- Home
- Sports
- Cricket
- టీ20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ .. హాస్పిటల్ పాలైన హైదరబాదీ క్రికెటర్, ఇతడి స్థానంలో ఆడేదెవరు?
టీ20 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ .. హాస్పిటల్ పాలైన హైదరబాదీ క్రికెటర్, ఇతడి స్థానంలో ఆడేదెవరు?
ICC T20 World Cup 2026 : స్వదేశంలో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కు హైదరాబాద్ డాషింగ్ క్రికెటర్ దూరమవుతున్నారా..? అంటే క్రీడావర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరు..? అతడికి ఏమయ్యింది?

టీ20 వరల్డ్ కప్ కు ముందు బిగ్ న్యూస్..
ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్టర్లు టీమ్ ఇండియా జట్టును ప్రకటించారు… మొత్తం 15 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు టైటిల్ నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఒక పెద్ద వార్త బయటకొచ్చింది.
ఆసుపత్రిలో చేరిన హైదరబాదీ రన్ మెషిన్
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యువ హైదరబాదీ ఆటగాడు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరాడు. ఆ రన్ మెషిన్ మరెవరో కాదు… మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ తిలక్ వర్మ. పలు రిపోర్టుల ప్రకారం… అతడు కడుపులో సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో అతను నెల నుండి రెండునెలలు జట్టుకు దూరం కావచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
తిలక్ వర్మ జట్టుకు దూరమైన ప్రత్యామ్నాయాలివే..
ఆసియా కప్ 2025లో అద్భుతంగా రాణించిన తిలక్‌కు రాజ్‌కోట్‌లో కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్ళినట్లు సమాచారం. వైద్య పరీక్షల్లో అతడికి టెస్టిక్యులర్ టార్షన్ అని తేలింది. వైద్యులు అతడికి సర్జరీ చేయాలని సూచించారు. కుటుంబసభ్యులు, బిసిసిఐ అనుమతితో తిలక్ కు ఇటీవలే సర్జరీ చేశారని… ఇప్పుడు బాగానే ఉన్నాడని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. సర్జరీ కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
తిలక్ వర్మ ఐసిసి టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యాడు… ఇప్పుడు సర్జరీ కారణంగా అతడు ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభం అవడానికి ఇంకా నెలరోజుల కంటే తక్కువ సమయంలో ఉంది… ఆలోపు తిలక్ కోలుకోవడం కష్టమే. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు..? ఎవరికి అవకాశం దక్కుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.
రుతురాజ్ గైక్వాడ్
తిలక్ వర్మ స్థానంలో టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాలున్న ఆటగాళ్ల జాబితాలో మొదటి పేరు రుతురాజ్ గైక్వాడ్ ది. అతని ఇటీవలి ఫామ్ అద్భుతంగా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ శతకం బాదాడు. అతని ఫామ్ టీమ్ ఇండియాకు ఉపయోగపడుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఆడగల సత్తా ఉంది. టీ20ల్లోనూ సెంచరీ చేశాడు.
యశస్వి జైస్వాల్
ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ పేరు కూడా ఉంది. తిలక్ వర్మ స్థానంలో అతనికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ సెలక్టర్లు ఆలోచించవచ్చు. అయితే యశస్వి ఓపెనర్‌గా ఆడతాడు. అతను వస్తే సంజూ శాంసన్ మిడిల్ ఆర్డర్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అభిషేక్ శర్మతో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయొచ్చు. యశస్వి కూడా టీ20ల్లో సెంచరీ చేశాడు. అతని ఫామ్ అద్భుతంగా ఉంది.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ పేరు విని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. వన్డేల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్న అయ్యర్, టీ20ల్లోనూ రాణించగలడు. ఐపీఎల్‌లో ఇదే స్థానంలో బ్యాటింగ్ చేసి అద్భుతంగా ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ బాగుంటుంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుంది.

