Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 10 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Top 10 Batters in Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం ఘనంగా ప్రారంభం అయింది. అయితే, ఈ ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరో తెలుసా?

1. క్రిస్ గేల్
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్. అతను 17 మ్యాచ్ లలో 52.73 సగటుతో 791 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
2. మహేల జయవర్ధనే
22 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 41 సగటుతో 742 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
3. శిఖర్ ధావన్
ఛాంపియన్స్ ట్రోఫీ లో 10 మ్యాచ్ లను ఆడిన శిఖర్ ధావన్ 77.88 సగటుతో 701 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
4. కుమార్ సంగక్కర
22 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 37.94 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
5. సౌరవ్ గంగూలీ
11 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 73.88 సగటుతో 665 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
6. జాక్వెస్ కల్లిస్
17 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 653 పరుగులు చేశాడు. 46.64 సగటుతో సాగిన అతని ఆటలో 1 సెంచరీ, 3 హాఫ్ సంచరీలు ఉన్నాయి.
Image Credit: Twitter/Sarang Bhalerao
7. రాహుల్ ద్రవిడ్
ఛాంపియన్స్ ట్రోఫీలో 19 మ్యాచ్ లలో 48.23 సగటుతో 627 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
8. రికీ పాంటింగ్
18 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 39.53 సగటుతో 593 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.
Image credit: Delhi Capitals
9. శివనారాయణ్ చంద్రపాల్
16 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 53.36 సగటుతో 587 పరుగులు చేశాడు. ఇందులో ఐదు 50లు ఉన్నాయి.
10. సనత్ జయసూర్య
శ్రీలంక మాజీ స్టార్ సనత్ జయసూర్య 20 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లలో 88 స్ట్రైక్ రేట్‌తో 536 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.