MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2024లో భారత్ క‌ప్పుకొట్టాలంటే విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలు ఆడాల్సిందే.. ఎందుకంటే.?

T20 World Cup 2024లో భారత్ క‌ప్పుకొట్టాలంటే విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలు ఆడాల్సిందే.. ఎందుకంటే.?

Rohit Sharma-Virat Kohli: 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భార‌త స్టార్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడతారా లేదా అనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. టీమ్ ఇండియాకు చెందిన ఈ ఇద్దరు బలమైన బ్యాట్స్‌మెన్ ఉంటే మెగా టోర్నీలో భారత్ కు క‌ప్పు కొట్ట‌డం తేలిక‌వుతుంద‌ని క్రికెట్ విశ్లేషకులు, క్రికెట్ ప్రియులు పేర్కొంటున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 11 2023, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

T20 World Cup-Team India: ఐసీసీ మ‌రో మెగా టోర్నీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న  ఎలాగైన క‌ప్పు కొట్టాల‌ని బీసీసీ ప్రాణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌ట్టుకూర్పుపై స‌మాలోచ‌న‌లు చేస్తోంది. అయితే, టీమిండియా స్టార్ బ్యాట‌ర్ల‌కు జ‌ట్టులో చోటుద‌క్క‌క‌పోవ‌చ్చున‌ని టాక్ వినిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భార‌త స్టార్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడతారా లేదా అనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. టీమ్ ఇండియాకు చెందిన ఈ ఇద్దరు బలమైన బ్యాట్స్‌మెన్ ఉంటే మెగా టోర్నీ క‌ప్పు కొట్ట‌డం తేలిక‌వుతుంద‌ని క్రికెట్ ప్రియులు పేర్కొంటున్నారు.
 

37
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

అయితే, వీరిద్దరూ కొంత కాలంగా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వైట్ బాల్ క్రికెట్ టీ20లు, వ‌న్డేల‌కు కూడా ఆడడం లేదు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 'బాక్సింగ్ డే టెస్ట్'లో కింగ్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌లు ఆడ‌నున్నారు. 

47
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

అయితే, ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023లో ఆడిన ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు త‌మ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. త‌మ‌దైన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిపించిన స్టార్ ప్లేయ‌ర్లు విరాట్, రోహిత్ లు ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024 లో ఆడతారా లేదా అనే పెద్ద ప్రశ్న.. కానీ, భార‌త జ‌ట్టు మెగా టోర్నీ క‌ప్పు కొట్టాలంటే స్టార్ ప్లేయ‌ర్లకు జ‌ట్టులో చోటుక‌ల్పించాల‌ని ప‌లువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 

57
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

ఎందుకంటే, విరాట్ కోహ్లీ 115 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో, అతను 52.73 సగటుతో, 137.96 స్ట్రైక్ రేట్‌తో 4008 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్‌లో విరాట్‌ పేరిట 1 సెంచరీ, 37 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
 

67
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

మ‌రో స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మకు కూడా టీ20ల్లో మంచి రికార్డు ఉంది. రోహిత్ 148 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 31.32 సగటుతో మరియు 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 పరుగులు చేశాడు. అంటే వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో ఆడాల్సిన అవసరం ఏముందో ఈ రికార్డు నుండే అర్థం చేసుకోవచ్చు. 
 

77
rohit sharma and virat kohli

rohit sharma and virat kohli

అలాగే, ఫామ్ విష‌యానికి వ‌స్తే.. 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ తో గర్జించాడు. 11 మ్యాచ్‌ల్లో 765 పరుగులు చేసి కొత్త ప్రపంచకప్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లోనే వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్కోరింగ్ పరంగా రోహిత్ విరాట్ కంటే వెనుకబడి ఉండగా, రోహిత్ 11 మ్యాచ్‌లలో 54.27 సగటు, 125.94 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేశాడు. అంటే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆటను మార్చే సత్తా ఈ స్టార్ ప్లేయ‌ర్ జోడీకి ఉందన్నమాట.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved