MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma Records: లార్డ్స్ లో రోహిత్ శర్మ తుపాను.. చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని వరల్డ్ రికార్డ్ !

Rohit Sharma Records: లార్డ్స్ లో రోహిత్ శర్మ తుపాను.. చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని వరల్డ్ రికార్డ్ !

Rohit Sharma Records: విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు హిట్ మ్యాన్. లార్డ్స్ వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 20 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ కొత్త చరిత్ర
Image Credit : X/BCCI

లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ కొత్త చరిత్ర

భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ గ్రౌండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు. 

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించిన రోహిత్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బద్దలు
Image Credit : X/BCCI

క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బద్దలు

అంతర్జాతీయ క్రికెట్‌లో సేనా (SENA - సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ సేనా దేశాలపై ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 342 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఆ రికార్డును అధిగమించి 343 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఒక భారీ సిక్సర్ బాదడం ద్వారా రోహిత్ ఈ మైలురాయిని దాటాడు. రోహిత్ సేనా దేశాలపై కొట్టిన సిక్సర్ల వివరాలు చూస్తే.. ఆస్ట్రేలియాపై 138, ఇంగ్లాండ్ పై 58, న్యూజిలాండ్ పై 83, సౌతాఫ్రికాపై 64 సిక్సర్లు ఉన్నాయి.

Related Articles

Related image1
Nagadurga Top 5 Folk Songs: నాగవ్వతో నాగదుర్గ రచ్చ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !
Related image2
Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
35
లార్డ్స్‌లో తొలి భారత సెంచరీ వీరుడు
Image Credit : X/BCCI

లార్డ్స్‌లో తొలి భారత సెంచరీ వీరుడు

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం సిక్సర్ల రికార్డే కాకుండా మరికొన్ని అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వన్డే ఫార్మాట్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 84 బంతుల్లోనే తన వన్డే కెరీర్‌లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఇంగ్లాండ్‌లో 7 వన్డే సెంచరీలు చేసినప్పటికీ, లార్డ్స్‌లో సెంచరీ చేయాలనే కల మాత్రం జూలై 19న నెరవేరింది. దీనితో పాటు, ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత వయసు పైబడిన ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు.

45
ఇంగ్లాండ్ గడ్డపై 1500 వన్డే పరుగులు
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్ గడ్డపై 1500 వన్డే పరుగులు

లార్డ్స్ వన్డే ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 32 బంతుల్లోనే 35 పరుగులు పూర్తి చేసి, ఇంగ్లాండ్‌లో 1500 వన్డే పరుగులు పూర్తి చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతేకాకుండా, సేనా దేశాలపై ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9000 అంతర్జాతీయ పరుగులను కూడా రోహిత్ పూర్తి చేశాడు. 

ఇది రోహిత్ శర్మకు చివరి వన్డే మ్యాచ్ కానుందనే ప్రచారం జరిగినప్పటికీ, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ వార్తలను కొట్టిపారేశారు. ఈ మ్యాచ్ రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని ఆయన స్పష్టం చేశారు.

55
ఉత్కంఠభరిత పోరులో రోహిత్ అవుట్
Image Credit : X/BCCI

ఉత్కంఠభరిత పోరులో రోహిత్ అవుట్

అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి, బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91) రాణించడంతో లార్డ్స్ మైదానంలో రికార్డు స్థాయిలో 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 146 బంతుల్లో 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసి లార్డ్స్ ప్రేక్షకులను అలరించాడు. చివరకు జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తుండగా విరాట్ కోహ్లీ అతడిని అభినందించాడు. లార్డ్స్ స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో రోహిత్‌కు పెవిలియన్ వీడ్కోలు పలికారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Nagadurga Top 5 Folk Songs: నాగవ్వతో నాగదుర్గ రచ్చ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !
Recommended image2
Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved