MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Team India Captain : సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఔట్... టీమిండియా కెప్టెన్ ఇతడే..?

Team India Captain : సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఔట్... టీమిండియా కెప్టెన్ ఇతడే..?

Team India Captain :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొందరు భారత స్టార్ ప్లేయర్లు నిరాశపర్చారు. ఇదే సమయంలో అనామక ఆటగాళ్లు కొందరు అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలో ఐపిఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగా భారత జట్టును ఎంపిక చేస్తే..?  

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 03 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక..
Image Credit : Getty

ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక..

Team India Captain : పాత రికార్డులు, సీనియారిటీ లాంటివి పూర్తిగా పక్కనపెట్టి కేవలం ఈసారి ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే లెక్కలోకి తీసుకుని భారత టీ20 జట్టును ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది..? ఈ జట్టులో చాలామంది స్టార్ ప్లేయర్లకు చోటే ఉండదు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప పేరు, సాధించిన రికార్డులు, పొందిన అవార్డులు... ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపికచేసే భారత జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుంది..? ఎవరికి జట్టులో చోటుండదు..? ఇంతకూ టీం కెప్టెన్ గా ఎవరికి అవకాశం దక్కుతుంది..? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐపిఎల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా టీమిండియా కెప్టెన్ ఇతడే..?
Image Credit : Twitter/RCB

ఐపిఎల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా టీమిండియా కెప్టెన్ ఇతడే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకప్పుడు ఫెయిల్యూర్ టీం అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ దశాబ్దానికి పైగా ఒక్క ట్రోపీని కూడా గెలవలేకపోయింది. కానీ రజత్ పాటిదార్ ఇలా ఆర్సిబి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి అలా ట్రోఫీ కలను నిజం చేశాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అతడి కెప్టెన్సీలోనే ఆర్సిబి ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఈ ఐపిఎల్ సీజన్లో కూడా ఆర్సిబి జట్టును ముందుండి నడిపించాడు పాటిదార్. అందుకే ఐపిఎల్ 2026 ఫెర్ఫార్మెన్స్ ఆదారంగా ఇండియన్ టీ20 టీమ్ ను సెలెక్ట్ చేస్తే దీనికి రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తాడు.

Related Articles

Related image1
IPL Longest Sixes : వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా..!
Related image2
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
35
వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో చోటు ఖాయం..
Image Credit : BCCI

వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో చోటు ఖాయం..

అయితే ఐపిఎల్ ప్రదర్శన ఆదారంగా భారత టీ20 టీమ్ ని ఎంపికచేస్తే... ఓపెనర్ గా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కు చోటు దక్కదు. ఈ సీజన్లో సిఎస్కే తరపున రెండు సెంచరీలు బాదినప్పటికీ అతడికంటే స్ట్రాంగ్ ఓపెనర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. 

ఈ సీజన్‌లో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు వైభవ్... ఇతడు 72 సిక్సర్లతో దుమ్మురేపాడు. కాబట్టి ఇతడి స్థానంలో మరొకరిని ఊహించుకోలేం. అలాగే ఈ సీజన్‌లో 204+ స్ట్రైక్ రేట్‌తో 563 పరుగులు చేసిన అభిషేక్ శర్మను కూడా ఓపెనర్ గా పక్కనబెట్టలేం. కాబట్టి సంజూ శాంసన్ కు ఓపెనర్ గా అవకాశం లేనట్లే.

ఇక మూడో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ వస్తాడు. అతను 182.42 స్ట్రైక్ రేట్‌తో 602 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్ ఆడతాడు. అతను ఈ సీజన్‌లో 193కి పైగా స్ట్రైక్ రేట్‌తో 501 పరుగులు, 42 సిక్సర్లు కొట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో పంజాబ్ తరఫున అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్ (498 పరుగులు) ఉంటాడు. ఫినిషర్‌గా రింకూ సింగ్ (295) ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.

45
బుమ్రా ఔట్... నితీష్ కుమార్ రెడ్డి ఇన్
Image Credit : X/BCCI

బుమ్రా ఔట్... నితీష్ కుమార్ రెడ్డి ఇన్

ఈ సీజన్‌లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా (206 పరుగులు, 4 వికెట్లు) స్థానంలో పేస్ ఆల్-రౌండర్‌గా హైదరాబాద్ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి (302 పరుగులు, 8 వికెట్లు) జట్టులోకి వస్తాడు. స్పిన్ ఆల్-రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ స్థానంలో కృనాల్ పాండ్యా (226 పరుగులు, 14 వికెట్లు) జట్టులో స్థానం సంపాదిస్తాడు. 

ఐపిఎల్ పెర్మార్మెన్స్ ఆధారిత ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్ విభాగానికి వెటరన్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తాడు. ఆర్సిబి తరపున 28 వికెట్లతో ఈ సీజన్‌లో అత్యుత్తమ భారత పేసర్‌గా భువీ నిలిచాడు. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ (19 వికెట్లు) భువీకి బౌలింగ్ పార్ట్‌నర్‌గా ఉంటాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయడానికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (11 వికెట్లు) జట్టులో ఉంటాడు.

బ్యాకప్ వికెట్ కీపర్‌గా రాజస్థాన్ తరఫున రాణించిన ధ్రువ్ జురెల్ (515 పరుగులు) 12 మంది సభ్యుల జట్టులో సంజూ స్థానంలోకి వస్తాడు.. బ్యాకప్ ఓపెనర్‌గా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (732 పరుగులు), బ్యాకప్ స్పిన్ ఆల్-రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలింగ్ బ్యాకప్‌గా చెన్నై తరఫున మెరిసిన అన్షుల్ కంబోజ్ (21 వికెట్లు) 15 మంది సభ్యుల జట్టులో ఉంటారు. 13 మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీయడంతో స్టార్ బౌలర్ బుమ్రాకు కనీసం బ్యాకప్ పేసర్‌గా కూడా చోటు దక్కదు.

55
ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా 15 మంది సభ్యుల భారత జట్టు
Image Credit : Getty

ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా 15 మంది సభ్యుల భారత జట్టు

రజత్ పాటిదార్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్, అన్షుల్ కంబోజ్, వరుణ్ చక్రవర్తి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
IPL Longest Sixes : వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా..!
Recommended image2
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved