స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే.. !
Top-5 Indian bowlers: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించి అంతర్జాతీయ స్థాయిలో మన బౌలర్లు పేరు సంపాదించారు. భారత జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా, 500లకు పైగా వికెట్లు, స్వదేశంలో 300 ప్లస్ వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్ల వివరాలు ఇలా వున్నాయి.
Jadeja, ashwin, Kumble
5. రవీంద్ర జడేజా (85 ఇన్నింగ్స్‌ల్లో 210* వికెట్లు)
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో, స్టార్ ఇండియన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సొంతగడ్డపై 200 టెస్ట్ వికెట్లు తీసిన ఐదవ భారత బౌలర్‌గా నిలిచాడు. జడేజా స్వదేశంలో తన 200వ టెస్టు వికెట్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అవుట్ చేశాడు. మొత్తంగా భారత ఆల్ రౌండర్ జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 71* టెస్టులు ఆడి 3000+ పరుగులు, 291* వికెట్లు తీశాడు. స్వదేశంలో, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొత్తం 43* మ్యాచ్‌లు ఆడాడు. 2.69 ఎకానమీతో 210* టెస్ట్ వికెట్లు తీశాడు.
4. కపిల్ దేవ్ (119 ఇన్నింగ్స్‌ల్లో 219 వికెట్లు)
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్, టీమిండియా లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం సృష్టించిన గొప్ప పేసర్లలో ఒకరిగా గుర్తింపు సాధించారు. కపిల్ దేవ్ ఇప్పటికీ ఇండియా సుదీర్ఘమైన ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్. దిగ్గజ భారత కెప్టెన్ తన కెరీర్ లో 131 టెస్ట్ మ్యాచ్‌లలో 434 వికెట్లు తీసుకున్నాడు. కపిల్ దేవ్ 119 ఇన్నింగ్స్‌లలో 2.85 ఎకానమీతో స్వదేశంలో 219 వికెట్లు పడగొట్టాడు.
Harbhajan Singh
3. హర్భజన్ సింగ్ (103 ఇన్నింగ్స్‌ల్లో 265 వికెట్లు)
హర్భజన్ సింగ్ ఆడుతున్న రోజుల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకడు. దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేతో గొప్ప స్పిన్-బౌలింగ్ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు. హర్భజన్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో103 టెస్ట్ మ్యాచ్‌లలో 417 వికెట్లు తీసుకున్నాడు. ఈ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ స్వదేశంలో భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్. మాజీ భారత ఆఫ్ స్పిన్నర్ 55 హోమ్ టెస్ట్ గేమ్‌లలో 2.69 ఎకానమీతో 265 వికెట్లు పడగొట్టాడు. భజ్జీ 1998లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసి 2015లో శ్రీలంకతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
2. అనిల్ కుంబ్లే (115 ఇన్నింగ్స్‌ల్లో 350 వికెట్లు)
లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. కుంబ్లే 132 టెస్ట్ మ్యాచ్‌లలో 619 వికెట్లు పడగొట్టిన కెరీర్‌లో స్వదేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై భారత్ తరఫున అనేక గొప్ప ప్రదర్శనలు చేశాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్ తర్వాత భారత మాజీ కెప్టెన్ కుంబ్లే టెస్టు క్రికెట్‌లో ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన నాల్గవ బౌలర్ గా ఉన్నారు. స్వదేశంలో కుంబ్లే 2.51 ఎకానమీతో 63 టెస్ట్ మ్యాచ్‌లలో 350 వికెట్లు తీశాడు.
Ravichandran Ashwin, Ashwin
1. రవిచంద్రన్ అశ్విన్ (115 ఇన్నింగ్స్‌ల్లో 351* వికెట్లు)
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకరు. గత దశాబ్ద కాలంగా అశ్విన్ భారత టెస్టు జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి, 2024లో రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో, అనిల్ కుంబ్లే తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ స్వదేశంలో 115 ఇన్నింగ్స్‌ల్లో 351* వికెట్లు తీసి ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు.