సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు ఔటైన టాప్-5 డేంజర్ బ్యాట్స్‌మెన్లు
Sachin Tendulkar Bowling Records: సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ప్రమాదకరమైన గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. బౌలర్ గా కూడా దిగ్గజ ప్లేయర్లను భయపెట్టాడు. సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 201 వికెట్లు పడగొట్టాడు.

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించారు. అసాధ్యమైన రికార్డులు కూడా సుసాధ్యం చేస్తూ క్రికెట్ గాడ్ గా గుర్తింపు పొందాడు. అయితే, సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడో, అంతే ప్రమాదకరమైన బౌలర్‌గా కూడా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 201 వికెట్లు పడగొట్టాడు.
సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. సచిన్ అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ఇక బౌలర్ గా దిగ్గజ ప్లేయర్లను సైతం భయపెట్టాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లోని టాప్ 5 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. తన కెరీర్ లో సచిన్ టెండూల్కర్ అత్యధిక సార్లు ఔట్ చేసిన టాప్-5 డేంజరస్ బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇంజామామ్-ఉల్-హక్
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ బౌలింగ్ లో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాట్స్‌మన్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్. 120 టెస్టులు, 378 వన్డేల్లో 20,000 కంటే ఎక్కువ పరుగులు, 35 సెంచరీలు చేసిన ఇంజమామ్‌ను సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉన్నప్పుడల్లా సులభంగా అవుట్ చేశాడు. ఇంజమామ్ టెస్టులు, వన్డేల్లో సచిన్ బౌలింగ్ లో 7 సార్లు ఔట్ అయ్యాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే సచిన్ క్రమం తప్పకుండా బౌలింగ్ చేయకపోయినా, ఇంజమామ్ సచిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు.
Brian Lara, scahin tendulkar
2. బ్రియాన్ లారా
వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా పరిగణిస్తారు. వారిద్దరూ వారి కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు. వారిద్దరి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే సచిన్ బౌలింగ్‌లో కూడా నిపుణుడు, కానీ లారా మాత్రం కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ నాలుగుసార్లు బ్రియాన్ లారాను పెవిలియన్‌కు పంపాడు.
Andy Flower-Grant Flower
3. ఆండీ ఫ్లవర్
జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆండీ ఫ్లవర్, 63 టెస్ట్ మ్యాచ్‌ల్లో 12 సెంచరీలతో 4794 పరుగులు, 213 వన్డే మ్యాచ్‌ల్లో6786 పరుగులు చేశాడు. క్రీజులో స్థిరపడిన తర్వాత బౌలర్లకు చుక్కలు చూపించే ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వే గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో అతని పేరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కు సచిన్ టెండూల్కర్‌తో తన బౌలింగ్ తో ఇబ్బంది పెట్టేవాడు. టెండూల్కర్ తన కెరీర్‌లో ఆండీని నాలుగుసార్లు అవుట్ చేశాడు.
4. అర్జున రణతుంగ
శ్రీలంక మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు అర్జున రణతుంగను సచిన్ టెండూల్కర్ బౌలింగ్ లో 3 సార్లు అవుట్ అయ్యాడు. శ్రీలంక ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ లెజెండరీ బౌలర్లను సులభంగా ఎదుర్కొన్నాడు కానీ సచిన్ టెండూల్కర్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడేవాడు. టెండూల్కర్ అతన్ని ఎప్పుడూ తన స్పిన్ వలలోనే బంధించేవాడు. అందుకే 93 టెస్టులు, 269 వన్డేల అనుభవం ఉన్న రణతుంగ భారత్‌పై పెద్దగా పరుగులు చేయడంలో సక్సెస్ కాలేపోయాడు.
5. మహేల జయవర్ధనే
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత భయంకరమైన బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, సచిన్ టెండూల్కర్ బౌలింగ్ ముందు తరచుగా ఇబ్బందుల్లో పడుతుండేవాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మహేల జయవర్ధనేను 3 సార్లు అవుట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ పై పరుగులు సాధించడానికి మహేలా జయవర్ధనే చాలా కష్టపడాల్సి వచ్చింది. జయవర్ధనే బ్యాటింగ్ స్థిరంగా ఉన్న ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. కానీ, అతను సచిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవాడు.