- Home
- Sports
- Cricket
- T20 worldcup 2021: రోహిత్, కోహ్లీ కాదు, టీమిండియాలో అతనే అసలైన మ్యాచ్ విన్నర్... డేల్ స్టెయిన్ కామెంట్...
T20 worldcup 2021: రోహిత్, కోహ్లీ కాదు, టీమిండియాలో అతనే అసలైన మ్యాచ్ విన్నర్... డేల్ స్టెయిన్ కామెంట్...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతున్న టీమిండియా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది...

T20 వరల్డ్‌కప్ 2021లో భాగంగా అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏయే ప్లేయర్లతో బరిలో దిగుతుందనేది ఆసక్తికరంగానూ మారింది...
పాక్‌తో మ్యాచ్‌కి భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్... కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా... ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్పిత్ బుమ్రా, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తి ఉంటారని అంచనా వేశాడు వీవీఎస్...
అయితే డేల్ స్టెయిన్ మాత్రం, వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేసిన జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాడు. ఫామ్‌లో లేని భువీ స్థానంలో మహ్మద్ షమీకి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు స్టెయిన్...
‘ప్రస్తుతం మహ్మద్ షమీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదీకాకుండా భువనేశ్వర్ కుమార్ సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నాడు, భారీగా పరుగులు కూడా ఇస్తున్నాడు. కాబట్టి షమీకి తుదిజట్టులో చోటు ఇవ్వడం తప్పనిసరి...
హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోయినా, అతనికి తుదిజట్టులో చోటు ఉండాల్సిందే. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలానే హార్ధిక్ పాండ్యా గేమ్ ఛేంజర్... అలాంటి ప్లేయర్, తుది జట్టులో ఉండడం చాలా అవసరం...
బౌలింగ్ చేయకపోయినా తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా, సామర్థ్యం హార్ధిక్ పాండ్యాలో ఉన్నాయి. ఏ జట్టుకైనా అలాంటి ప్లేయర్ అందుబాటులో ఉండడం అదృష్టమే...
అతను ఇప్పుడు పెద్దగా ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ అతనో అద్భుతమైన ప్లేయర్. ఆ విషయం మిగిలిన అన్ని జట్లకీ కూడా తెలుసు. కాబట్టి పాండ్యా జట్టులో ఉంటే, ప్రత్యర్థుల్లో కూడా ఓ విధమైన భయాన్ని పుట్టించే అవకాశం ఉంటుంది...
చూస్తూ ఉండగానే ప్రత్యర్థి చేతుల్లోనుంచి గేమ్‌ను లాగేసుకోగలడు హార్ధిక్ పాండ్యా... అలాంటి ప్లేయర్‌ను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతారని మాత్రం నేను అనుకోవడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్...
ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్ పెట్టి మరీ...
ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...
టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...