MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • SRH vs CSK : సిఎస్కే తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ డీల్.. రూ.13 కోట్ల ప్లేయర్ ఔట్, టాప్ బౌలర్లు ఇన్

SRH vs CSK : సిఎస్కే తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ డీల్.. రూ.13 కోట్ల ప్లేయర్ ఔట్, టాప్ బౌలర్లు ఇన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా సిద్దమవుతోంది. మినీ వేలానికి ముందే కీలక ఆటగాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ తో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఏఏ ప్లేయర్స్ మార్పిడి జరిగిందో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 05 2026, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సిఎస్కేతో సన్ రైజర్స్ ట్రేడ్ డీల్
Image Credit : ANI

సిఎస్కేతో సన్ రైజర్స్ ట్రేడ్ డీల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. మినీ వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల ట్రేడింగ్‌తో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), తమిళ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు జట్లు ఏకంగా నలుగురు ఆటగాళ్లను పరస్పరం మార్చుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.13 కోట్ల ఆటగాడు.. ఇప్పుడు రూ.6 కోట్లకే!
Image Credit : Getty

రూ.13 కోట్ల ఆటగాడు.. ఇప్పుడు రూ.6 కోట్లకే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న ఆటగాళ్లలో లియామ్ లివింగ్‌స్టన్ ప్రధానమైనవాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. భారీ షాట్లు ఆడటంలో పేరున్న లివింగ్‌స్టన్‌ను గత వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది.

అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు… అందిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేదు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడిన అతడు పెద్దగా పరుగులు సాధించలేదు. దీంతో వచ్చే సీజన్ కోసం అతడిని కొనసాగించకూడదని హైదరాబాద్ నిర్ణయించింది. ట్రేడ్‌లో భాగంగా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కేవలం రూ.6 కోట్ల ధరకు తీసుకుంది. అంటే గతంలో చెల్లించిన ధరతో పోలిస్తే లివింగ్‌స్టన్ ఒప్పంద విలువ రూ.7 కోట్లు తగ్గింది.

హైదరాబాద్ టీంకు మరో ఆటగాడు దూరం..

హైదరాబాద్ జట్టు వదులుకున్న మరో ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయకముందే అతడిని సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు ట్రేడ్‌లో భాగంగా ఎడ్వర్డ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. అతడి ప్రస్తుత ఒప్పంద విలువ రూ.3 కోట్లుగానే కొనసాగనుంది. యువ ఆల్‌రౌండర్‌కు చెన్నై జట్టులో కొత్త అవకాశం లభించనుంది.

34
సిఎస్కే నుండి హైదరాబాద్ టీంలో చేరింది వీళ్లే...
Image Credit : Getty

సిఎస్కే నుండి హైదరాబాద్ టీంలో చేరింది వీళ్లే...

ఇక చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆటగాళ్లలో భారత పేసర్ ఖలీల్ అహ్మద్ ఒకరు. ఖలీల్ గతంలో 2018 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఇతర జట్ల తరఫున ఆడిన అతడు ఇప్పుడు మళ్లీ తన పాత ఫ్రాంచైజీలోకి వస్తున్నాడు.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఖలీల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి జట్టు బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లోనూ చెన్నై తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, గాయం కారణంగా మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు రూ.4.8 కోట్ల ప్రస్తుత ధరతో హైదరాబాద్ జట్టులో చేరాడు.

సిఎస్కే నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన మరో ఆటగాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్. టీ20 క్రికెట్‌లో తన బౌలింగ్ వైవిధ్యాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎల్లిస్.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో మంచి అనుభవం కలిగి ఉన్నాడు. యార్కర్లు, స్లో బంతులు, ఇతర బౌలింగ్ వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు తీసుకోగా.. ఇప్పుడు అదే ధరకు హైదరాబాద్‌కు బదిలీ చేసింది.

🚨 News 🚨

@ChennaiIPL and @SunRisers have completed a four-player trade ahead of #TATAIPL 2027.

Liam Livingstone (INR 6 Crore, revised fee) and Jack Edwards (INR 3 Crore) move to #CSK, while Khaleel Ahmed (INR 4.8 Crore) and Nathan Ellis (INR 2 Crore) join #SRH.

Details ▶️ https://t.co/wC0HDKvRzJ

— IndianPremierLeague (@IPL) November 5, 2026

44
ఐపీఎల్ మినీ వేలం ఎప్పుడు?
Image Credit : X/@mufaddal_vohra

ఐపీఎల్ మినీ వేలం ఎప్పుడు?

ఈ నలుగురు ఆటగాళ్ల మార్పిడితో ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి జట్ల కూర్పుపై ఆసక్తి పెరిగింది. మరోవైపు ఐపిఎల్ జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువును నవంబర్ 17 వరకు పొడిగించింది బిసిసిఐ. దీంతో ఆ తేదీ లోపు మరిన్ని ట్రేడింగ్ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్లను మరింత పటిష్టం చేసుకోనున్నాయి. అప్పటివరకు ఆటగాళ్ల ట్రేడింగ్, రిటెన్షన్ నిర్ణయాలు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్.. ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా కొత్త టీమ్ ఇదే !
Recommended image2
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Recommended image3
IND vs NZ: న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. మనోడి దెబ్బకు కుప్పకూలిన కివీస్
Related Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్.. ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా కొత్త టీమ్ ఇదే !
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved