MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !

IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు పాకిస్థాన్ మాజీలు ఫిదా అయ్యారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 29 2026, 09:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
15 ఏళ్ల కుర్రాడికి పాకిస్థాన్‌లో క్రేజ్.. బబ్లూ అంటూ కొత్త పేరు పెట్టిన మాజీ స్టార్
Image Credit : BCCI

15 ఏళ్ల కుర్రాడికి పాకిస్థాన్‌లో క్రేజ్.. బబ్లూ అంటూ కొత్త పేరు పెట్టిన మాజీ స్టార్

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. 15 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్లాస్, అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు ఫిదా అయిపోయారు.

వరల్డ్ మీడియాలోనే కాదు, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా వైభవ్ పేరు మారుమోగిపోతోంది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ నుంచి వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ వరకు అందరూ ఈ కుర్రాడి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రశంసల పరంపర బోర్డర్ దాటి పాకిస్థాన్‌కు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అఫ్రిదితో పోల్చిన మొహమ్మద్ యూసుఫ్
Image Credit : ANI

అఫ్రిదితో పోల్చిన మొహమ్మద్ యూసుఫ్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ మొహమ్మద్ యూసుఫ్ ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. వైభవ్‌ను భయం లేని, విధ్వంసకర, ఎనర్జిటిక్ బ్యాటర్‌గా అభివర్ణించాడు. అంతేకాదు, పాక్ మాజీ స్టార్ షాహిద్ అఫ్రిదితో వైభవ్‌ను పోల్చాడు.

అఫ్రిది కూడా తన కెరీర్ మొదట్లో ఇలాగే బౌలర్లపై విరుచుకుపడేవాడు. యూసుఫ్ తన ఎక్స్ ఖాతాలో.. "15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు అప్పటి యంగ్ షాహిద్ అఫ్రిది గుర్తొస్తున్నాడు. అస్సలు భయం లేదు, ఫుల్ ఎనర్జీతో ఆడుతున్నాడు. వైభవ్‌కు ఫ్యూచర్ చాలా బాగుంది" అని రాసుకొచ్చాడు.

Related Articles

Related image1
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Related image2
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
36
యూసుఫ్ కామెంట్స్‌పై మండిపడ్డ భారత అభిమానులు
Image Credit : ANI

యూసుఫ్ కామెంట్స్‌పై మండిపడ్డ భారత అభిమానులు

మొహమ్మద్ యూసుఫ్ వైభవ్‌ను అభినందించినా.. అతడిని షాహిద్ అఫ్రిదితో పోల్చడం చాలా మంది భారత అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. 

ఒక యూజర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. "ముందు విరాట్ కోహ్లీని రంజీ లెవెల్ ప్లేయర్ బాబర్ ఆజంతో పోల్చి అవమానించారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని షాహిద్ అఫ్రిదితో పోలుస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు అఫ్రిది బేసిక్‌గా ఒక బౌలర్. ఎప్పుడో ఒకటో రెండో ఇన్నింగ్స్‌లు బాగా ఆడాడంతే. కానీ వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్, కన్సిస్టెన్సీ, మ్యాచ్ కంట్రోల్ వేరే లెవెల్‌లో ఉన్నాయి" అంటూ పేర్కొన్నాడు.

46
బాసిత్ అలీ పెట్టిన ముద్దుపేరు బబ్లూ
Image Credit : ANI

బాసిత్ అలీ పెట్టిన ముద్దుపేరు బబ్లూ

పాకిస్థాన్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అబ్దుల్ గఫార్ కూడా స్పందించాడు. "నాకైతే వైభవ్‌కు 15 ఏళ్లంటే నమ్మకం కలగడం లేదు. డొమెస్టిక్, ఐపీఎల్‌లో అతడు చేస్తున్నది అద్భుతమే. కానీ అసలు పరీక్ష ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి యావరేజ్ 17 మాత్రమే ఉంది. టాలెంట్ ఉంది కానీ, ప్రెజర్ తట్టుకుని నిలబడగలడా అనేది చూడాలి" అని ట్వీట్ చేశాడు.

