IPL : రోహిత్ శర్మ vs విరాట్ కోహ్లీ.. 18 ఏళ్ల ఐపీఎల్ లో ఎవరు కింగ్?
Rohit Sharma vs Virat Kohli: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలు హాట్ టాపిక్ గా ఉన్నారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో అద్భుతమైన విజయాలు అందించారు. అయితే, 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వీరిద్దరిలో రియల్ కింగ్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma, Virat Kohli playing in IPL
ఇటీవల రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారారు. ఎందుకంటే భారత జట్టుకోసం అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. టీమిండియాకు అనేక విజయాలు అందించారు. ఇంకొంత కాలం ఆడతారని అందరూ భావించారు. కానీ, రిటైర్మెంట్ తో ఇద్దరు స్టార్లు షాకిచ్చారు. ప్రస్తుతం ఇద్దరు ఐపీఎల్ లో ఆడుతున్నారు.
Rohit Sharma, Virat Kohli playing in IPL
విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు భారత జట్టు తరఫున టీ20, టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, వన్డేల్లో ఆడనున్నారు. అలాగే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా ఆడుతున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఐపీఎల్ లో 2008 నుండి ఆడుతున్నారు. విరాట్ 18 ఏళ్లుగా ఆర్సీబీకి ట్రోఫీని అందించాడానికి పోరాటం చేస్తుండగా, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు.
Rohit Sharma, Virat Kohli playing in IPL
టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు చేశారు. ఇద్దరూ తమ జట్లకు అనేక కీలక మ్యాచ్‌లను గెలిపించారు. అయితే, ఐపీఎల్ లో కింగ్?
Rohit Sharma playing for Mumbai Indians in IPL
రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రదర్శన ఎలా ఉంది?
రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో ఆడాడు. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లలో 29.73 సగటుతో 6928 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 112 పరుగులు.
Virat Kohli playing for Royal Challengers Bangalore (RCB) in IPL
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రదర్శన ఎలా వుంది?
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ ఇప్పటివరకు 263 మ్యాచ్‌లు ఆడి 39.57 సగటుతో 8509 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 113 పరుగులు నాటౌట్.
Rohit Sharma playing for Mumbai Indians in IPL
రోహిత్ శర్మ ఐపీఎల్ సెంచరీ రికార్డులు
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 2 సెంచరీలు సాధించాడు. అలాగే, 46 హాఫ్ సెంచరీలు కొట్టాడు. రోహిత్ బ్యాట్ నుండి 297 సిక్సర్లు కూడా వచ్చాయి.
Virat Kohli playing for Royal Challengers Bangalore (RCB) in IPL
విరాట్ కోహ్లీ ఐపీఎల్ సెంచరీ రికార్డులు
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 8 సెంచరీలు సాధించాడు. 62 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అతని బ్యాట్ నుండి 290 సిక్సర్లు వచ్చాయి. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు, సెంచరీ రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి. మొత్తంగా రోహిత్, విరాట్ ప్రదర్శనలు గమనిస్తే.. కోహ్లీనే ఐపీఎల్ కింగ్ అని చెప్పవచ్చు.