- Home
- Sports
- Cricket
- Most Test Double Centuries: టెస్ట్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు
Most Test Double Centuries: టెస్ట్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు
Top 5 Indian Batters with Most Test Double Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో మంది దిగ్గజ భారతీయ బ్యాటర్లు డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించారు. విరాట్ కోహ్లీ నుండి సునీల్ గవాస్కర్ వరకు.. చాలా మంది ప్లేయర్లు డబుల్ సెంచరీల మోత మోగించారు. భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.

Top 5 Indian Batters with Most Test Double Centuries: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడంతో టీమ్ ఇండియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జట్టులో ముఖ్యంగా బ్యాటింగ్‌లో అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. జట్టు పూర్తిగా యువ, కొత్త ఆటగాళ్లతో నిండిపోయింది. టెస్టు క్రికెట్ లో కేవలం సెంచరీలు మాత్రమే కాదు డబుల్ సెంచరీల మోత మోగించి.. భారత్ కు అద్భుతమైన విజయాలు అందించిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో టాప్ 5 ప్లేయర్లను గమనిస్తే..
1. విరాట్ కోహ్లీ
టెస్టు క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత ప్లేయర్ల లిస్టులో మొదటి స్థానంలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 123 టెస్ట్‌లలో 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే, 7 డబుల్ సెంచరీలు కూడా బాదాడు.
2. వీరేంద్ర సెహ్వాగ్
టెస్టు క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో టీమిండియా మాజీ ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 103 టెస్ట్‌లలో 49.43 సగటుతో 8503 పరుగులు కొట్టాడు. ఇందులో 23 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్టు్లో 6 డబుల్ సెంచరీలతో పాటు రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా సాధించాడు.
3. సచిన్ టెండూల్కర్
టెస్టు క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్ల లిస్టులో మూడో స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 200 టెస్ట్‌లలో 53.78 సగటుతో 15921 పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్.. 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు సచిన్ పేరిట ఉంది. టెండూల్కర్ టెస్టులో 6 డబుల్ సెంచరీలు సాధించాడు.
4. రాహుల్ ద్రవిడ్
ప్రపంచ క్రికెట్ లెజెండరీలలో ఒకరైన రాహుల్ ద్రవిడ్.. భారత జట్టు కోసం ఎన్నో మారపురాని ఇన్నింగ్స్ లను ఆడాడు. అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్ల లిస్టులో రాహుల్ ద్రవిడ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 163 టెస్ట్‌లలో 52.63 సగటుతో 13265 పరుగులు సాధించాడు. ఇందులో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు ఉన్నాయి. ద్రవిడ్ టెస్టు క్రికెట్ లో 5 డబుల్ సెంచరీలు బాదాడు.
5. సునీల్ గవాస్కర్
భారత్ తరఫున టెస్టు క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్ల లిస్టులో ఐదవ స్థానంలో సునీల్ గవాస్కర్ ఉన్నాడు. సన్నీ 125 టెస్ట్‌లలో 51.12 సగటుతో 10122 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే, టెస్టులో 4 డబుల్ సెంచరీలు సాధించాడు.