భారత్ కు బిగ్ షాకిచ్చిన శ్రీలంక
India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 110 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
India , Cricket,
India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు 2-0 తేడాతో కోల్పోయింది. మూడో మ్యాచ్ లో శ్రీలంక బౌలింగ్ దెబ్బకు టీమిండియా ప్లేయర్లలో ఒక్కరు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది.
India vs Sri Lankam, Virat,
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో బుధవారం (ఆగస్టు 7) జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో విజయం సాధించి లంక సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. కుసాల్ మెండిస్ 59 పరుగులు, పాతుమ్ నిస్సంక 45 పరుగులు చేశారు. అలాగే, కమిందు మెండిస్ 23 పరుగులు చేశాడు. భారత్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియాలో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ 35, వాషింగ్టన్ సుందర్ 30, విరాట్ కోహ్లీ 20, రియాన్ పరాగ్ 15 పరుగులు చేశారు.
మిగతా భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రీలంక తరఫున స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సేలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.