MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • GT vs RR : అందరి కళ్లు వైభవ్ పైనే.. గుజరాత్ VS రాజస్థాన్ క్వాలిఫయర్-2.. ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ ఎవరిది?

GT vs RR : అందరి కళ్లు వైభవ్ పైనే.. గుజరాత్ VS రాజస్థాన్ క్వాలిఫయర్-2.. ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ ఎవరిది?

RR vs GT Qualifier 2: ఐపీఎల్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఢీకొంటుండగా, అందరి కళ్లూ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి? మరి ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరు?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 29 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్లైమాక్స్ కు చేరిన ఐపీఎల్ హంగామా.. ఆర్సీబీతో ఫైనల్ ఫైట్ ఎవరిది?
Image Credit : AI Generated

క్లైమాక్స్ కు చేరిన ఐపీఎల్ హంగామా.. ఆర్సీబీతో ఫైనల్ ఫైట్ ఎవరిది?

క్రికెట్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించే టైం వచ్చేసింది. ఐపీఎల్-19 క్లైమాక్స్ సీన్ కి చేరింది. సండే జరిగే మెగా ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడే ఆ రెండో టీమ్ ఏంటో తేల్చేసేందుకు ముల్లాన్‌పుర్ గ్రౌండ్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌ సిద్ధమైంది.

లీగ్ స్టేజ్ లో తోపుల్లా ఆడి, క్వాలిఫయర్-1 లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న గుజరాత్ టైటాన్స్ (GT) ఒకవైపు.. పడుతూ లేస్తూ ప్లేఆఫ్స్‌కు చేరి, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఊచకోత కోసి ఫుల్ జోష్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR) మరోవైపు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ నిజంగా డూ-ఆర్-డై లాంటిదే. ఓడితే ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్లడమే, గెలిస్తే ఫైనల్ టికెట్ సొంతం చేసుకుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి గుజరాత్ బ్రేకులు వేస్తుందా?
Image Credit : ANI

15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి గుజరాత్ బ్రేకులు వేస్తుందా?

ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్, కెమెరాలు, సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ ఒక్కడి పైనే ఉన్నాయి. అతడే 15 ఏళ్ల క్రికెట్ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన ఈ బేబీ బాస్ ఆట చూసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే షాక్ అవుతున్నారు.

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సైతం వైభవ్ బ్యాట్ స్వింగ్ సూపర్ అంటూ మెచ్చుకోగా.. వీరేంద్ర సెహ్వాగ్ అయితే, "వేలంలో వైభవ్ ఉంటే ఏకంగా రూ.30 కోట్లు అయినా పెడతా" అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్‌ల్లో 242.85 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 680 రన్స్ కొట్టిన వైభవ్‌ను గుజరాత్ బౌలర్లు ఎలా ఆపుతారనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

35
రాజస్థాన్ రాయల్స్ స్ట్రాటజీ.. వైభవ్, ఆర్చర్ లపైనే భారం
Image Credit : ANI

రాజస్థాన్ రాయల్స్ స్ట్రాటజీ.. వైభవ్, ఆర్చర్ లపైనే భారం

రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మూడు మ్యాచ్‌ల్లో బ్యాక్-టు-బ్యాక్ విక్టరీలతో ఊపుమీదుంది. బ్యాటింగ్‌లో వైభవ్‌తో పాటు యశస్వి జైస్వాల్ (426 రన్స్), ధ్రువ్ జురెల్ (508 రన్స్) సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఫెరీరా, కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా టచ్‌లో ఉండడం ఆ టీమ్‌కు ప్లస్ పాయింట్.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ రప్పాడిస్తున్నాడు. 24 వికెట్లతో ఆర్ఆర్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తున్నాడు. బర్గర్, బ్రిజేశ్ శర్మ తలా 13 వికెట్లతో అతనికి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లో వైభవ్ పై, బౌలింగ్‌లో ఆర్చర్ పై రాజస్థాన్ టీమ్ ఎక్కువగా డిపెండ్ అవుతుండడం కాస్త రిస్క్ ఫ్యాక్టరే. వాళ్లిద్దరూ ఫెయిల్ అయితే ప్లాన్-బి ఏంటనేది ప్రశ్న.

45
గాయపడ్డ సింహంలా గుజరాత్ టైటాన్స్.. గిల్ సేన కంబ్యాక్ ఇస్తుందా?
Image Credit : ANI

గాయపడ్డ సింహంలా గుజరాత్ టైటాన్స్.. గిల్ సేన కంబ్యాక్ ఇస్తుందా?

లీగ్ స్టేజ్ అంతా కింగ్స్ లా రూల్ చేసి, టాప్-2 లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 లో ఆర్సీబీ చేతిలో 92 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ, గుజరాత్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. ఆ టీమ్ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్.

సాయి సుదర్శన్ (652 రన్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (618 రన్స్), జోస్ బట్లర్ (498 రన్స్)లతో బ్యాటింగ్ లైనప్ సాలిడ్‌గా ఉంది. కాకపోతే వీరిలో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడకపోతే మిడిల్ ఆర్డర్ తేలిపోయే ఛాన్స్ ఉంది. 

బౌలింగ్‌లో మాత్రం కగిసో రబాడ (26 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (17 వికెట్లు) కొత్త బంతితో ప్రత్యర్థులను వణికించడానికి రెడీగా ఉన్నారు. స్పిన్ కింగ్ రషీద్ ఖాన్ (19 వికెట్లు) మిడిల్ ఓవర్లలో ఆర్ఆర్ స్కోరు బోర్డుకు బ్రేకులు వేయగలడు.

55
GT vs RR : హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి? ముల్లాన్‌పుర్‌ పిచ్ రిపోర్ట్ ఇదే
Image Credit : ANI

GT vs RR : హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి? ముల్లాన్‌పుర్‌ పిచ్ రిపోర్ట్ ఇదే

రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే రాజస్థాన్‌పై గుజరాత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 10 సార్లు తలపడగా, గుజరాత్ 7 మ్యాచ్‌ల్లో గెలిచింది, రాజస్థాన్ కేవలం 3 సార్లు మాత్రమే నెగ్గింది. ఈ 2026 సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలా ఒక మ్యాచ్ గెలిచాయి.

ముల్లాన్‌పుర్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అని చెప్పాలి. ఈ సీజన్‌లో ఇక్కడ 220 ప్లస్ టార్గెట్‌లను కూడా టీమ్స్ ఈజీగా ఛేజ్ చేశాయి. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం చిన్నపాటి వర్షం సూచనలు ఉన్నా, మ్యాచ్‌కైతే ఎలాంటి ఢోకా లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Jobs : AI అస్సలు తాకలేదు.. వచ్చే 50 ఏళ్ల వరకు ఫుల్ సేఫ్‌గా ఉండే టాప్ ఉద్యోగాలు ఇవే
Recommended image2
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved