MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Retirement : CSK తోనే ప్రారంభం, సిఎస్కేతోనే ముగింపు : ఐపిఎల్ కు టీమిండియా మాజీ ప్లేయర్ గుడ్ బై

Retirement : CSK తోనే ప్రారంభం, సిఎస్కేతోనే ముగింపు : ఐపిఎల్ కు టీమిండియా మాజీ ప్లేయర్ గుడ్ బై

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న విజయ్, ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

1 Min read
Author : Arun Kumar P
| Updated : May 22 2026, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ శంకర్ రిటైర్మెంట్..
Image Credit : ANI

విజయ్ శంకర్ రిటైర్మెంట్..

Vijay Shankar Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నుండి చెన్నై సూపర్ కింగ్స్ ఇలా నిష్క్రమించగానే అలా ఓ టీమిండియా క్రికెటర్ ఐపిఎల్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున వన్డే, టీ20ల్లో ఆడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్.. దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. CSK, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడిన విజయ్, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన విజయ్
Image Credit : ANI

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన విజయ్

గత ఐపీఎల్ సీజన్‌లో విజయ్ శంకర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. కానీ ఈసారి వేలంలో అతడు అమ్ముడుపోలేదు… దీంతో ఈ ఐపిఎల్ సీజన్ కు దూరంగా ఉన్నాడు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయినా మౌనంగానే ఉన్నాడు… కానీ ఇప్పుడు అనూహ్యంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ప్రకటించాడు.

Related Articles

Related image1
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?
Related image2
CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
35
విదేశీ లీగ్ టోర్నీలపై దృష్టి..
Image Credit : PTI

విదేశీ లీగ్ టోర్నీలపై దృష్టి..

ఈసారి ఐపీఎల్ నుంచి CSK నిష్క్రమించిన వెంటనే విజయ్ శంకర్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్ టోర్నీల్లో తన కెరీర్‌ను కొనసాగించే లక్ష్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. 

45
ప్రపంచకప్ ఆడిన విజయ్ శంకర్
Image Credit : Getty

ప్రపంచకప్ ఆడిన విజయ్ శంకర్

విజయ్ శంకర్ టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2019 ప్రపంచకప్ టోర్నీలో ఆల్‌రౌండర్ కోటాలో నెం.4 స్థానం కోసం విజయ్‌ను ఎంపిక చేశారు. మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడు, సురేశ్ రైనా వంటివారిని కాదని విజయ్ ని వరల్డ్ కప్ కు ఎంపికచేయడం వివాదాస్పదం అయ్యింది. ఇలా అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నా  ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు… దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. 

55
CSKతో మొదలై CSKతో ముగింపు
Image Credit : Getty

CSKతో మొదలై CSKతో ముగింపు

విజయ్ శంకర్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2013లో CSKతో ప్రారంభించాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడి, మళ్లీ CSKకే తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ విజయ్ సభ్యుడిగా ఉన్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Related Stories
Recommended image1
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?
Recommended image2
CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved