MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ !

QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ !

QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కామ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను మీకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. మరి నకిలీ క్యూఆర్ కోడ్‌లను ఎలా గుర్తించాలి? మీ డబ్బును ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2026, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్యూఆర్ కోడ్ స్కామ్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Gemini

క్యూఆర్ కోడ్ స్కామ్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రస్తుత డిజిటల్ యుగంలో జేబులో పైసా లేకపోయినా చేతిలో ఫోన్ ఉంటే చాలు, టీకొట్టు నుండి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తున్నాం. అయితే, మనకు ఇంతగా అలవాటైన ఈ సౌకర్యమే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఇటీవల కాలంలో క్యూఆర్ కోడ్ స్కామ్ లేదా క్విషింగ్ అనే కొత్త రకం మోసం వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులను బురిడీ కొట్టించి, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడమే ఈ స్కామర్ల ప్రధాన లక్ష్యంగా మారింది.

26
క్యూఆర్ కోడ్ మోసం ఎలా జరుగుతుంది?
Image Credit : Getty

క్యూఆర్ కోడ్ మోసం ఎలా జరుగుతుంది?

క్యూఆర్ కోడ్ స్కామ్ లో సైబర్ నేరగాళ్లు అసలైన క్యూఆర్ కోడ్‌ల స్థానంలో తమ మాల్వేర్ ఉన్న కోడ్‌లను ఉంచుతారు. దీనినే క్విషింగ్ అని పిలుస్తారు. వినియోగదారులు పొరపాటున ఈ నకిలీ కోడ్‌లను స్కాన్ చేసినప్పుడు, వారు నేరుగా ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు చేరుకుంటారు. అక్కడ వారి బ్యాంక్ వివరాలు లేదా లాగిన్ ఐడీలు నమోదు చేయమని అడుగుతారు.

మరో పద్ధతిలో, మోసగాళ్లు ప్రముఖ కంపెనీల ప్రతినిధులమని నమ్మిస్తూ ఈమెయిల్స్ లేదా మెసేజ్‌లు పంపిస్తారు. అందులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని కోరుతారు. మీరు స్కాన్ చేయగానే మీ ఫోన్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీ పాస్‌వర్డ్‌లను దొంగిలించడం లేదా మీ ఫోన్‌ను హ్యాక్ చేసి వారి ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు.

Related Articles

Related image1
Property Buying Checklist : ఇల్లు కొంటున్నారా? ఈ 10 డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి!
Related image2
Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
36
దుకాణాల్లో జరిగే కోడ్ మార్పిడి మోసాలు
Image Credit : our own

దుకాణాల్లో జరిగే కోడ్ మార్పిడి మోసాలు

సాధారణంగా మనం కిరాణా షాపులు లేదా పెట్రోల్ బంకుల్లో క్యూఆర్ కోడ్‌లను చూస్తుంటాం. మోసగాళ్లు చాలా తెలివిగా వ్యాపారికి తెలియకుండా అసలు కోడ్ పైన తమ సొంత క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను అంటిస్తారు. వినియోగదారులు అది షాపు యజమాని కోడ్ అని నమ్మి స్కాన్ చేసి డబ్బులు పంపిస్తారు. కానీ, ఆ డబ్బు వ్యాపారికి కాకుండా నేరుగా మోసగాడి ఖాతాలోకి వెళ్తుంది. ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లలో వస్తువులు అమ్మేవారిని కూడా వీరు టార్గెట్ చేస్తున్నారు. "మీకు డబ్బులు పంపిస్తున్నాను, ఈ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ రిసీవ్ చేసుకోండి" అని నమ్మించి యూజర్ల ఖాతా నుండి డబ్బులు లాగేస్తున్నారు.

46
నకిలీ క్యూఆర్ కోడ్‌ను గుర్తించడం ఎలా?
Image Credit : our own

నకిలీ క్యూఆర్ కోడ్‌ను గుర్తించడం ఎలా?

మీరు స్కాన్ చేస్తున్న కోడ్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి ఇలా చేయండి..

  • వెబ్‌సైట్ లింక్ తనిఖీ చేయండి: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వచ్చే యూఆర్ఎల్ సురక్షితమైనదేనా అని చూడండి. అది https:// తో ప్రారంభం కావాలి.
  • వ్యక్తిగత వివరాలు అడిగితే జాగ్రత్త: ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్ మీ ఆధార్, బ్యాంక్ పిన్ లేదా వ్యక్తిగత వివరాలు అడుగుతుంటే వెంటనే దాన్ని నిలిపివేయండి.
  • డబ్బు తీసుకోవడానికి స్కాన్ అవసరం లేదు: క్యూఆర్ కోడ్ అనేది డబ్బు పంపడానికి మాత్రమే ఉపయోగిస్తారు, డబ్బు తీసుకోవడానికి కాదు. ఎవరైనా మీకు డబ్బు పంపడానికి కోడ్ స్కాన్ చేయమంటే అది పక్కా మోసం అని గుర్తుంచుకోండి.
  • తొందర పెట్టేవారిని నమ్మకండి: త్వరగా చేయండి, ఆఫర్ అయిపోతుంది అంటూ మిమ్మల్ని ఒత్తిడి చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి.
56
అపరిచితులతో సమాచారం వద్దు
Image Credit : Getty

అపరిచితులతో సమాచారం వద్దు

మీ యూపీఐ ఐడీలు లేదా బ్యాంక్ ఖాతా వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ముఖ్యంగా ఓఎల్ఎక్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తువులు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు. స్మార్ట్‌ఫోన్‌లలో మాల్వేర్ డౌన్‌లోడ్ అయ్యేలా కొన్ని కోడ్‌లను డిజైన్ చేస్తారు, కాబట్టి అనధికారిక సోర్స్‌ల నుండి వచ్చే కోడ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

66
మోసపోతే వెంటనే ఏం చేయాలి?
Image Credit : Asianet News

మోసపోతే వెంటనే ఏం చేయాలి?

ఒకవేళ మీరు పొరపాటున క్యూఆర్ కోడ్ స్కామ్ బారిన పడితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా చేయండి..

1. బ్యాంక్ ఖాతా నిలిపివేత: వెంటనే మీ బ్యాంక్‌కు ఫోన్ చేసి మీ ఖాతా, కార్డులను ఫ్రీజ్ చేయమని కోరండి.

2. పాస్‌వర్డ్‌ల మార్పు: మీ బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయండి.

3. పోలీసులకు ఫిర్యాదు: స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.

4. ఆన్‌లైన్ పోర్టల్: జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయండి.

ముందు జాగ్రత్తే సైబర్ నేరాల నుండి మనల్ని రక్షిస్తుంది. మీరు చేసే ప్రతి స్కాన్ విషయంలో ఒక నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Property Buying Checklist : ఇల్లు కొంటున్నారా? ఈ 10 డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి!
Recommended image3
Real Estate : రియల్ ఎస్టేట్ పెట్టుబడి రహస్యాలు... ఇలా చేశారో మీరు కోటీశ్వరులు కావడం ఖాయం..!
Related Stories
Recommended image1
Property Buying Checklist : ఇల్లు కొంటున్నారా? ఈ 10 డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి!
Recommended image2
Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved