MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు

Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు

Virat Kohli Breaks 10 Records: తిరువనంతపురంలో వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగంగా 15 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో కోహ్లీ 10 అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 28 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్: తిరువనంతపురంలో విండీస్‌పై తుపాను సెంచరీ
Image Credit : X/BCCI

కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్: తిరువనంతపురంలో విండీస్‌పై తుపాను సెంచరీ

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు తిరుగులేని విజయాన్ని అందుకుంది. విండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే అత్యంత సులువుగా అందుకుంది. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ దిమ్మతిరిగే సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్ 108 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 పరుగులు చేసి పక్కా సపోర్ట్ అందించగా, విరాట్ కోహ్లీ మాత్రం విండీస్ బౌలర్లకు నరకం చూపించాడు.

కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 10 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 139 పరుగులు చేసి క్రీజ్‌లో శివతాండవం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను మన వైపు తిప్పేశారు. గిల్‌కు ఇది వన్డేల్లో 10వ సెంచరీ కాగా, కోహ్లీకి ఇది 55వ వన్డే సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 86వ సెంచరీ కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వన్డేల్లో వేగంగా 15 వేల పరుగులు: సచిన్ రికార్డు బద్దలు
Image Credit : ANI

వన్డేల్లో వేగంగా 15 వేల పరుగులు: సచిన్ రికార్డు బద్దలు

ఈ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. విరాట్ కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే (15,950 బంతుల్లో) ఈ మైలురాయిని చేరుకోగా, సచిన్ దీని కోసం 377 ఇన్నింగ్స్‌లు (17,528 బంతులు) తీసుకున్నాడు.

ప్రపంచ వన్డే చరిత్రలోనే 15 వేల పరుగులు దాటిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త అధ్యాయం లిఖించాడు. సచిన్ (463 మ్యాచుల్లో 18,426 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే (315 మ్యాచుల్లో 15,080 పరుగులు).

36
సచిన్ vs కోహ్లీ (15K వన్డే పరుగులు)
Image Credit : ANI

సచిన్ vs కోహ్లీ (15K వన్డే పరుగులు)

• ఇన్నింగ్స్‌లు: సచిన్ (377) | కోహ్లీ (303)

• ఎదుర్కొన్న బంతులు: సచిన్ (17,528) | కోహ్లీ (15,950)

• వయసు: సచిన్ (34 ఏళ్ల 66 రోజులు) | కోహ్లీ (37 ఏళ్ల 326 రోజులు)

46
స్వదేశంలో 7,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ కోహ్లీ
Image Credit : ANI

స్వదేశంలో 7,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ కోహ్లీ

స్వదేశంలో జరిగిన వన్డే మ్యాచుల్లో 7,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం హోమ్ వన్డేల్లో కోహ్లీ ఖాతాలో 7,006 పరుగులు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌లో 6,976 వన్డే పరుగులు చేశారు. అలాగే భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ (260 ఇన్నింగ్స్‌ల్లో). దీంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (313 ఇన్నింగ్స్‌ల్లో 42 సెంచరీలు) రికార్డును కోహ్లీ సమం చేశాడు.

56
ఒకే ప్రత్యర్థిపై 10 సెంచరీలు: రిక్కీ పాంటింగ్ రికార్డు బ్రేక్
Image Credit : ANI

ఒకే ప్రత్యర్థిపై 10 సెంచరీలు: రిక్కీ పాంటింగ్ రికార్డు బ్రేక్

వెస్టిండీస్‌పై కోహ్లీకి ఇది 10వ వన్డే సెంచరీ. గతంలో శ్రీలంకపై కూడా విరాట్ 10 సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధికంగా 10 సెంచరీలు చేసిన రికార్డు ఒక్క విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. దీనితో పాటు వన్డేల్లో లక్ష్య ఛేదనలో జట్టును అత్యధిక సార్లు విజేతగా నిలిపిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (112 విజయాలు) ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ (111)ను వెనక్కి నెట్టేశాడు. ఈ జాబితాలో సచిన్ (127), ఎంఎస్ ధోనీ (116) తర్వాత కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

66
అల్జారీపై విరుచుకుపడి.. కెరీర్‌లో తొలిసారి 9 సిక్సర్లు
Image Credit : ANI

అల్జారీపై విరుచుకుపడి.. కెరీర్‌లో తొలిసారి 9 సిక్సర్లు

ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసానికి విండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పూర్తిగా బలైపోయాడు. జోసెఫ్ బౌలింగ్‌లోనే కోహ్లీ ఏకంగా 53 పరుగులు రాబట్టాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో ఒక బౌలర్‌పై కోహ్లీ సాధించిన రెండో అత్యధిక పరుగులు ఇవే. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో ఒకే మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాదడం కోహ్లీకి ఇదే తొలిసారి.

బంతుల పరంగా ఇది విరాట్‌కు మూడో వేగవంతమైన వన్డే సెంచరీ (74 బంతుల్లో). అంతేకాకుండా, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులో సచిన్ (60 సెంచరీలు - 538 ఇన్నింగ్స్‌లు) సరసన కోహ్లీ (60 సెంచరీలు - 338 ఇన్నింగ్స్‌లు) చేరాడు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కింగ్ కోహ్లీ, 2027 వన్డే వరల్డ్ కప్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Recommended image3
IND vs WI: 2027 వన్డే వరల్డ్ కప్ వేట షురూ.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా
Related Stories
Recommended image1
Bank Strike: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న కొత్త తలనొప్పి
Recommended image2
IND vs WI: 2027 వన్డే వరల్డ్ కప్ వేట షురూ.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved