ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను అన్‌ఫాలో చేయడం పై శుభ్‌మన్ గిల్ రియాక్షన్ ఇదే..
Rohit Reaction To Gill Unfollowing: క్రమశిక్షణా చర్యలతో శుభ్‌మన్ గిల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమెరికా నుంచి తిరిగి ఇండియాకు పంపించింది. ఇక భారత్ కు చేరుకున్న వెంటనే గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మను అన్‌ఫాలో చేశాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
Shubman Gill, Rohit Sharma
Rohit Reaction To Gill Unfollowing: భారత జట్టులోని అద్భుతమైన ఆటగాళ్ళలో శుభ్‌మన్ గిల్ ఒకరు. కుడిచేతి వాటం కలిగిన ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ తనదైన స్టైల్లో సూపర్ బ్యాటింగ్ తో మంచి గుర్తింపు సాధించాడు. అయితే, కెప్టెన్ రోహిత్, మేనేజ్‌మెంట్ టీమ్‌తో కొన్ని సమస్యల కారణంగా అతన్ని తిరిగి ఇండియాకు పంపించారని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Rohit Sharma, Shubman Gill,
ఇదే క్రమంలో ఇండియాకు చేరుకున్న తర్వాత గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మను అన్‌ఫాలో చేశాడు. టీం ఇండియా స్క్వాడ్ నుంచి తొలగించిన కారణంగానే శుభ్‌మన్ ఇలా చేశాడనే ఊహాగానాలు చెలరేగాయి.
Rohit Sharma DRS
క్రికెట్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా రిజర్వు ప్లేయర్లుగా ఉన్న రింకూసింగ్ ఇంకా జట్టుతో అమెరికాలోనే ఉన్నాడు. కానీ, భారత జట్టు మేనేజ్మెంట్ గిల్ ను ఇండియాకు పంపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను అన్‌ఫాలో చేశాడనే వార్తల మధ్య శుభ్‌మన్ గిల్ స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఫోటోలో, భారత ఆటగాళ్లు ఒకరితో ఒకరు పోజులివ్వడం కనిపించింది. రోహిత్ నారింజ రంగు టీషర్ట్‌లో ఉండగా, గిల్ తెల్లటి షర్ట్‌లో ఉన్నాడు. అలాగే, రోహిత్ శర్మ తన కూతురును ఎత్తుకుని ఉన్న ఫోటో కూడా ఉంది. అందులో గిల్ కూడా ఉన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను అన్‌ఫాలో చేశాడనే వార్తల మధ్య ఈ ఫోటో సోషట్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు రోహిత్ తో ఎలాంటి విభేధాలు లేవనీ, హిట్ మ్యాన్ ను అన్ ఫాలో చేయలేదని వీటితో పేర్కొన్నాడు. తాను రోహిత్ శర్మ వెంటే ఉన్నాననీ, అతని నుంచి క్షమశిక్షణ కళను నేర్చుకుంటున్నానని పేర్కొన్నాడు.
కాగా, వరల్డ్ కప్ భారత జట్టు కోసం గిల్ ను రిజర్వు ప్లేయర్ గా ఎంపిక చేశారు. జట్టుతో పాటు అమెరికా వెళ్లాడు. కానీ, అతను జట్టుతో ఉండకుండా తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటంతోనే తిరిగి ఇండియాకు పంపించారని పలు రిపోర్టులు పేర్కొనడం సంచలనం రేపింది.