MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్ శర్మ మ‌రో అరుదైన ఘనత.. సచిన్ రికార్డును అందుకున్న హిట్‌మ్యాన్

రోహిత్ శర్మ మ‌రో అరుదైన ఘనత.. సచిన్ రికార్డును అందుకున్న హిట్‌మ్యాన్

Rohit Sharma: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. శనివారం (అక్టోబర్ 3) వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో వన్డేలో ఈ మైలురాయిని అందుకున్నాడు.

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 03 2026, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సచిన్, జయసూర్య, గేల్ సరసన రోహిత్
Image Credit : Facebook/ Indian Cricket Team

సచిన్, జయసూర్య, గేల్ సరసన రోహిత్

రెండో వన్డే ముగిసే సమయానికి రోహిత్ ఓపెనర్‌గా 9,998 పరుగులు చేశాడు. దీంతో మూడో వన్డేలో మరో రెండు పరుగులు చేయగానే 10,000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. మొత్తంగా 203 వన్డేల్లో 201 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్‌గా వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్‌కు ముందు ముగ్గురు దిగ్గజాలు ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అగ్ర‌స్థానంలో స‌చిన్‌..
Image Credit : ANI

అగ్ర‌స్థానంలో స‌చిన్‌..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15,310 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 1994 నుంచి 2012 మధ్య 344 ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు చేశాడు. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 383 ఇన్నింగ్స్‌ల్లో 12,740 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 274 ఇన్నింగ్స్‌ల్లో 10,179 పరుగులు సాధించాడు. ఇప్పుడు రోహిత్ కూడా ఈ ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు.

33
వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్
Image Credit : ANI

వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్

ఓపెనర్‌గా 10,000 వన్డే పరుగుల మార్క్‌ను రోహిత్ 202వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. దీంతో ఈ ఘనతను వేగంగా సాధించిన ఓపెనర్లలో రోహిత్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ నిలకడగా పరుగులు చేయడం వల్లే ఈ మైలురాయిని అందుకోగలిగాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఓపెనర్‌గా సుదీర్ఘ కాలం రాణించిన రోహిత్.. ఈ ఘనతతో తన కెరీర్‌లో మరో ముఖ్యమైన రికార్డును నమోదు చేశాడు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma: తిలక్ వర్మ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. 22 బంతుల్లోనే తెలుగోడి మాస్ విధ్వంసం
Recommended image2
India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 హైవోల్టేజ్ ఫైనల్.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ గెలిచిన భారత్
Recommended image3
Yuzvendra Chahal Retirement: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు యుజ్వేంద్ర చాహల్ గుడ్‌బై.. అసలు కారణం ఏమిటి?
Related Stories
Recommended image1
డ‌బ్బులుంటే ఇప్పుడే కొనేయండి.. త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం
Recommended image2
హైద‌రాబాద్‌కు దూరంగా కొత్త రియ‌ల్ హ‌బ్‌.. ఐటీ ఉద్యోగుల చూపంతా అటు వైపే ఎందుకు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved