MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav: ఈ చిచ్చర పిడుగు సచిన్ రికార్డును బ్రేక్ చేసేలా ఉన్నాడే.. వైభవ్ సరికొత్త చరిత్ర ఖాయం.?

Vaibhav: ఈ చిచ్చర పిడుగు సచిన్ రికార్డును బ్రేక్ చేసేలా ఉన్నాడే.. వైభవ్ సరికొత్త చరిత్ర ఖాయం.?

Vaibhav: భారత క్రికెట్‌లో కొత్త తరం ఆరంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే భారీ అంచనాలు తెచ్చుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్పుడు జాతీయ జట్టులోకి ప్రవేశించే దశకు చేరుకున్నాడు. అతని ప్రతిభ సెలెక్టర్ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. 

3 Min read
Author : Narender Vaitla
Published : Apr 15 2026, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐర్లాండ్ పర్యటనతో కెరీర్ మలుపు
Image Credit : Asianet News

ఐర్లాండ్ పర్యటనతో కెరీర్ మలుపు

భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా ఈసారి ఐర్లాండ్ పర్యటనను ప్రయోగాత్మకంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రధాన జట్టుకు విశ్రాంతి ఇస్తూ, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్క‌ర్‌ నేతృత్వంలో కొంతమంది యువ ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ పేరు ముందంజలో ఉందని సమాచారం. అతడిని టీ20 ఫార్మాట్‌కు సరైన ఎంపికగా భావిస్తున్నారు. ఐర్లాండ్ పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, కొత్త ఆటగాళ్లకు తమ ప్రతిభ చూపేందుకు మంచి ప్లాట్ ఫామ్ గా ఉండటం కూడా అతడికి ప్లస్‌గా మారింది. ఒకవేళ ఈ టూర్‌లో అవకాశం దక్కితే, అదే అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది.

25
సచిన్ రికార్డు బద్దలు అయ్యే ఛాన్స్
Image Credit : Getty

సచిన్ రికార్డు బద్దలు అయ్యే ఛాన్స్

భారత క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రికార్డు ఇప్పటివరకు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. అతను 16 ఏళ్ల 205 రోజుల్లోనే అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. మహిళల విభాగంలో ఈ రికార్డు ష‌ఫాలీ వ‌ర్మ పేరిట ఉంది. ఇప్పుడు వైభవ్ వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఈ పరిస్థితిలో ఐర్లాండ్ సిరీస్‌లో అతనికి అవకాశం లభిస్తే, ఈ రెండు రికార్డులు కూడా చరిత్రలో కలిసిపోతాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు, భారత క్రికెట్‌లో కొత్త యుగానికి నాంది కూడా అవుతుంది. అంత చిన్న వయసులో ఒత్తిడిని తట్టుకుని ప్రదర్శన చేయడం పెద్ద సవాలే అయినా, వైభవ్ ధైర్యం చూస్తే అతను ఈ ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు అర్థ‌మ‌వుతోంది.

Related Articles

Related image1
Saying: అత్త‌లేని కోడ‌లు ఎలా ఉత్త‌మురాలు అవుతుంది.? దీని లాజిక్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Related image2
పాడైన కూల‌ర్‌తో అద్భుతాలు.. ఇది తెలిస్తే ఇక పాత ఇనుస సామానుకు ఇచ్చేయ‌రు
35
ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రదర్శనలు
Image Credit : Getty

ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రదర్శనలు

ప్రస్తుతం జరుగుతున్న ఇండియ‌న్ ప్రీమియం లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ చూపిస్తున్న ఆట తీరు అసాధారణం. అతను కేవలం పరుగులు చేయడం కాదు, మ్యాచ్ దిశనే మార్చే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు చేయడం అతని దూకుడుకు నిదర్శనం. అలాగే చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై 17 బంతుల్లో 52, ముంబై ఇండియ‌న్స్‌పై 14 బంతుల్లో 39 పరుగులు చేసి బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతని స్ట్రైక్ రేట్, షాట్ సెలెక్షన్, ప్రెషర్‌లో ఆడే తీరు అన్నీ క‌లిసి అతన్ని టీ20 స్పెషలిస్ట్‌గా నిలబెట్టాయి. ఈ ప్రదర్శనల వల్లే సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

45
దిగ్గజాల ప్రశంసలు, సపోర్ట్
Image Credit : Getty

దిగ్గజాల ప్రశంసలు, సపోర్ట్

వైభవ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇర్ఫాన్ ప‌ఠాన్‌ అతని టెక్నిక్, ధైర్యాన్ని ప్రశంసిస్తూ, అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సామర్థ్యం ఉందని చెప్పారు. అలాగే అనిల్ కుంబ్లే కూడా అతని ఆటతీరును మెచ్చుకున్నారు. ఐపీఎల్ చైర్మన్ అరున్ ధుమ‌ల్‌ అయితే అతడు భవిష్యత్ స్టార్ అని పేర్కొన్నారు. ఇలాంటి మద్ధతు యువ ఆటగాడికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్లే ముందు ఇలాంటి విశ్వాసం ఉండటం అతని మానసిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. దీంతో అతను మరింత ధైర్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాడు.

Vaibhav Sooryavanshi is a generational talent. Beyond the aggression, fearlessness, and power-hitting, he has a plan for each delivery & bowling change.

There is a method to the madness. pic.twitter.com/MNJcZ6fjmk

— Suraj Balakrishnan (@SurajBala) April 10, 2026

55
భవిష్యత్‌లో టీమిండియా కీలక ఆట‌గాడు కావ‌డం ఖాయం
Image Credit : Getty

భవిష్యత్‌లో టీమిండియా కీలక ఆట‌గాడు కావ‌డం ఖాయం

వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక టాలెంటెడ్ ప్లేయర్ మాత్రమే కాదు, భవిష్యత్ టీమిండియా బలమైన స్తంభంగా మారే అవకాశమున్న ఆటగాడు. ఐర్లాండ్ టూర్ తర్వాత జింబాబ్వే సిరీస్ వంటి అవకాశాలు కూడా అతని ఎదుగుదలకు దోహదపడతాయి. యువ ఆటగాళ్లను ముందుకు తీసుకురావడంలో బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయం కూడా సరైన దిశలో ఉందని చెప్పాలి. ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబడగలిగితే, అతను దీర్ఘకాలం భారత జట్టుకు సేవలందించే అవకాశం ఉంది. చిన్న వయసులోనే ఇంతటి ఒత్తిడిని హ్యాండిల్ చేయడం సులభం కాదు, కానీ వైభవ్ ఆత్మవిశ్వాసం చూస్తే అతను పెద్ద స్థాయికి చేరుకోవడం ఖాయం అనిపిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zanai Bhosle : ఆశా బోంస్లే మనవరాలితో సిరాజ్‌ రిలేషన్ ఏంటి..? ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ
Recommended image2
Womens Cricket: విజేత‌ల‌కు రూ. 82 కోట్ల బ‌హుమ‌తి.. క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు
Recommended image3
Praful Hinge Net Worth : ఐపిఎల్ లో రూ.30 లక్షలే... కానీ ప్రఫుల్ హింగే నికర ఆస్తి ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Saying: అత్త‌లేని కోడ‌లు ఎలా ఉత్త‌మురాలు అవుతుంది.? దీని లాజిక్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Recommended image2
పాడైన కూల‌ర్‌తో అద్భుతాలు.. ఇది తెలిస్తే ఇక పాత ఇనుస సామానుకు ఇచ్చేయ‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved