MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Team India : 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ.. రోహిత్, కోహ్లీ ఉంటారా? ఆ ముగ్గురికి షాక్ !

Team India : 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ.. రోహిత్, కోహ్లీ ఉంటారా? ఆ ముగ్గురికి షాక్ !

Team India : 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్, కోహ్లీ కీలక పాత్ర పోషించనుండగా, ముగ్గురు స్టార్లకు మొండిచేయి తప్పకపోవచ్చు. టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎవరెవరున్నారు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2026, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా మిషన్ సౌతాఫ్రికా
Image Credit : X/BCCI

2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా మిషన్ సౌతాఫ్రికా

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027కు రంగం సిద్ధమవుతోంది. 1983, 2011లో విశ్వవిజేతగా నిలిచిన భారత్, ఇప్పుడు మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. 2027 అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరి ఈ టోర్నీలో టీమిండియా ఎలా ఉండబోతోంది? రోహిత్, కోహ్లీ ఆడతారా? ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కుతుంది? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26
గిల్ సారథ్యం.. సీనియర్ ప్లేయర్ల బలంతో టీమిండియా ప్రయాణం
Image Credit : Getty

గిల్ సారథ్యం.. సీనియర్ ప్లేయర్ల బలంతో టీమిండియా ప్రయాణం

2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పగ్గాలను యువ సంచలనం శుభ్‌మన్ గిల్ చేపట్టే అవకాశం ఉంది. అయితే, దక్షిణాఫ్రికాలోని ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై ఆడాలంటే కేవలం యువత మాత్రమే సరిపోదు. అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల అనుభవం జట్టుకు చాలా అవసరం.

రోహిత్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు తోడుగా నిలిచే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకోనున్నారు. బహుశా రోహిత్, కోహ్లీలకు ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చు, కాబట్టి వారు ఘనమైన వీడ్కోలు కోసం మరోసారి తమ అద్భుతమైన ఆటను కొనసాగించాలని రెడీ అవుతున్నారు.

Related Articles

Related image1
Sanju Samson : వాంఖడేలో సంజూ సునామీ సెంచరీ.. ఒకే ఇన్నింగ్స్‌తో 5 రికార్డులు బద్దలు
Related image2
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
36
మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాటింగ్ లైన్అప్
Image Credit : Getty

మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాటింగ్ లైన్అప్

భారత జట్టు గతంలో మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని అధిగమించడానికి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించనున్నారు. శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు, అలాగే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు జట్టుకు బలంగా ఉంటారు. వీరిద్దరూ మిడిల్ ఆర్డర్‌లో ఉండటం వల్ల టీమిండియాకు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది.

46
ఆల్‌రౌండర్ల హోరు.. జడేజాకు చోటు కష్టమేనా?
Image Credit : X@BCCI

ఆల్‌రౌండర్ల హోరు.. జడేజాకు చోటు కష్టమేనా?

జట్టులో ఆల్‌రౌండర్ల ఎంపిక ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం అతనికి కలిసి వచ్చే అంశం. మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో అత్యంత కీలకం కానున్నాడు. అతను నాలుగో పేసర్ పాత్రను పోషిస్తూ, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా జట్టుకు అదనపు బలంగా ఉంటాడు.

56
టీమిండియా స్పిన్, పేస్ విభాగంలో ఉండేది ఎవరు?
Image Credit : Getty

టీమిండియా స్పిన్, పేస్ విభాగంలో ఉండేది ఎవరు?

దక్షిణాఫ్రికా పరిస్థితులకు తగ్గట్టుగా భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగవచ్చు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తాడు. బుమ్రాకు తోడుగా మహమ్మద్ సిరాజ్‌ను మళ్ళీ వన్డే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మూడో పేసర్‌గా యంగ్ బౌలర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా ఉంటారు. అతనికి తోడుగా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలాన్ని చూపించనున్నాడు.

66
ముగ్గురు ఆటగాళ్లకు షాక్.. బెంచ్‌కే పరిమితం?
Image Credit : Insta/yashasvijaiswal28

ముగ్గురు ఆటగాళ్లకు షాక్.. బెంచ్‌కే పరిమితం?

జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు 15 మంది సభ్యుల జట్టులో ఉన్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం కష్టమేనని తెలుస్తోంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా బెంచ్‌కే పరిమితం కావచ్చు. టీమ్ కాంబినేషన్ దృష్ట్యా ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు ప్లేయింగ్ 11లో చోటుదక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

2027 వన్డే వరల్డ్ కప్ కోసం భారత ప్లేయింగ్ 11 అంచనా

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: అద్దె కట్టని విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌.. షాక్ ఇచ్చిన బెంగళూరు కోర్టు.. అసలు ఏం జరిగింది.?
Recommended image2
IPL 2026: తోపుగాళ్ల తొండాట.! కోట్లు పోసి కొంటే.. కాసేపు కూడా క్రీజులో ఉండట్లే.. లిస్టు చూస్తే షాకే
Recommended image3
Vaibhav Suryavanshi: ఒకటి కాదు రెండు.! బుడ్డోడికే మెంటలెక్కించాడుగా.. మునుపెన్నడూ లేని రికార్డు.!
Related Stories
Recommended image1
Sanju Samson : వాంఖడేలో సంజూ సునామీ సెంచరీ.. ఒకే ఇన్నింగ్స్‌తో 5 రికార్డులు బద్దలు
Recommended image2
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved