MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • వైభ‌వ్ విధ్వంసం టీమిండియాకు తిరుగులేని విజ‌యం.. శ్రీలంక‌ను చిత్తు చేసిన భార‌త్-ఏ

వైభ‌వ్ విధ్వంసం టీమిండియాకు తిరుగులేని విజ‌యం.. శ్రీలంక‌ను చిత్తు చేసిన భార‌త్-ఏ

Sri Lanka A vs India A: శ్రీలంకలో జరిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. దంబుల్లాలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంక-ఏపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 21 2026, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. లంక బౌలర్లకు చుక్కలు
Image Credit : BCCI/X

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. లంక బౌలర్లకు చుక్కలు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏకు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన అతడు శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయినా, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అంతేకాదు, కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిలక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. మిడిల్‌ ఓవర్లలో భారత్‌కు బలం
Image Credit : BCCI/X

తిలక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. మిడిల్‌ ఓవర్లలో భారత్‌కు బలం

వైభవ్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను స్థిరపరిచే బాధ్యతను కెప్టెన్ తిలక్ వర్మ భుజాన వేసుకున్నాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ 67 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. అతడికి రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులతో సహకరించగా, ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు జోడించాడు. చివర్లో కుమార్ కుశాగ్ర 36, విప్రాజ్ నిగమ్ 27 పరుగులతో స్కోరు వేగంగా పెంచారు.

35
అనుకుల్ రాయ్ ఫినిషింగ్ టచ్.. 377 పరుగుల భారీ స్కోరు
Image Credit : BCCI/X

అనుకుల్ రాయ్ ఫినిషింగ్ టచ్.. 377 పరుగుల భారీ స్కోరు

చివరి ఓవర్లలో అనుకుల్ రాయ్ చెలరేగి ఆడాడు. కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో భారత్-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ లక్ష్యం శ్రీలంకకు చాలా కఠినంగా మారింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఆరంభం నుంచే ఒత్తిడి పెరిగింది.

India A beat Sri Lanka A by 66 runs to clinch the #TriNationSeries 2026 title 🏆

A brilliant campaign comes to a perfect end 👏💙

Scorecard ▶️ https://t.co/CnmyVyoyjy#SLAvINDA pic.twitter.com/hz1m4voody

— BCCI (@BCCI) June 21, 2026

45
యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక
Image Credit : BCCI/X

యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన శ్రీలంక-ఏకు భారత బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. యశ్ ఠాకూర్ అద్భుత బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. అతడు మూడు కీలక వికెట్లు తీసి లంకను కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ కూడా మూడు వికెట్లు సాధించి ప్రత్యర్థి మధ్యవరుసను దెబ్బతీశాడు. అనుకుల్ రాయ్ రెండు వికెట్లు పడగొట్టగా, అశోక్ శర్మ, తిలక్ వర్మ చెరో వికెట్ సాధించారు.

55
66 ప‌రుగుల తేడాతో విజ‌యం
Image Credit : BCCI/X

66 ప‌రుగుల తేడాతో విజ‌యం

శ్రీలంక తరఫున సదీర సమరవిక్రమ 52 పరుగులు, వనుజ సహన్ 62 పరుగులతో పోరాడినా మ్యాచ్‌ను మలుపుతిప్పలేకపోయారు. విజయకాంత్ వియాస్కాంత్ 39, సహన్ అరచ్చిగే 38 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శ్రీలంక-ఏ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. 66 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్-ఏ ట్రై-నేషన్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత ఆశలు పెంచేలా చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Recommended image3
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Related Stories
Recommended image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved