MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్‌లో టాప్ 10 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు ఇవే

Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్‌లో టాప్ 10 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు ఇవే

Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగంగా ట్రిపుల్ సెంచరీలు సాధించిన టాప్ 10 ఆటగాళ్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 01 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీలు బాదిన 10 మంది ఆటగాళ్లు
Image Credit : x/BCCI

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీలు బాదిన 10 మంది ఆటగాళ్లు

Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించడం అంటే ఆ ప్లేయర్ అసాధారణమైన ఆటతీరు, అసాధ్యమైన సహనం కలిగి ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే కొందరు ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్‌తో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించారు. దుమ్మురేపే ఆటతో సెంచరీల మోత మోగించారు. క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీలు కొట్టిన టాప్ 10 ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా? ఆ వివరాలు గమనిస్తే..

1. వీరేంద్ర సెహ్వాగ్ – 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 2007-08లో చెన్నైలో దక్షిణాఫ్రికా పై టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో 304 బంతుల్లో 319 పరుగులు చేశాడు. సెహ్వాగ్ తన ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 104.93 ఉండడం విశేషం.

25
2. హ్యారీ బ్రూక్ – 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
Image Credit : ANI

2. హ్యారీ బ్రూక్ – 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ 2024లో పాకిస్తాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 322 బంతుల్లో 317 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. 98.45 స్ట్రైక్ రేట్‌తో తన ఆటను కొనసాగించాడు.

3. మాథ్యూ హెడెన్ – 362 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ హెడెన్ 2003-04లో జింబాబ్వేపై పర్థ్ టెస్ట్‌లో 362 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో అతను 380 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 38 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ టెస్ట్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది.

Related Articles

Related image1
India vs Pakistan: ఆసియా కప్ 2025 బిగ్ అప్డేట్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
Related image2
Virender Sehwag: 39 ఫోర్లు, 6 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో పాకిస్తాన్ ను చితక్కొట్టిన భారత ప్లేయర్
35
4. వీరేంద్ర సెహ్వాగ్ – 364 బంతుల్లో
Image Credit : Getty

4. వీరేంద్ర సెహ్వాగ్ – 364 బంతుల్లో

మరోసారి సెహ్వాగ్ తనదైన దూకుడు ఆటతో మరో ట్రిపులు సెంచరీ బాదాడు. 2003-04లో పాకిస్తాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో 364 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 309 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 82.40గా ఉంది.

5. కరుణ్ నాయర్ – 381 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

భారత ఆటగాడు కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లాండ్‌పై చెన్నై టెస్ట్‌లో 381 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 381 బంతుల్లోనే 303 పరుగులు చేసి, తన తొలి సెంచరీని ట్రిపులు సెంచరీగా మార్చిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 32 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు.

45
6. డేవిడ్ వార్నర్ – 389 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
Image Credit : Google

6. డేవిడ్ వార్నర్ – 389 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 2019లో పాకిస్తాన్‌పై అడిలైడ్ టెస్ట్‌లో 389 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 335 పరుగులు చేశాడు. వార్నర్ ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, ఒక్క సిక్సర్ బాదాడు.

7. క్రిస్ గేల్ – 393 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

వెస్టిండీస్ పవర్‌హౌస్ క్రిస్ గేల్ 2010లో శ్రీలంకపై గాలేలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 393 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 333 పరుగుల తన ఇన్నింగ్స్ లో 34 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు.

55
8. బ్రయాన్ లారా – 404 బంతుల్లో 400 పరుగులు
Image Credit : Getty

8. బ్రయాన్ లారా – 404 బంతుల్లో 400 పరుగులు

వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా 2004లో ఇంగ్లాండ్‌పై 404 బంతులు ఆడి టెస్టుల్లో అత్యధిక స్కోర్ ను సాధించాడు. తన ట్రిపుల్ సెంచరీని తర్వాత 400 పరుగులకు చేర్చాడు. లారా ఇన్నింగ్స్‌లో 43 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

9. లారెన్స్ రో – 430 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

1974లో వెస్టిండీస్ ఆటగాడు లారెన్స్ రో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌పై 430 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 302 పరుగులు చేశాడు. 36 ఫోర్లు, ఒక్క సిక్సర్ బాదాడు.

10. ఇంజమామ్ ఉల్ హక్ – 436 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ 2002లో న్యూజిలాండ్‌పై లాహోర్ టెస్ట్‌లో 436 బంతుల్లో 329 పరుగులు చేశాడు. ఇందులో 38 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అతను ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ ప్లేయర్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. టీ20 వరల్డ్ కప్‌లో అసలేం జరుగుతోంది?
Recommended image2
PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్
Recommended image3
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Related Stories
Recommended image1
India vs Pakistan: ఆసియా కప్ 2025 బిగ్ అప్డేట్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
Recommended image2
Virender Sehwag: 39 ఫోర్లు, 6 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో పాకిస్తాన్ ను చితక్కొట్టిన భారత ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved