MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్

India T20 Squad: సూర్య ఈజ్ బ్యాక్.. ఆర్‌సీబీ ఛాంపియన్ కెప్టెన్‌కు వైస్ కెప్టెన్ పదవి.. మైండ్ బ్లోయింగ్ ఇండియన్ టీమ్

India T20 Squad: భారత్ వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త టీ20 టీమ్‌ను ప్రకటించారు. సూర్యకుమార్ కెప్టెన్‌గా, పాటిదార్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ పూర్తి జట్టు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్‌సీబీ ముగ్గురు ప్లేయర్లతో కొత్త టీమ్ ఇండియా టీ20 జట్టు
Image Credit : stockPhoto

ఆర్‌సీబీ ముగ్గురు ప్లేయర్లతో కొత్త టీమ్ ఇండియా టీ20 జట్టు

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తీవ్ర విమర్శల పాలవుతోంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 సెలెక్షన్, ఆటగాళ్ల ఫామ్‌పై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుతోనే ఆడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, భారత మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత జట్టులో లేని ఆటగాళ్లతో ఒక ప్రత్యామ్నాయ బలమైన భారత టీ20 జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఛాంపియన్ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కెప్టెన్‌గా సూర్యకుమార్ రీఎంట్రీ
Image Credit : Getty

కెప్టెన్‌గా సూర్యకుమార్ రీఎంట్రీ

ఆకాశ్ చోప్రా ప్రకటించిన ఈ కొత్త జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 2026లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన సూర్యను సెలెక్టర్లు ఆ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించి, ఏకంగా జట్టు నుంచే డ్రాప్ చేశారు. అయితే భారత్ మళ్లీ పుంజుకోవాలంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడి అవసరం ఎంతైనా ఉందని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. అందుకే తన టీమ్ లో సూర్యను బాస్ చేసేశారు.

36
వైస్ కెప్టెన్‌గా ఆర్‌సీబీ హీరో రజత్ పాటిదార్
Image Credit : X/RCBTweets

వైస్ కెప్టెన్‌గా ఆర్‌సీబీ హీరో రజత్ పాటిదార్

ఐపీఎల్‌లో వరుసగా రెండోసారి ఆర్‌సీబీకి ట్రోఫీ అందించి ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటిదార్‌కు ఆకాశ్ చోప్రా జట్టులో అద్భుత అవకాశం దక్కింది. పాటిదార్‌ను టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తున్న తరుణంలో, చోప్రా ఏకంగా అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పాటిదార్‌తో పాటు ఈ టీమ్‌లో ఆర్‌సీబీకి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. ఆల్‌రౌండర్ కోటాలో క్రునాల్ పాండ్యా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లను కూడా చోప్రా లైన్‌లోకి తెచ్చారు.

46
టాప్ ఆర్డర్ మార్పులు.. సంజూకు ఛాన్స్
Image Credit : X/BCCI

టాప్ ఆర్డర్ మార్పులు.. సంజూకు ఛాన్స్

ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లకు చోటు దక్కింది. ప్రస్తుత ఇంగ్లాండ్ టూర్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమవడంతో సంజూను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. కానీ చోప్రా అతడికి రెండో లీడర్‌గా తన జట్టులో చోటు ఇచ్చారు. ఇక 2024 తర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడని యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు. మిడిలార్డర్‌ను బలోపేతం చేయడానికి ధ్రువ్ జురెల్, నమన్ ధీర్‌లను ఎంపిక చేశారు. జురెల్ వన్డేల్లో ఆడుతున్నా, టీ20 స్క్వాడ్‌లో లేకపోవడంతో చోప్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్‌లను ఎంపిక చేసి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లోటును భర్తీ చేశారు.

56
బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు
Image Credit : RCB

బౌలింగ్ విభాగంలో భారీ మార్పులు

ప్రస్తుత పర్యటనలో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను చోప్రా తన జట్టులోకి తీసుకున్నారు. అలాగే పేస్ బౌలింగ్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్‌లకు అప్పగించారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణాల వల్ల సిరాజ్‌ను ఇంగ్లాండ్ పర్యటన నుంచి సెలెక్టర్లు తప్పించగా, చోప్రా మాత్రం తన ప్లాన్స్‌లో సిరాజ్‌కు మెయిన్ ప్లేస్ ఇచ్చారు.

66
సిరీస్ క్లీన్‌స్వీప్.. మార్పులు సూచించిన ఆకాశ్ చోప్రా
Image Credit : our own

సిరీస్ క్లీన్‌స్వీప్.. మార్పులు సూచించిన ఆకాశ్ చోప్రా

ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోరంగా సిరీస్ ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయింది. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఆ తర్వాతి మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ గెలిచి 3-0తో ముందంజలో ఉంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శనివారం సౌతాంప్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఐపీఎల్ ఫామ్‌ను కాదని సెలెక్టర్లు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ఎత్తిచూపుతూ ఆకాశ్ చోప్రా ఈ ప్రత్యామ్నాయ జట్టును సోషల్ మీడియా లో పంచుకున్నారు.

ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన పರ್ಯాయ టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, యశಸ್వి జైస్వాల్, రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నమన్ ధీర్, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిರಾಜ್, యుజ్వేంద్ర చాహల్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Team India: ఇంగ్లాండ్ లో టీమిండియా అట్టర్ ప్లాప్.. భారత్ ఓటమికి మెయిన్ రీజన్స్ ఇవే
Recommended image2
FIFA Golden Boot: ఫిఫా సెమీఫైనల్స్ రేసు షురూ.. గోల్డెన్ బూట్ కోసం గట్టి ఫైట్.. రికార్డుల వేటలో స్టార్ ప్లేయర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved