- Home
- Sports
- Cricket
- Richest Cricket Boards : బిసిసిఐ సంపద ఎంతో తెలుసా? టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డ్స్ ఇవే
Richest Cricket Boards : బిసిసిఐ సంపద ఎంతో తెలుసా? టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డ్స్ ఇవే
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ బోర్డుల మొత్తం ఆస్తి కంటే బీసీసీఐ సంపద ఎన్నో రెట్లు ఎక్కువ.

అత్యంత ధనిక క్రికెట్ బోర్డ్ ఏది?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అనే విషయం అందరికీ తెలిసిందే. బీసీసీఐ మొత్తం సంపద సుమారు 2.2 బిలియన్ డాలర్లు... అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా 20,840 కోట్ల రూపాయలు. బీసీసీఐ ఎంత రిచ్ అంటే.. దీని తర్వాతి స్థానాల్లో ఉన్న మూడు క్రికెట్ బోర్డుల మొత్తం ఆస్తి కంటే బీసీసీఐ సంపద 11 రెట్లు ఎక్కువ. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్లో బిసిసిఐ ఆధిపత్యం కొనసాగుతుంది.
బీసీసీఐ ఇంత ధనిక బోర్డా..!
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా 79 మిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. ఇక క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దగ్గర 59 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంది. మన పొరుగు దేశం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దగ్గర కేవలం 55 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు క్రికెట్ బోర్డుల ఆస్తులు కలిపినా 193 మిలియన్ డాలర్లు మాత్రమే అవుతుంది. ఈ మూడు బోర్డుల మొత్తం ఆస్తి కంటే బీసీసీఐ దగ్గర 3 బిలియన్ డాలర్ల అదనపు సంపద ఉండటం విశేషం.
బీసీసీఐ ఎంత బలమైన ఆర్థిక శక్తి అనడానికి ఇదే నిదర్శనం. మిగతా క్రికెట్ బోర్డులు అంతర్జాతీయ మ్యాచ్‌లు, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, దేశవాళీ టోర్నీలపై ఆధారపడతాయి. కానీ బీసీసీఐకి ఉన్న భారీ మార్కెట్, కోట్ల సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల వల్ల కమర్షియల్ గా భారీ లాభాలు వస్తున్నాయి.
టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డులివే
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల జాబితా ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
1. బిసిసిఐ (BCCI) : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ మొత్తం సంపద 2.2 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది రూ. 20,840 కోట్లు. ఐపీఎల్, కమర్షియల్ పోర్ట్‌ఫోలియోల ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం వస్తోంది.
2. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) : సుమారు 79 మిలియన్ డాలర్ల (రూ. 674 కోట్లు) సంపదతో ఆస్ట్రేలియా క్రికెట్ రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్, బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నర్‌షిప్‌లు, బిగ్ బాష్ లీగ్ ద్వారా వీరికి ఆదాయం వస్తోంది.
3. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) : క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ వద్ద సుమారు 59 మిలియన్ డాలర్ల (రూ. 503 కోట్లు) ఆస్తి ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్, ది హండ్రెడ్ టోర్నీ, దేశవాళీ క్రికెట్ ద్వారా వీరు సంపాదిస్తున్నారు.
4. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) : మన దాయాదిదేశం పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వద్ద సుమారు 55 మిలియన్ డాలర్ల (రూ. 469 కోట్లు) సంపద ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ద్వారా వీరికి ఎక్కువ ఆదాయం వస్తోంది.
5. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) : సుమారు 51 మిలియన్ డాలర్ల (రూ. 469 కోట్లు) ఆస్తి బిసిబి వద్ద ఉంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ద్వారా వీరు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.
ఏ క్రికెట్ బోర్డు ఆదాయం ఎంత?
6. క్రికెట్ సౌతాఫ్రికా (CSA) : సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వద్ద సుమారు 47 మిలియన్ డాలర్ల (రూ. 401 కోట్లు) సంపద ఉంది.
7. జింబాబ్వే క్రికెట్ (ZC) : ఈ క్రికెట్ బోర్డ్ వద్ద సుమారు 38 మిలియన్ డాలర్ల (రూ. 324 కోట్లు) ఆస్తి ఉంది. శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ కంటే ఈ క్రికెట్ బోర్డ్ వద్ద ఎక్కువ సంపద ఉండటం విశేషం.
8. శ్రీలంక క్రికెట్ (SL) : సుమారు 20 మిలియన్ డాలర్ల (రూ. 171 కోట్లు) సంపద శ్రీలంక క్రికెట్ బోర్డ్ వద్ద ఉంది. లంక ప్రీమియర్ లీగ్, అంతర్జాతీయ క్రికెట్ ద్వారా వీరికి ఆదాయం వస్తోంది.
9. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) : సుమారు 15 మిలియన్ డాలర్ల (రూ. 128 కోట్లు) ఆస్తిపాస్తులు వెస్టిండిస్ బోర్డ్ వద్ద ఉన్నాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఈ బోర్డ్ అధిక ఆదాయం పొందుతోంది.
10. న్యూజిలాండ్ క్రికెట్ (NZC) : ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్న బోర్డు న్యూజిలాండ్. దీనికి కేవలం 9 మిలియన్ డాలర్ల (రూ. 77 కోట్లు) సంపద మాత్రమే ఉంది.