మరోవైపు పాక్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో వైభవ్‌కు ఒక ముద్దుపేరు పెట్టాడు. "ఈ వయసులోనే వాడు మిస్టర్ యూనివర్స్ అయిపోయాడు. నేనైతే వాడిని ప్రేమగా 'బబ్లూ' అని పిలుస్తా. ఏం బ్యాటింగ్ చేశాడు భయ్యా! 16 బంతుల్లో 54 రన్స్ కొట్టాడు. వాడు అవుట్ అయిన బాల్ థర్డ్ మ్యాన్ మీదుగా సిక్స్ వెళ్లుంటే క్రిస్ గేల్ రికార్డ్ బద్దలయ్యేది. భవిష్యత్తులో గేల్ రికార్డును ఈ కుర్రాడే బ్రేక్ చేస్తాడు" అన్నాడు.

రాహుల్ ద్రవిడ్‌ను మెచ్చుకుంటూ.. "ద్రవిడ్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఈ అబ్బాయిని రూ.1.10 కోట్లకు కొనింది. ద్రవిడ్ ప్రపంచానికి ఒక వండర్‌ఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆడుతూ ఉండు బబ్లూ మియా, వరల్డ్ బౌలర్లు నిన్ను చూసి భయపడతారు" అని కొనియాడాడు.

56
పాకిస్థాన్‌లో ఉంటే ఏం జరిగేదంటే?
Image Credit : ANI

పాకిస్థాన్‌లో ఉంటే ఏం జరిగేదంటే?

మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ కూడా వైభవ్ ఆటపై మాట్లాడాడు. ఈ ఐపీఎల్ ముగియగానే వైభవ్‌కు టీమిండియా నుంచి పిలుపు వస్తుందని జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ షో 'గేమ్‌ప్లాన్'లో మాట్లాడుతూ.. "వైభవ్ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ తర్వాత భారత్ ఆడే టీ20 మ్యాచ్‌లలో ఇతడికి కచ్చితంగా ఛాన్స్ వస్తుంది" అన్నాడు.

గత నెలలో బాసిత్ అలీ ఇండియన్ క్రికెట్ సిస్టమ్‌ను పొగుడుతూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. "14, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఆ ఫస్ట్ బాల్‌కే అవుట్ అయి ఉంటే పాకిస్థాన్‌లో ఏమనేవారో తెలుసా? ‘వీడిని టీమ్ నుంచి గెంటేయండి’ అనేవాళ్లు. కానీ ఇండియాలో యంగ్ ప్లేయర్స్‌కు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరు. అందుకే వాళ్లు ఇంత బాగా రాణిస్తున్నారు" అని చెప్పాడు.

66
ఒత్తిడిని చిత్తు చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన వైభవ్
Image Credit : ANI

ఒత్తిడిని చిత్తు చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీ పేరుతోనే గుర్తుండిపోనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతడు ఏకంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. 237.31 స్ట్రైక్ రేటుతో దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్ లో కేవలం 35 బాల్స్‌లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ క్రియేట్ చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టిన ఘనత కూడా అతడిదే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishabh Pant : కెప్టెన్సీకి పంత్ గుడ్‌బై.. LSG కొత్త సారథి ఎవరు?
Recommended image2
GT vs RR : ఓడిన జట్టు ఫైనల్ కి.. గెలిచిన జట్టు ఇంటికి..: ఐపిఎల్ క్వాలిఫయర్-2 లో జరిగేది ఇదేనా..?
Recommended image3
GT vs RR : అందరి కళ్లు వైభవ్ పైనే.. గుజరాత్ VS రాజస్థాన్ క్వాలిఫయర్-2.. ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ ఎవరిది?
Related Stories
Recommended image1
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image2
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved