MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్-కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక సెలక్టర్ల ఒత్తిడి? షాకింగ్ రిపోర్టు

రోహిత్-కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక సెలక్టర్ల ఒత్తిడి? షాకింగ్ రిపోర్టు

Rohit Sharma Virat Kohli Test Retirement: భార‌త స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక సెలక్టర్ల ఒత్తిడి ఉందా? తాజా నివేదికల ప్రకారం కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2025, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Rohit Sharma Virat Kohli: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. మే 7న రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. మే 12న విరాట్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రోహిత్ రిటైర్మెంట్ వెనుక ఒత్తిడా?

ఈ స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తాజాగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ సెలెక్షన్ విషయంలో భారత సెలక్టర్లు స్పష్టత లేకుండా ప్రవర్తించారని సమాచారం. వారు రోహిత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో పూర్తిగా ఆడే అవకాశం లేదనీ, కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడవచ్చని తెలిపారు. దీనివల్ల రోహిత్ నిరుత్సాహంతో రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఒక బోర్డు సభ్యుడు వెల్లడించిన ప్రకారం.. "సెలక్టర్లు రోహిత్ స్థానంపై స్పష్టత చూపలేదు. దీంతో ఆయన ఒత్తిడిలో ఉన్నారు. ఆయన్ను రెండు టెస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది" అని చెప్పారు.

36

కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు? 

విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఆయన స్వయంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కొందరు మీడియా కథనాల్లో BCCI ఒక మాజీ క్రికెటర్‌ను పంపి కోహ్లీని తన నిర్ణయాన్ని మార్చమని చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి అలాంటిది జరగలేదనీ, కోహ్లీ తన నిర్ణయాన్ని స్వయంగా తీసుకున్నాడు. బోర్డు ఎవరినీ పంపలేదు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

46
Virat and Rohith

Virat and Rohith

గ్రేడ్ A+ కాంట్రాక్టులోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ 

టెస్ట్, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్దరూ ఇప్పటికీ బీసీసీఐ గ్రేడ్ A+ కాంట్రాక్టులో కొనసాగుతారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ ఇద్ద‌రు స్టార్లు భారత క్రికెట్‌లో భాగంగా ఉంటారు. గ్రేడ్ A+ లభ్యమయ్యే అన్ని సౌకర్యాలు అందుకుంటార‌ని తెలిపారు. 

56

విరాట్ కోహ్లీ  క్రికెట్ కెరీర్ 

కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్ట్ మ్యాచ్‌లలో 9230 పరుగులు సాధించారు. అతని అత్యధిక వ్యక్తిగ‌త‌ స్కోర్ 254 ప‌రుగులు. త‌న‌ టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే 302 మ్యాచ్‌లు ఆడి 14181 పరుగులు చేశాడు. 57.88 సగటుతో 51 సెంచ‌రీలు బాదాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ 125 మ్యాచ్‌లు ఆడి 48.69 స‌గ‌టుతో 4188 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. 

66

రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ 

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న టెస్టు కెరీర్ లో 67 మ్యాచ్ లు ఆడి 40.57 స‌గ‌టుతో  4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు కూడా ఉన్నాయి. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే 273 మ్యాచ్‌లు ఆడి 48.76 స‌గ‌టుతో  11168 పరుగులు చేశాడు. రోహిత్ శ‌ర్మ 159 టీ20 మ్యాచ్‌లు ఆడి 4231 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2025లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న టాప్-5 బ్యాట్స్‌మెన్
Recommended image2
SRH IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved