MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్

Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్

Cricket Records: : ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ 2026లో సౌదీ అరేబియాపై యూఏఈ మహిళల జట్టు కేవలం 5 బంతుల్లోనే చరిత్రాత్మక విజయం సాధించి రికార్డు సృష్టించింది. కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయిన ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి..

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jun 05 2026, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏంది సామీ ఇది! 5 బంతుల్లోనే మ్యాచ్ ఖతం
Image Credit : Gemini

ఏంది సామీ ఇది! 5 బంతుల్లోనే మ్యాచ్ ఖతం

క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ కొన్ని రికార్డులు చూస్తే మాత్రం అభిమానులు అస్సలు నమ్మలేరు. సరిగ్గా అలాంటి ఒక నమ్మలేని నిజం ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ 2026 (ACC Women's T20I Premier Cup 2026) టోర్నమెంట్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ జరిగింది.

ఇందులో యూఏఈ మహిళల జట్టు, సౌదీ అరేబియాకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రికెట్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన ఓటమి రుచిని సౌదీ అరేబియాకు చూపించింది. కేవలం ఐదే ఐదు బంతుల్లో మ్యాచ్‌ను ముగించి యూఏఈ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ స్కోర్‌కార్డ్ చూసి నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
27 పరుగులకే కుప్పకూలిన సౌదీ అరేబియా
Image Credit : X/EmiratesCricket

27 పరుగులకే కుప్పకూలిన సౌదీ అరేబియా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌదీ అరేబియా జట్టుకు యూఏఈ బౌలర్లు చుక్కలు చూపించారు. యూఏఈ బౌలర్ల ధాటికి సౌదీ అరేబియా టీమ్ 15.3 ఓవర్లలో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. టీమ్‌లోని బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరు దాటలేకపోయారు. 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. సౌదీ అరేబియా కెప్టెన్ మషాల్ వకాస్ చేసిన 9 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?
Related image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
36
కేవలం 5 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
Image Credit : X/EmiratesCricket

కేవలం 5 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్

సౌదీ అరేబియా నిర్దేశించిన 28 పరుగుల చిన్న లక్ష్యాన్ని చేధించడానికి యూఏఈ జట్టుకు అస్సలు టైం పట్టలేదు. మొదటి ఓవర్ ముగియక ముందే మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. సౌదీ అరేబియా బౌలర్ మహ్ నూర్ అమీర్ వేసిన మొదటి ఓవర్‌లోనే ఏకంగా 11 ఎక్స్‌ట్రాలు వచ్చాయి. ఇందులో 10 వైడ్‌లు, ఒక నో-బాల్ ఉన్నాయి.

దీంతో యూఏఈ పని చాలా ఈజీ అయిపోయింది. యూఏఈ కెప్టెన్ ఈషా ఓజా కేవలం 5 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో దుమ్మురేపింది. ఆమె 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 0.5 ఓవర్లలోనే జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించింది.

46
అత్యంత వేగవంతమైన రన్ ఛేజ్ రికార్డ్
Image Credit : X/EmiratesCricket

అత్యంత వేగవంతమైన రన్ ఛేజ్ రికార్డ్

మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో అత్యంత వేగంగా టార్గెట్‌ను ఛేజ్ చేసిన మ్యాచ్‌లలో ఒకటిగా ఇది రికార్డుకెక్కింది. గతంలో రవాండా జట్టు మాలీపై 7 పరుగుల టార్గెట్‌ను 4 బంతుల్లో ఛేజ్ చేసింది. అలాగే టాంజానియా జట్టు మాలీపై 12 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల్లో, థాయిలాండ్ జట్టు ఫిలిప్పీన్స్ పైన 10 పరుగుల టార్గెట్‌ను 4 బంతుల్లో పూర్తి చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో యూఏఈ కూడా చేరిపోయింది. సౌదీ అరేబియాపై 28 పరుగుల టార్గెట్‌ను కేవలం 5 బంతుల్లోనే ఫినిష్ చేసి యూఏఈ రికార్డ్ క్రియేట్ చేసింది.

ACC Women's Premier Cup 2026:
UAE begin their tournament campaign with a 10-wicket win over Saudi Arabia 🇦🇪👏
Scores in brief:
Saudi Arabia: 27 all out, 15.3 overs (Mashael Waqas 9; Heena Hotchandani 3-4, Suraksha Kotte 3-5, Esha Oza 3-9)
UAE: 30 for no loss in 0.5 overs (Esha… pic.twitter.com/KCzAP9FSl5

— UAE Cricket Official (@EmiratesCricket) June 3, 2026

56
గ్రూప్-బి లో టాప్‌లో యూఏఈ
Image Credit : X/EmiratesCricket

గ్రూప్-బి లో టాప్‌లో యూఏఈ

సౌదీ అరేబియాపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా యూఏఈ ఉమెన్స్ టీమ్ అస్సలు తగ్గలేదు. ఒమన్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించింది. యూఏఈ బౌలర్లు మళ్లీ రెచ్చిపోవడంతో ఒమన్ టీమ్ 20 ఓవర్లలో 64/9 స్కోరు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత యూఏఈ కేవలం 6.4 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ విజయాలతో, యూఏఈ జట్టు 4 పాయింట్లు, +10.525 నెట్ రన్ రేట్‌తో గ్రూప్-బి లో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది.

66
ఆసియా కప్ క్వాలిఫికేషన్ కోసం బిగ్ ఛాన్స్
Image Credit : X/EmiratesCricket

ఆసియా కప్ క్వాలిఫికేషన్ కోసం బిగ్ ఛాన్స్

అసోసియేట్ దేశాల క్రికెట్ టీమ్స్‌కు ఈ ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఉమెన్స్ ఆసియా కప్‌కు క్వాలిఫై అవ్వడానికి ఒక మెయిన్ రూట్ లాంటిది. ఈ టోర్నమెంట్‌లో టాప్ ఫోర్ ప్లేస్‌లో నిలిచే జట్లు (సెమీఫైనలిస్ట్‌లు) నేరుగా 2026 మహిళల టీ20 ఆసియా కప్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ టోర్నీలో గనుక ఈ టీమ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, ఆసియాలోనే బెస్ట్ ఇంటర్నేషనల్ టీమ్స్‌తో ఆడే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. ఇది వారి క్రికెట్ ఫ్యూచర్‌కు ఎంతగానో హెల్ప్ అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?
Recommended image2
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ టీమ్ లెజెండ్ సడన్ రిటైర్మెంట్.. అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
India T20 captain: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై బీసీసీఐ వేటు ! టీమిండియా కొత్త కెప్టెన్ ఇతనేనా?
Related Stories
Recommended image1
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved