MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma ODI Retirement: లార్డ్స్ వన్డేనే లాస్ట్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ !

Rohit Sharma ODI Retirement: లార్డ్స్ వన్డేనే లాస్ట్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ !

Rohit Sharma ODI Retirement: 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ శర్మ లేడని సెలక్టర్లు తేల్చేశారని సమాచారం. జూలై 19న లార్డ్స్ లో జరిగే మ్యాచ్ రోహిత్‌కు చివరి వన్డే కానుందని టాక్ నడుస్తోంది. నిజంగానే రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హిట్ మ్యాన్ కు షాక్.. లార్డ్స్ లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డే కానుందా?
Image Credit : Getty

హిట్ మ్యాన్ కు షాక్.. లార్డ్స్ లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డే కానుందా?

భారత క్రికెట్ అభిమానులకు అస్సలు ఊహించని షాకింగ్ న్యూస్ ఇది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చేసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. లార్డ్స్ లో జూలై 19న ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేనే రోహిత్ కెరీర్‌లో చివరి వన్డే మ్యాచ్ కాబోతోందంటూ ఇంటర్నెట్‌లో ఒక రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. బీసీసీఐ సెలక్టర్లు రోహిత్‌కు ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పేశారని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లార్డ్స్ మ్యాచ్ హిట్ మ్యాన్ ఆఖరి వన్డేనా?
Image Credit : X@BCCI

లార్డ్స్ మ్యాచ్ హిట్ మ్యాన్ ఆఖరి వన్డేనా?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలో రోహిత్ శర్మ అభిమానులు అస్సలు తట్టుకోలేని వార్త బయటకు వచ్చింది. లార్డ్స్ లో జూలై 19న జరిగే మూడో వన్డేనే హిట్ మ్యాన్ వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుందని తెలుస్తోంది. బోర్డ్ సెలక్టర్లు రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో గత వారం మాట్లాడినట్లు సమాచారం. సీనియర్ సెలక్షన్ కమిటీ ఇకపై రోహిత్ వైపు చూడటం లేదని, భవిష్యత్తు కోసం యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందని టాక్.

Related Articles

Related image1
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Related image2
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
36
2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ లేడు..
Image Credit : Getty

2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ లేడు..

2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను ఆడించే ఉద్దేశం సెలక్టర్లకు లేదని సమాచారం. యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ టాలెంట్‌కు టీమ్‌లో రెగ్యులర్ ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. రోహిత్ వయసు, అతని ప్రస్తుత ఫామ్ చూసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. "ఇంగ్లండ్ టూర్ తర్వాత మా ప్లాన్స్‌లో నువ్వు లేవు, మేము ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తున్నాం" అని సెలక్టర్లు రోహిత్‌కు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, ఫిట్‌నెస్‌పై వర్కవుట్ చేసి ఇంకా ఆడాలని రోహిత్ అనుకున్నా, చివరి నిర్ణయం మాత్రం అతనికే వదిలేశారని సమాచారం.

46
బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ అసంతృప్తి.. గిల్ కొత్త కెప్టెన్
Image Credit : ANI

బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ అసంతృప్తి.. గిల్ కొత్త కెప్టెన్

ఈ డెసిషన్‌తో రోహిత్ శర్మ అస్సలు హ్యాపీగా లేడని తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో అతను కొంతమంది బీసీసీఐ అధికారులతో కూడా దీని గురించి మాట్లాడాడట. ఫ్యూచర్ టీమ్‌ను రెడీ చేసే ప్రాసెస్‌లో భాగంగా సెలక్టర్లు గత ఏడాదే రోహిత్ నుంచి వన్డే కెప్టెన్సీని కూడా తీసేసుకున్నారు. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు వన్డే టీమ్ నుంచి కూడా రోహిత్‌ను పక్కన పెట్టే టైమ్ వచ్చేసిందని అతనికి స్పష్టం చేసేశారు.

56
టెస్ట్, టీ20ల తర్వాత ఇప్పుడు వన్డే వంతు
Image Credit : AFP

టెస్ట్, టీ20ల తర్వాత ఇప్పుడు వన్డే వంతు

నిజానికి రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పేశాడు. 29 జూన్ 2024న ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కొన్ని గంటల్లోనే ఆ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత 7 మే 2025న ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ముందు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా టెస్ట్ క్రికెట్‌కు కూడా బైబై చెప్పేశాడు. యంగ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేసే పాలసీ వల్లే యశస్వి జైస్వాల్ లాంటి ఇన్-ఫామ్ ప్లేయర్లు సెంచరీలు కొట్టినా కొన్నిసార్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

66
కార్డిఫ్ వన్డేలో పేలవ ప్రదర్శన.. కోహ్లీ పరిస్థితి ఏంటి?
Image Credit : Rohit Sharma\BCCI

కార్డిఫ్ వన్డేలో పేలవ ప్రదర్శన.. కోహ్లీ పరిస్థితి ఏంటి?

రీసెంట్‌గా జరిగిన కార్డిఫ్ వన్డేలో రోహిత్ శర్మ దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. 17వ ఓవర్ లో సామ్ కరన్ బౌలింగ్ లో ఒక్క రన్ కూడా తీయలేక మెయిడిన్ ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఓవర్ లో విల్ జాక్స్ బౌలింగ్ లో వరుసగా 3 డాట్ బాల్స్ ఆడి, నాలుగో బంతికి బ్యాడ్ స్వీప్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు.

అంతకుముందు ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో 11 రన్స్ చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్‌పై 79, 48, 16 రన్స్ చేశాడు. గత ఐపీఎల్ కూడా అతనికి అస్సలు కలిసిరాలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా స్కానర్ లో ఉన్నాడు. కానీ రెండో వన్డేలో కోహ్లీ 65 రన్స్ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్ భవిష్యత్తు ఏంటనేది లార్డ్స్ మ్యాచ్ తో తేలిపోనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Recommended image2
Axar Patel: మంట పుట్టించిన అక్షర్ పటేల్.. సచిన్, పాండ్యా రికార్డులు బ్రేక్
Recommended image3
Shubman Gill: కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్‌హామ్‌లో మనోడి నయా హిస్టరీ !
Related Stories
Recommended image1
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Recommended image2
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved