ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
Champions Trophy 2025: భారత లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2013 లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2002లో భారత్, శ్రీలంకలు ట్రోఫీని సమంగా పంచుకున్నాయి. ఇప్పుడు 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని భారత్ చూస్తోంది.
Champions Trophy 2025 : 2013 తర్వాత భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు. అంతకుముందు ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు ఎలాగైనా 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, ఈ మెగా టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత టాప్-5 బౌలర్ల వివరాలు గమనిస్తే...
రవీంద్ర జడేజా
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిలిచాడు. 2013, 2017లో జరిగిన టోర్నీల్లో అతను టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ఈ సమయంలో జడేజా 10 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.
జహీర్ ఖాన్
ఈ జాబితాలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. జహీర్ 2000, 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్.
సచిన్ టెండూల్కర్
ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇది మీకు షాకింగ్ అనిపించినా ఇదే నిజం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు. 1998-2009 మధ్య 16 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీశాడు.
హర్భజన్ సింగ్
ఈ జాబితాలో భారత మాజీ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 2002-2009 మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు.
ఇషాంత్ శర్మ
ఈ జాబితాలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ టాప్-5లో ఉన్నాడు. ఇషాంత్ శర్మ 2009 నుంచి 2013 మధ్య ఆడిన 7 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.