె చెప్పింది.

Related Articles

Related image1
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Related image2
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
34
కోహ్లీని మెస్సీ, రొనాల్డోతో పోల్చిన లిజ్
Image Credit : Instagram/lizlaz_tv + ANI

కోహ్లీని మెస్సీ, రొనాల్డోతో పోల్చిన లిజ్

విరాట్ కోహ్లీపై తనకున్న గౌరవాన్ని కూడా లిజ్ లాజ్ వెల్లడించింది. ఆసియా ఖండంలో కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, ఆయనను ఫుట్‌బాల్ దిగ్గజాలుమెస్సీ, రొనాల్డో స్థాయిలో పోల్చింది. “కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం” అని ఆమె పేర్కొంది.

44
భారత్‌లో లిజ్ లాజ్‌కు పెరిగిన క్రేజ్
Image Credit : ANI

భారత్‌లో లిజ్ లాజ్‌కు పెరిగిన క్రేజ్

ఈ వివాదం తర్వాత భారత్‌లో లిజ్ లాజ్‌కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతోనూ ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది.

అలాగే, తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టును ఫాలో అవుతానని చెప్పింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే
Recommended image2
PBKS vs DC : 210 రన్స్ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది? 5 కారణాలు ఇవే!
Recommended image3
IPL 2026 : స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ వరల్డ్ రికార్డ్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్?
Related Stories
Recommended image1
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Recommended image2
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved