- Home
- Sports
- Cricket
- Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
క్రికెట్ ప్రపంచంలో ఎందరో బ్యాటర్లు సత్తా చాటి గొప్ప క్రికెటర్లుగా గుర్తింపు పొందారు. అయితే వీరిలో కొందరు కేవలం బలహీన జట్లపైనే పరుగులు చేసి హీరోలయ్యారు... అలాంటి ఐదుగురు బ్యాటర్లు ఎవరో తెలుసా?

బలహీన జట్లపై సింహాల్లా గర్జించే క్రికెటర్లు..
Top 5 Cricketers : ఇక్కడ మనం ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్లకు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీరి గణాంకాలు చాలా బాగుంటాయి… ఇవి చూసే అభిమానులు గొప్ప క్రికెటర్లుగా గుర్తించారు. కానీ వీళ్లు కేవలం బలహీన జట్లపైనే సింహాల్లా గర్జించారన్న విషయం చాలామందికి తెలియదు.పెద్ద జట్లతో తలపడినప్పుడు క్రీజులోకి రాగానే చేతులెత్తేసిన ఆటగాళ్లు ఎవరు..? ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిగురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. Babar Azam (Pakistan)
ఈ జాబితాలో మొదటి పేరు పాకిస్థాన్ కింగ్ బాబర్ ఆజం. జింబాబ్వే, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లపైనే ఇతని రికార్డు బాగుంది. ఒకప్పుడు తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఏలుతాడనిపించాడు. కానీ పెద్ద టోర్నీల్లో, పెద్ద జట్లపై విఫలమవుతూ వచ్చాడు. ఇతడిని ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చేవారు... కానీ ఆ స్థాయి ఆటగాడు కాదని చాలా తొందరగానే అర్థమయ్యింది.
2. Quinton de Kock (South Africa)
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ కూడా బలహీనమైన జట్లపైనే గర్జిస్తాడు. అద్భుతమైన టైమింగ్, క్లీన్ హిట్టింగ్ ఉన్నా నిలకడ లేదు. ముఖ్యంగా పెద్ద జట్లపై పరుగులు చేయడంలో ప్రతిసారి విఫలం అవుతాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్లపై, ఐసీసీ టోర్నీల్లో ఎక్కువగా ఫ్లాప్ అయ్యాడు.
3. Shai Hope (West Indies)
వెస్టిండీస్ బ్యాటర్ షాయి హోప్‌ను క్లాసిక్ బ్యాటర్‌గా పరిగణిస్తారు. వన్డేల్లో అతని సగటు అద్భుతం. కానీ అతని పెద్ద స్కోర్లు చాలా వరకు అఫ్గానిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి బలహీన బౌలింగ్ ఉన్న జట్లపైనే వచ్చాయి. భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లపై ఇతను విఫలమవుతాడు.
4. Shikhar Dhawan (India)
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నీల్లో బాగా రాణించేవాడు. కానీ అతని గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఆసియా జట్లు, బలహీన బౌలింగ్ లైనప్‌లపైనే బాగా ఆడాడని తెలుస్తుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేపై అతని సగటు, స్ట్రైక్ రేట్ ఎక్కువ. అందుకే అతన్ని చిన్న జట్లపై పులిలా గర్జిస్తాడని అంటారు.
5. Imam Ul Haq (Pakistan)
పాకిస్థాన్ భవిష్యత్ తారగా ఇమామ్ ఉల్ హక్‌ను చూశారు. అతని టెక్నిక్, టెంపర్మెంట్ బాగున్నా పెద్ద జట్లు, ఒత్తిడి మ్యాచ్‌లలో అతని బ్యాట్ సైలెంట్ అవుతుంది. బలహీన జట్లపై సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడి తన సగటును పెంచుకున్నాడు. కానీ అసలు కథ వేరే ఉంది. ఇతడు మంచి ఆటగాడే కానీ గొప్ప ఆటగాడు కాదు... పెద్దపెద్ద జట్లపై అద్భుతంగా ఆడేవారే క్రికెట్లో గొప్పస్థాయికి చేరుకుంటారు.

